Skip to main content

పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి - ఎస్పీ


పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. శుక్రవారం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ధర్మ జీ పేట్ ఆదివాసీ గిరిజన కోలామ్ సభ్యులు 50 మంది జిల్లా ఎస్పీ ని కలిశారు, మొదటిసారిగా జిల్లా ఎస్పీని కలవడంతో శాలువాతో ఎస్పీని సన్మానించి అనంతరం ఎస్పి తో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు కోడప సోనే రావు పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అర్ధరాత్రి తన వద్దకు రావచ్చని స్పష్టం చేశారు. సమస్యలను ముందుగానే పరిష్కరించడానికి గ్రామాలను సందర్శిస్తున్నట్టు వివరించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించబడనికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాలను చేతిలో తీసుకోవద్దని, సంయమనంతో ప్రశాంతంగా ఉండాలన్నారు, చట్ట పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వాధికారులు, ఆదివాసీ గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. జిల్లా పోలీసులు ఆదివాసుల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లా పోలీసులపై ప్రభుత్వ యంత్రాంగంపై మాకు మాకు నమ్మకం ఉందని ఎలాంటిసమస్యలున్నా ముందుగానే అధికారులకు తెలియజేసి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు, మా గ్రామస్తులకు ఎస్పీ ఎంతో ఆప్యాయంగా పలకరించాలని, జిల్లా కలెక్టర్,ఎస్పీ లపై మాకు పూర్తి నమ్మకం ఉందని సూచించారు, మా అభివృద్ధి కోసం ఇరువురు అధికారులు అహిర్నిషలు కృషి చేస్తున్నారని కొనియాడారు.  సమావేశంలో దర్మోజిపెట్ గ్రామ పటేల్ టేకాం భీమ్ రావు, ఆదివాసీల సమన్వయకర్త ఎస్ ఐ మేస్రం చంద్రబాన్, 50 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ప‌ల్లె‌ను క‌విత్వ శిలాఫ‌ల‌కం చేసిన కుర్మె - GR Kurme Shilaafalakam

      ప్రకృతి లేని కవిత్వముండదు. కవిత్వానికి మొదటి వస్తువు ప్రకృతి. కవి రచయిత తన రచనా వ్యాసాంగంలో ఏదో ఒక రూపంలో ప్రకృతి పచ్చదనం ఇమిడి పోతుంది.       ఈ ప్రకృతి ఒడిలో మానవ జీవిత మూలాలను నాగరికత సుఖ దు:ఖాలను, అనుబంధాలను తన ఒడిలో భద్ర పరుచుకున్నదే పల్లె. పల్లెటూరు మనిషి మొదటి చైతన్యానికి సహజీవనానికి మూలం. అటువంటి పల్లెను అనేక కోణాలలో ఆవిష్కరిస్తూ చక్కని కవిత్వం రాసిండు జీఆర్‌ కుర్మె. ఆ కవిత్వమే 'శిలా ఫలకమనే' దీర్ఘ కవిత.       జీఆర్‌ కుర్మె అనగానే పునాది రాయి గుర్తుకొస్తుంది. ముద్దుగుమ్మ నుంచి సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించి ధమ్మపథం, శిలాఫలకం, ఆనవాలు కవితా సంపుటాలను వెలువరించిండు. కుర్మె మంచి కవిగా తెలుగు సాహిత్య లోకానికి పరిచయం. 2016 ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఇతని శిలాఫలకం.. నిజానికి కుర్మె గారు పుట్టిన ఊరు, బాల్యం, ఆనాటి తన ఎత్తు పల్లాల జీవితమే అయినా.. పల్లె నుంచి పట్టణానికి ప్రయాణమైన ప్రతి మనిషి అనుభూతిగా భావించవచ్చు. నిజంగా ఈ పుస్తకం చదివిన వారికి వాళ్లను బాల్యంలోకి తీసుకెళ్తుంది. 'కుగ్రామంగాని గ్ర...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...