పోడు భూముల సమస్యలు, గ్రామాల్లోని ఇరువర్గాల భూ సమస్యలు సున్నితంగా పరిష్కరించడానికి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. కోఆర్డినేషన్ కమిటీలో సీఐ, ఎమ్మార్వో, ఎఫ్ఆర్ఓ సభ్యులుగా ఉంటారని వివరించారు. *గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని జిల్లా స్థాయి అధికారులకు నివేదికలు అందజేసి, పరిష్కార మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తారని పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్ లోని పోలీస్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆటవిశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని పలు ఆదివాసి గిరిజన ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారంపై తీవ్రస్థాయిలో సుదీర్ఘంగా చర్చించి, పలు కీలకమైన అంశాలపై జిల్లా పోలీసు, అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించారు, ఇటీవలే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యచరణ ఏర్పాటు చేసుకొని సమస్యలపై సామరస్యంగా పరిష్కరించే మార్గం చూపాలని ఇరువురు అధికారులు నిర్ణయించారు, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లా అధికారులు నేరుగా సమస్యలను పరిష్కరించి ప్రజలకు వివరించాలనీ నిర్ణయించారు, జిల్లావ్యాప్తంగా గ్రామాల వారీగా సమస్యలున్న ప్రాంతాలను గుర్తించారు, బజార్హత్నూర్ మండలం లోని కోసాయి, డేడ్రా, హర్కాయి, ఇంద్రవెల్లి మండలంలోని కో సాయి పేట, కోతగూడ, ఖండాల, నార్నుర్ మండలంలోని చోర్ గావ్, ఉమ్రి,బొద్దిగుడ, నేరడిగొండ మండలంలోని వాగ్దారి, అడ్డాల తిమ్మాపూర్, సిరికొండ మండలంలోని కన్నాపూర్, బేల మండలంలోని మసాలా, దీపా యి గూడ, రాంపూర్, గుడిహథ్నూర్ మండలం లోని శాంతపుర్, తదితర 23 గ్రామాల్లో పోడు భూముల సమస్యలతో పాటు రెండు వర్గాల మధ్య ఉన్న భూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు, ఇటీవలే కొన్ని గ్రామాల్లో అటవీ భూములను స్వాధీనం చేసుకొని, పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారని, తద్వారా నూతనంగా మారుమూల గ్రామాల్లోని అటవీ భూముల్లో గుడిసెలు వేసి గ్రామ ఆమ్లెట్ లుగా మార్చాన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వివరించారు, జిల్లా యంత్రాంగం ప్రతి సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేయడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తించారు, ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోడు భూములు, భూ సమస్యలపై ప్రధాన దృష్టి సారించామని, ఈ మేరకు అటవీ శాఖ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు, గ్రామాల్లోనీ సమస్యలు పరిష్కరించడానికి జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు, ఈ కమిటీ అధికారులు ప్రతి వారం జిల్లాస్థాయి అధికారులకు నివేదికలు అందిస్తారని తెలిపారు, కమిటీ సూచించిన మేరకు పరిష్కార మార్గాలను అనుసరిస్తారని అన్నారు, మారుమూల గిరిజన ప్రజల సమస్యలపై జిల్లా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని అన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నా అందుబాటులో ఉన్న అధికారులకు తెలియజేసి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏలాంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయన్నారు, ప్రజలకు ఎల్లవేళలా పోలీస్ అధికారులు అందుబాటులో ఉన్నారని, ఎలాంటి సమస్యలున్నా నేరుగా తెలియజేయడానికి చరవాణి లో సంప్రదించవచ్చని తెలిపారు, అనంతరం అదిలాబాద్ డిఎఫ్ఓ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో పోలీసుల సహకారం పూర్తిస్థాయిలో అందుతున్నట్లు వివరించారు, అటవి మార్గాల్లో ఇటీవలే నిర్వహించిన జాయింట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో కలప స్మగ్లింగ్ కు చెక్ పెట్టినట్లు వెల్లడించారు, అటవీశాఖ అధికారుల భద్రతకు పూర్తిస్థాయిలో పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తున్నారని వివరించారు, అత్యవసర సమయంలో పోలీసులు తమ ముందు ఉండి ధైర్యంగా మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు, గత సంవత్సరం నుండి పోలీస్ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అనేక అక్రమ కార్యకలాపాలను అడ్డుకొని అక్రమార్కులను పట్టుకున్నట్లు తెలిపారు, పోలీస్ శాఖ అండతో అటవీ శాఖ సమర్థంగా, నిర్భయంగా పనిచేస్తుందని తెలిపారు, పోడు భూములు, అటవీశాఖ భూ సమస్యలపై ప్రజలకు అవగాహన అవసరం ఉందని పేర్కొన్నారు, ఈ సమావేశంలో శిక్షణ కేంద్రం అదనపు ఎస్పీ టి ఎస్ రవికుమార్, ఉట్నూర్ డిఎస్పి బి, డేవిడ్ ఏసుదాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు, వెంకన్న, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, జిల్లా సిఐలు వి సురేష్, కే నాగరాజు, ఏ ప్రదీప్ కుమార్, ఎన్, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.
మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...
Comments
Post a Comment