అతి వేగంగా వెళ్లే వాహనాలకు చెక్ పెట్టనున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులు.
నూతన సాంకేతిక పరిజ్ఞానం తో అతివేగానికి సాక్షాలతో సహా నిరూపణ
స్పీడ్ లేజర్ గన్ పరిజ్ఞానంతో ఆకస్మికంగా జాతీయ రహదారులపై డేగ
కన్ను , ఆదిలాబాద్ పట్టణ శివారు దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద ప్రధాన రహదారి పై
స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పి:*
ప్రధాన రహదారులపై స్పీడ్ లేజర్ గన్ ల ఏర్పాటు
నిర్దేశించిన వేగాన్ని అతిక్రమిస్తే రూ,1400 జరిమాన
నేరుగా ఇంటికే జరిమాన రశీదు
నిబంధనలు పాటించాలన్న ఎస్పీ
మంగళవారం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ప్రధాన రహదారిపై స్పీడ్ లేజర్ గన్స్
తో డెమో నిర్వహించిన అనంతరం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు
చేసిన మీడియా సమావేశం లో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అందులో తప్పుచేసిన వారు మరియు చేయని వారు కూడా రోడ్డు ప్రమాదాలవల్ల ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, ప్రమాదాలు జరుగుటకు కారణమైన అంశాలలో అతి వేగం కూడా ప్రధాన కారణం అని, వాహనాల అతి వేగమును నియంత్రించుటకు మెట్రో నగర శివారు ప్రాంతంలో ఉపయోగించే అత్యాధునిక పరిజ్ఞానం ను జిల్లాలోనీ జాతీయ రహదారులపై గ్రామీణ ప్రాంత రోడ్లపై ఉపయోగించడం జరుగుతుందని, రోడ్డు ప్రమాదాలవల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డునపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రమాదాల నివారణ గురించి స్పీడ్ లేజర్ గన్ ద్వారా వేగాన్ని నివారించవచ్చని, స్పీడ్ లేజర్ గన్ అతి వేగంగా వచ్చే వాహనాన్ని ఫోటో తీసి డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా "స్పీడ్ లేజర్ గన్" వాహన వేగాన్ని లెక్కిస్తుంది, వేగం పరిమితికి మించి ఉంటే ఫోటోతో పాటు వాహనం నెంబరు యజమాని వివరాలు నిక్షిప్తమై ఆన్ లైన్ ద్వారా సర్వర్ కు వెళ్తాయి దాంతో వెంటనే జరిమాన జనరేట్ అవుతుంది. వాహన యజమానదారునికి 200 మీటర్ల దూరం వెళ్లేలోపు అతడి ఫోనుకు మెసేజ్ రూపంలో జరిమాన వెళుతుంది. మరియు అక్కడి నుండి వాహన యజమానికి జరిమాన రశీదు తన ఇంటికి వెళుతుందని వేగం అధికంగా ఉన్న వాహనాలకు 1400 రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని అట్టి డబ్బులను వాహన యజమానులు పేటియం, ఈ సేవ, మీసేవ, ద్వారా చెల్లించవలసి ఉంటుందని తెలిపినారు. ఇది కేవలం వాహన వేగాన్ని తగ్గించడానికి ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించి అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. మన జిల్లాలో ప్రధానంగా 44వ జాతీయ రహదారిపై మరియు రాష్ట్ర రహదారులపై ఉపయోగించడం జరుగుతుందని అలాగే జిల్లాలో ఇతర రోడ్ల మీద నిత్యం ప్రమాదాలు ప్రాంతాలను గుర్తించడం జరిగిందని అక్కడ సైనింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి స్పీడ్ కంట్రోల్ లేజర్ గన్స్ ను ఉపయోగించడం జరుగుతుందని, ప్రజలు వాహనదారుల రక్షణ కోసం ప్రమాదాల నివారణ కై ప్రమాదాల నియంత్రణ గురించి స్పీడ్ లేజర్ గన్ ఉపయోగించడం జరుగుతుందని తెలిపినారు.మూడు సార్లు జరిమాన చెల్లించని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపినారు. ఆదిలాబాద్ జిల్లాకు రెండు స్పీడ్ లేజర్ గన్స్ ను కేటాహించడం జరిగిందని, అధునాతన టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందిని, ఆటోమేటిక్ సిస్టం ద్వారా వాహనం యొక్క వేగాన్ని పసిగడుతుందన్నారు. జిల్లాలో వాహనదారులకు ప్రజలకు స్పీడ్ లేజర్ గన్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. స్పీడ్ లేజర్ గన్ ఒక్కోదాని విలువ రూ"9,50 లక్షలు. ఉంటుందన్నారు, ఈ స్పీడ్ మేజర్ గన్ ఎలా ఉపయోగించాలనే దానిపై జిల్లాలో ఇద్దరు పోలీసులకు నవీన్ కుమార్ , రెహమాన్ హైదరాబాద్ లో శిక్షణ పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ గ్రామీణ సి ఐ ఏ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ వి సాయన్ రావు, మావల ఎస్ఐ సయ్యద్ ముజాహిద్, సాంకేతిక పరిజ్ఞాన జిల్లా ఇన్చార్జి సింగజ్ వార్ సంజీవ్ కుమార్, ముజాహిద్, సహరే కిషోర్, జోగు శివ తదితరులు
పాల్గొన్నారు..
Comments
Post a Comment