పురపాలక సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12 న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని, ఈ నెల 12 నుండి 17 వరకు అభ్యంతరాలు, అక్షేపణలు స్వీకరించి, ఈ నెల 18న ఫైనల్ జాబితాను ప్రకటించాలని అన్నారు. ఆయా వార్డులలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, ఫైనలైజేషన్ చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సీందిని సమకూర్చుకోవాలని అన్నారు. పోలింగకు అవసరమైన బ్యాలట్ బాక్సులు, బ్యాలట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ల గుర్తింపు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి అశోక్ కుమార్, మున్సిపల్ పరిపాలన సంచాలకురాలు శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ జి. సంధ్యారాణి, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, సహాయ కమ...