Skip to main content

'క్విక్‌'గా బ్యాంకు సేవలు - Services of SBI Quick

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సైతం కొత్త సేవల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటే బ్యాంకు సేవలు సులభం అవుతాయి. బ్యాంకు ఖాతాల సమాచారం తెలుసుకునేందుకు బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. గంటల తరబడి క్యూలో నిలవాల్సిన పనిలేదు. నేరుగా ఇంట్లోనే తమ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాయి పలు బ్యాంకులు. వీటిలో అత్యధిక ఖాతాదారుల ను కలిగిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారి కోసం క్విక్‌ యాప్‌ను అందుబాటులోకి తీసు కువచ్చింది. దాని ప్రయోజనా లేంటో తెలుసుకుందాం..
తమ ఖాతాదారులకు సుల భంగా అకౌంట్‌ వివరాలు తెలు సుకునేందుకు వీలుగా ఎస్‌బీఐ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్‌ ఫోన్లు కలిగిన ప్రతి ఒక్కరూ గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఇవీ సేవలు...
యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయగానే..
ముందుగా అకౌంట్‌ సర్వీసులు ఉంటాయి. మొదట మొబైల్‌్‌ఫోన్‌ సంఖ్యను రిజిస్టర్‌ చేయించుకోవాలి. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం వివరాలు, గతంలో జరిపిన లావాదేవీల వివరాలతో పాటుగా ఆరు నెలల లావాదేవీలు, విద్యా, గృహ నిర్మాణ రుణాల వివరాలు ఉంటాయి. దీనిలో అవసరమైన సమాచారం కోసం దానిపై క్లిక్‌ చేస్తే సమాచారం క్షణాల్లో సూక్ష్మ సందేశం ద్వారా వస్తుంది.
రెండో అంశం గా ఏటీఎం కార్డుకు సంబం ధించిన నిర్వహణ వివరాలు ఉంటా యి. ఇందులో ఏటీఎం కార్డును రద్దు చేసే అవకాశం నేరుగా ఖాతాదారులకు ఉంది. కార్డును నిలుపుదల చేయటం, తిరిగి కొనసాగించే వీలు ఉంది.
ఏటీఎం పిన్‌ మార్పు కోసం బ్యాంకుకు వెళ్లకుండానే నేరుగా సెల్‌ఫోన్‌ ద్వారా మార్చుకోవచ్చు.
మూడో అంశంగా కారు, గృహ రుణాలకు సంబంధించి బ్యాంకులు అందిస్తున్న సేవల వివరాలు పొందవచ్చు.
నాలుగో అంశంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా పథకాల నమోదు, చెల్లింపులు చేసుకోవచ్చు.
ఐదో అంశంగా ఎస్‌బీఐ బడ్డీ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా మొబైల్‌ఫోను రీఛార్జ్‌, డిష్‌ టీవీ రీఛార్జ్‌, సినిమా టికెట్లు, బస్సు, రైలు, విమాన టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. బీమా పథకాల ప్రీమియం సొమ్ము చెల్లింపులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ రకాల కొనుగోళ్లు చేసుకునే సదుపాయం ఉంది.
వినియోగిస్తే ఎంతో ప్రయోజనం
ప్రస్తుతం జిల్లాలో ఇంచుమించుగా ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకు శాఖలు మాత్రం ప్రతీ చోటా అందుబాటులో లేవు. ప్రతీ పనికి సుదూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకులకు వెళ్లటం కష్టతరం. ముఖ్యంగా మన్యంలో ఇదే పరిస్థితి. అటువంటి తరుణంలో క్విక్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిపై అవగాహన వచ్చి వినియోగించటం మొదలు పెడితే బ్యాంకుకు వెళ్లవలసిన అవసరమే ఉండదు. ఇటువంటి సేవలపై బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వఛంధ సంస్థలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

వివాహ దినోత్సవం

నమ్మకం.. గౌరవం.. అనురాగం.. నేడు వివాహ దినోత్సవం నవతెంగాణ ` ఆదిలాబాద్‌ టౌన్‌ నమ్మకం, గౌరవం, కష్టాు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఁబడడం, మానసికంగా ఆంబన కగజేయడం, మనసా, వాచా కర్మేణా తన భాగస్వామితోనే జీవన సౌఖ్యాను పొందడం, సత్సంతానంగా పుట్టిన బిడ్డను పెంచి పెద్ద చేయడం, ఇద్దరి తల్లిదండ్రును గౌరవించి ఆదరించడం, వృద్ధాప్యంలో తోడూనీడగా జీవన సంధ్యఁ గడుపుకోవడం! ఇదే వివాహ బంధం.. ఇలా ఉంటేనే అది అన్యోన్య దాంపత్యం.. పెండ్లంటే ఇంకేదో కాదు. ప్రేమలో పడడం. ప్రతిరోజూ ఒకే వ్యక్తితో ప్రేమలో పడడం. ఆ ప్రేమలో ఎంత లోతు ముఁగితే, పెండ్లి అంత విజయవంతమైనట్టు. నేడు ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం వివాహం ఒక లేలేత గులాబీ పూత లాంటిది. కంచె పెట్టినంత శ్రద్ధగా, నీళ్లుపోసినంత ప్రేమగా, ఎరువులేసినంత నైపుణ్యంగా... వివాహ బంధాన్నీ కాపాడుకోవాలి. అప్పుడే కాపురం పచ్చగా ఉంటుంది! వివాహ వ్యవస్థలో ఎన్నో లోపాున్నాయి.. కోపాున్నాయి.. గొడమన్నాయి.. రాజీున్నాయి.. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఆడ, ఒక మగ.. ఇద్దర్నీ ఒక్కటి చేసేందుకఁ ఇంతకంటే బమైంది.. ఇంతకంటే పవిత్రమైంది.. ఇంతకంటే చట్టబద్ధమైంది.. ఇంకే మార్గం లేదు. నవతెం...