Skip to main content

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!




రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ
మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల
విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే
కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల
ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే
మోసం ఇంతా అంతా కాదు.


నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక
రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా
నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి
విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా
మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు
అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌
గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను
భాదిస్తున్నాయి.


రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు
రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం,
పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌
ఒక్కటేంటి.. ఏ సరుకు ధర చూసినా ఆకాశంలోనే.. అన్న రీతిలో ఉంది.
మరోవైపు కూరగాయల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్‌ కూడా
సామాన్యుడికి భారంగానే మారింది. ధరల పెరుగ ుదలకు పేద, మధ్యతరగ తి
ప్రజల పరిస్థితి అగ మ్యగోచరంగా తయారైంది. పెరిగే ధరలతో ప్రజలు
అగ చాట్లు పడుతున్నా వీటిని కట్టడి చేసే నాధుడే కరువయ్యాడు. గ త
పదేండ్లలో ప్రతి సరుకు ధర కనీసం రెండువందల నుంచి నాలుగ ు వందల
రెట్లు పెరిగింది. సగ టు జీవి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉ
ంది.

అన్నీ కల్తీమయం..
ప్రస్తుతం కల్తీ వైరస్‌లా వ్యాపించింది. కల్తీ లేని వస్తువు ఏది అంటే ఒకటికి
నాలుగ ుసార్లు ఆలోంచించినా చెప్పలేం. రోజూ తాగే పాలు నుంచి
మొదలుకొని టీ కోసం వాడే పొడి, కాఫీ పొడి, పంచదార.. ఇలా
అన్నింటిలోనూ కల్తీనే. కల్తీతో వ్యాపారులు లక్షల రూపాయలు సంపాదిస్తుంటే
వాటిని వినియోగించే పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రాణాంతక వ్యాధుల
బారిన పడుతున్నారు. పాలలో నీళ్లు, గ ంజిపోడి, సోడియం బై కార్పోనేట్‌,
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, యూరియా, అమోనియం సల్ఫేట్‌ తదితర
రసాయనాలు కలపడం సర్వసాధారణంగా మారింది. ప్రయివేటు డెయిరీలు
లాభాల కోసం పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా..
నియంత్రించే వారే కరువయ్యారు. టీ, కాఫీ పొడుల్లో జీడిమామిడి పొట్టు,
వాడిన టీ ఆకులు, చికోరి, చింతపిక్కల పొడి, కృత్రిమ రంగ ులు, ఇనుప
రజను, మిర్చి పొడిలో రంపపు పొట్టు, మిరియాల్లో బొప్పాయి విత్తనాలు,
పసుపు పొడిలో రంపపు పొడి, రవ్వలో తవుడు, పంచదారలో సన్నని రాళ్లు
కలిపేస్తున్నారు. ప్రజల ఆరోగ ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రక్కసిని
అరికట్టాల్సిన అధికారులు, పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో..
ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.

తూకాల్లోనూ మోసం..
తూకంలోనూ వినియోగ దారులు అడుగ డుగ ునా మోసపోతున్నారు. పాల
నుంచి పప్పు వరకు, కిరోసిన్‌ నుంచి కూరగాలయ వరకు అన్నీ తప్పుడు
తూకాలే. చిల్లర కొట్టు, బండి నుంచి బడా మాల్స్‌ వరకు అన్నింటా తప్పుడు
తూకాలే. ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్‌లో చేతివాటం.. బంగారం తూచే
మిషన్లలో మోసాలు.. ఎల్పీజీ గ్యాస్‌, పెట్రోల్‌ పంపింగ్‌లోనూ మోసం..
ఇటీవలే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

సబ్సిడీ సరుకులు పక్కదారి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా
అందజేసే సబ్సిడీ సరుకులు కూడా పక్కదారి పడుతున్నాయి. పేదల రేషన్‌
బియ్యం, కిరోసిన్‌, ఇతరత్రా వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయి.
మరోవైపు గ ృ హవినియోగ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు సైతం వాణిజ్య
అవసరాల కోసం పక్కదారి పడుతున్నాయి. వీటిని పర్యవేక్షించి అరికట్టేందుకు
ప్రత్యేక శాఖలున్నా ఎవరూ పట్టించుకోకపోవడం సర్వసాధారణమైపోయింది.


అప్పీలు చేయాలంటే
కింది కోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే 30 రోజుల్లోగా పై కోర్టుకు అప్పీలు
చేసుకోవచ్చు. ఇలా అప్పీలు చేయాలంటే కింది కోర్టు నిర్ణయించిన
పరిహారంలో సగ ం లేదా రాష్ట్ర కమిషన్‌లో అప్పీలుకు రూ.25వేలు, జాతీయ
కమిషన్‌లో రూ.35వేలు వీటిలో ఏది తక్కువైతే అది చెల్లించాలి.

ఇదీ పద్ధతి
సమస్య ఎదురైన వెంటనే ముందుగా వస్తువు అమ్మిన వ్యక్తికి విషయం
తెలియజేయాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే డీలర్‌ను..
పంపిణీదారుణ్ని కలవాలి. అయినప్పటికీ ఫలితం లేకపోతేనే ఫిర్యాదు
చేయవచ్చు.

మీ ఫిర్యాదు స్పష్టంగా సూటిగా ఉండాలి. వినియోగ వస్తువుల విషయంలో
ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు బ్రాండ్‌, మోడల్‌, బ్యాచ్‌/సీరియల్‌ నంబర్లు,
తయారీ తేదీ, కాలం చెల్లే తేదీ, చెల్లించిన ధర, తయారీదారుని పేరు,
చిరునామా, తదితర వివరాలను పేర్కొనాలి. ఆర్థిక సేవల విషయంలో మీ
ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు, సర్టిఫికెట్‌ ఫోలియో నంబర్లు,
బాండ్‌ల నంబర్లు, వాటి విలువ, జారీ చేసిన-గ డువు తేదీలు, పునరుద్ధరణ,
ప్రీమియం చెల్లించిన ఫీజులు, సేవలు అందించిన కంపెనీ లేదా సంస్థ,
ఏజెంటు, కన్సల్టెంట్ల చిరునామా మొదలైన వివరాలు రాయాలి. ఫిర్యాదుకు
సంబంధించిన అన్ని పత్రాలు బిల్లులు, నగ దు రశీదులు ఇతర పత్రాల
ప్రతులను జత చేయాలి. సమస్యనే కాదు.. దానికి ఎలాంటి పరిష్కారం
కోరుకుంటున్నారో కూడా రాయాలి. మీరు చెల్లించిన సొమ్ము వాపసు
కోరుతున్నారా? మీకు కలిగిన నష్టానికి ఎంత పరిహారం కోరుతున్నారు?
ఒకవేళ కోరితే ఇందుకు తగిన కారణాలు ఏంటో వివరించాలి. సమస్య
ఏర్పడిన రెండేండ్లలోపు ఫిర్యాదు చేయాలి. న్యాయవాది ద్వారా లేదా
సొంతంగా వాదించుకోవచ్చు.

వినియోగ దారుల హక్కులు
భద్రత హక్కు: కొనే వస్తువులు, పొందే సేవలు అవసరాలు తీర్చడమే కాక అవి
దీర్ఘకాలం మన్నేలా ఉండాలి. ఈ భద్రత పొందడానికి కొనే వస్తువుల
నాణ్యతను నిర్ధారించుకోవాలి. వీలైనంత వరకు నాణ్యత చిహ్నాలు గ ల
వస్తువులనే కొనాలి.
సమాచారం పొందే హక్కు: కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత,
పరిమాణం, ధరల గ ురించి సంపూర్ణ సమాచారం పొందడం అందరి హక్కు.
వస్తువులు కొనే నిర్ణయం తీసుకునే ముందు సంపూర్ణ సమాచారం
తెలుసుకోండి. అమ్మకందారుల ఒత్తిడికి లొంగి ఏమి కొనవద్దు.
ఎంపిక హక్కు: అనేక రకాల వస్తువులను, సేవలను సరసమైన ధరలలో
పొందడం మన హక్కు. లభిస్తున్న వస్తువులు, సేవలలో ఏది పొందాలనే
ఎంపిక హక్కు మనదేనని గ ుర్తించాలి.
అభిప్రాయం చెప్పే హక్కు: వినియోగ దారుల సంక్షేమార్థం ఆయా
వినియోగ దారుల వేదికపై అభిప్రాయాన్ని చెప్పవచ్చు. ప్రభుత్వం, ఇతర
సంస్థలు ఏర్పాటు చేసే పలు సంఘాల్లో ప్రాతినిథ్యం పొందగ ల రాజకీయేతర,
వాణిజ్యేతర వినియోగ దారుల సంఘాలను కూడా ఏర్పాటు చేసుకోవడం
ప్రాథమిక హక్కు.
న్యాయం పొందే హక్కు: అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరితమైన
పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందే హక్కు.
స్వచ్ఛమైన పర్యావరణం: పర్యావరణానికి ఏ హాని కలగ కుండా ఉండే
వస్తువులను, సేవలను పొందడం వినియోగ దారులుగా హక్కు.

వినియోగ దారుల బాధ్యతలు
అవసరమైన వస్తువులను మాత్రమే కొనడం.
కొనే వస్తువులు గ ురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి.
మోసపూరితమైన ప్రకటనల పట్ల జాగ్ర త్తగా ఉండాలి.
వస్తువుల నాణ్యత పట్ల రాజీపడవద్దు.
కొనుగోలు సమయంలో సరైన రశీదును అడిగి తీసుకోవాలి. కొన్ని రకాల
వస్తువుల విషయంలో గ్యారంటీ /వారంటీ కార్డులను షాపు యజమాని
సంతకం, ముద్రతో సహా తీసుకో వాలి.
నాసిరకం వస్తువుల పట్ల, మోసపూరిత వ్యాపారస్తుల పట్ల వినియోగ దారుల
ఫోరమ్‌లను ఆశ్రయించడానికి వెనుకాడవద్దు.

ఏ ఫిర్యాదు ఎక్కడ?
జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకూ వినియోగ దారుల ఫోరం, కమిషన్లు ఉ
న్నాయి. మరి ఏ సందర్భంలో ఎక్కడ ఫిర్యాదు చేయాలి? వివాదానికి
కారణమైన వస్తువులు... సేవల విలువ... మీరు కోరే పరిహారాలను బట్టి ఇది
ఆధారపడి ఉంటుంది.

నష్ట పరిహారం: 20 లక్షల విలువ వరకు జిల్లా ఫోరమ్‌లోనూ, 20 లక్షల
నుంచి 1 కోటి వరకు రాష్ట్ర కమిషన్‌లోను, 1 కోటి మించిన పక్షంలో జాతీయ
కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. కొనుగోలు చేసిన లేదా నష్టం జరిగిన నాటి
నుంచి రెండేండ్లలోపు ఫిర్యా దు చేయవచ్చు.


ఏయే సందర్భాల్లో..
వినియోగ దారుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం (వినియోగ దారుల రక్షణ
చట్టం-1986)ఉంది. వైద్యులు, న్యాయవాదులు అందించే సేవలు కూడా దీని
పరిధిలోకి వస్తాయి. సేవల్లో.. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత
లోపించినా.. వాటివల్ల మీకు నష్టం వాటిల్లినా పరిహారం కోరడానికి ఈ చట్టం
వీలు కల్పిస్తుంది. ఏయే సందర్భాల్లో మీరు వినియోగ దారుల సంఘానికి
ఫిర్యాదు చేయవచ్చో చూద్దాం!


-నాణ్యత లేని, కల్తీ సరుకులను విక్రయించినప్పుడు
- మందుల దుకాణంలో కాలం చెల్లిన (ఎక్స్‌పైర్డ్‌), నాసిరకం మందులు
అమ్మినా, గ రిష్ట చిల్లర ధరకన్నా ఎక్కువకు విక్రయించినా..
ప్రయివేటు వైద్యుల నిర్లక్ష్యం, సేవా లోపం కారణంగా నష్టం వాటిల్లినా
ప్రభుత్వ వైద్యశాల అయినప్పటికీ చికిత్స కోసం రుసుము (యూజర్‌ ఛార్జీలు)
తీసుకుంటే వినియోగ దారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తుంది.
బ్యాంకు రుసుములు వసూలు చేసే సేవలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు
జీవిత, సాధారణ బీమా కంపెనీలు క్లెయింల పరిష్కారం విషయంలో ఇబ్బంది
పెట్టినప్పుడు
టెలివిజన్‌, ఫ్రిజ్‌లాంటి విద్యుత్‌ ఉపకరణాలు సక్రమంగా పనిచేయనప్పుడు
కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల రైతులకు నష్టం వాటిల్లినప్పుడు
రైల్వేలు, విమానయాన సంస్థలు, విద్యుత్‌ సంస్థ, బ్యాంకులు, బీమా
కంపెనీలు, చిట్‌ఫండ్‌ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా లోపాలుంటే.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...