'అతను దినే రొట్టెల సగం/ ఎద్దుకు వెడ్తడు/ అడ్డ దునక కుక్కకేత్తడు/ ఎంగిలి
కుడితి బర్రెకు / గడ్డిమోపు దుడ్వకు/ గిన్నెడు పాలు పిల్లికి' నోరు నిండా
మాట్లాడిస్తడు/ మంచి చెడ్డలడ్గుతడు. ఈ మాటలు వింటే మనసు వెట్టి చదివితే
మనకు విచిత్రమనిపిస్తది కదా! అవును అనిపించవచ్చు. మనం తల్లిలాంటి పల్లెల్ని
వదిలి పట్నంల బతుకుతున్నం. నిజంగా పల్లెటూరి మనుషుల కపటం లేని మనసులు
మనల్ని మనుషులుగా తయారు చేస్తయి. రైతు నిస్వార్థజీవి. తను బతుకుతూ
బతుకునిచ్చే దానశీలి. ఇటువంటి రైతుల పక్కన ూంటూ, నిత్యం వారి కష్టసుఖాలను
కళ్లారా చూస్తూ మెల్లమెల్లగా కవితలల్లడం నేర్చుకున్నడు మన పల్లెకవి
చరణ్‌దాస్.
చరణ్‌దాస్ అణగారిన వర్గంలో పుట్టినా, పట్టుదలతో తెలుగు పండితుడయ్యిండు.
తెలుగు సాహితీమూర్తులకు గౌరవంగా తలవంచి నమస్కరించిండు. కవులు రచయితల
పద్యాలు, పాటలు కవితల్ని తల్లికోడి పిల్లలకు ఒలిచి పెట్టినట్టు బడి
పిల్లలకు నేర్పిస్తున్నడు. తాను భాషోపాధ్యాయుడై తెలుగు భాషావన్నె చిన్నెలను
గుండెకత్తుకునేట్లు చెప్తు బతుకుతున్నడు. అతనికున్న తెలుగు భాషాభిమానమే
అతని వృత్తి అయింది. అదే జీవనాధారమైంది.
అటు వృత్తిపరంగా సాగిన ఇతని తెలుగు పాఠాలు ఇటు ప్రవృత్తి పరంగా అతన్ని
కవిగా మలిచినై. ఈ విధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి పల్లె అందాలను, పల్లె
తల్లి కన్నీరును చూసి బాధపడ్డప్పుడు రాసిన కవితల్ని, తెలంగాణ ూద్యమంలో
రాసిన కవితల్ని చరణ్‌దాస్ ఈ మధ్య 'నెల పొడుపు' పేరుతో కవితా సంపుటిని
తెచ్చిండుత. ప్రసిద్ధ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా
ఆవిష్కరింపజేసిండు. నిజానికి ఇది ఈ కవికి నెలపొడుపే అయినా కవితా లోకానికి
నిండుదనాన్నిచ్చే పుస్తకం.
ఈ నెల పొడుపులో సుమారు 28 కవితలున్నాయి. ప్రతి కవిత పాఠకుల్ని పానపానంగా
మాట్లాడిస్తది. మర్యాదగా పలుకరిస్తది. ఈ పుస్తకంలోని కవితలన్నీ వస్తుపరంగా,
రూపపరంగా ప్రత్యేకతను సంతరించుకున్నవే. నెల పొడుపు సంపుటి అంతస్సూత్రమంతా
పల్లె బతుకు చిత్రమే అయినా ! కొత్త కవి మెత్తగా రాసే కవి రాసినట్టు పల్లె
అందాలను, ప్రకృతి సోయగాలను, పూల పరిమళాలను, నదుల నడుములను, వాగుల
వొంపుసొంపులను వర్ణించలేదు. ఇతని సూపులు నానాటికీ ప్రపంచీకరణ విషవలయంలో
చిక్కుకొని కొట్టుకుంటున్న పల్లె తండ్లాట మీద పడ్డయి. మాయమందులు రైతు
కుతికెకు ూరితాడును ఎట్లా ముడేసినయో తెలుపుతున్నడు. వాగులన్నీ బొక్కలుదేలి
ఎండిపోయిన వాగుల దీన స్థితిని మన కండ్లముందుంచిండు. ఒకప్పుడు పల్లెలోని
వాగు గురించి చెప్తూ 'ఒకప్పుడు నా ఏరులు పాల ధారలు/ ఇప్పుడు పాత టానిక్
సీసలు/ చెప్పులు.. చీపుర్లు.. అబుల్కం పోట్లాలు' చూశారా పాలధారలే పల్లె
దూపను ఆర్పిన వాగులు నేడు ఏ గతి పాలయ్యాయో. అంతేకాకుండా వాగు తల్లి
పాలధారలు ఆరిపోయినప్పుడు తన పిల్లలైన చేపలు, రొయ్యల బతుకులెట్ల ఆగమైనయో...
'నీల్లు ఇసమై జిమ్మలు, ఎండ్రిక్కాయలు, రొయ్యలు / నా మురుగులీల్లని చూసి
ముక్కు మూసుకున్నయ్' అంటూ ఆవేదన చెందుతడు.
ప్రతి కళకు ప్రకృతే పుట్టినల్లు. పశుపక్షాదుల ధర్మాలు మనిషి ఆచరించి మనుగడ
సాగిస్తున్నడు. ఆ మాటకొస్తే ఆదిమానవుని నిరంతర ప్రయత్నమే సకల శాస్త్ర
కళాతృష్ణకు మూలకారణం. ఆదిలాబాద్‌లో గిరిజనుల సంస్కృతీ జీవనవిధానం ఎంతో
వైవిధ్యమైనది. కలం పట్టిన ఏ ఆదిలాబాద్ కవి అయినా గిరిజనుల గురించి ఎంతో
కొంత రాయకుండా ూండలేడు. ఈ కవైతే గిరిజన గ్రామంలోనే (ఇప్పటికీ కొంత) కన్ను
తెరిచిన వాడు. పల్లె ప్రజలు ఎంత మానవీయ స్పర్శగలవారో గిరిజనులు అంతకన్నా
ఆత్మీయ స్పర్శగలవారు. చరణ్‌దాస్ గిరిజన నృత్యం గురించి ఒక కవితలో
'జంగుబాయి ఇక్మతు, నాగోబా జాతర గమ్మతు, కుక్కి మంచం కుటారు గుమ్మి, ఎటారు
మాట, రేలపాట, గుసాడీ టోపీ.. ఇంకా బతికే ూన్నయి' మా రాజ్యాలేలిన రాజుల
కోట/మినుప గారెలు, బెల్లం కుడుములు / గంటి గటక మా తాతల తిండి. సర్కనూనె
సిన్నీగెల తేనె' ఒక్క సంబరమా ఇంకా చెప్పుకుంటూ పోతే పొద్దాగనంటది.
కవికి గల ప్రాపంచిక దృష్టి, అతని సూక్ష్మ పరిశీలనను బట్టి ఆయన కవితా
నిర్మాణం శైలీల వైవిధ్యం నిర్ధారించబడుతుంది. అతని ఎదుగుదలను కూడా
నిర్ణయిస్తుంది. సామాన్య జనం చూపుకన్నా వారి ప్రాధాన్యత వస్తువుల కన్నా కవి
చూపు, విలువలు, అపురూపాలు భిన్నంగా ూంటాయి. శ్రీశ్రీ కుక్క పిల్ల, అగ్గి
పుల్ల మీద కూడా కవిత్వం రాయొచ్చన్నడు. అంతకంటే మరుగున పడి ూన్న వాటి మీద
కూడా ఎందరో కవులు మంచిమంచి కవితలు రాసిన్రు. చరణ్‌దాస్ కూడా పిడక,
గడ్డపార, బొంత, 'నానమ్మ నషం డబ్బి' మొదలు వాటి గురించి జీవం ూట్టిపడేలా
రాసిండు. నానమ్మ నషం డబ్బి కవితలో.. 'మూడర్రల సంచి / దానిమీద గుండి మూత/
బొందెగుంజి కుప్పజెస్తే తాళం బడ్డట్టు/ దూముడి ఇప్పితే తాళం ఎల్లినట్టు'
అంటూ నషం డబ్బి సంచి విచిత్రం నిర్మాణాన్ని అద్భుతంగా వర్ణించిండు.
అంతేకాదు.. 'అలసిపోయిన ముసలి పానంకు / రిలాక్స్ కోసం సంచి గుంజి / నాలుగు
నషం గుంజులు గుంజితే కపాలం కెక్కిన కిక్కు' అంటూ పల్లెటూరి జీవితంలో దాగి
ూన్న రహస్య సౌందర్యాన్ని కవిత్వీకరించిండు. అదే విధంగా 'బొంత' కవితలో 'దాని
కుట్లు అప్డాల గుర్రాలు /బంగారు అంచు / రంగుల అంగీల పువ్వులు / నులక మంచం
మీద / పరుసుకున్నా, కప్పుకున్నా తలాపుకు పెట్టుకున్నా / కిందవన్నా కింగ్
నిద్రనే!' అంటూ హంసతూళికా తల్పాలను తలదన్నే, వెచ్చని హాయి, అంతులేని
అనుభూతి ఒక్క పల్లె నుంచి వచ్చిన కవికి మాత్రమే వర్ణించ సాధ్యమవుతుంది.
ప్రపంచంలో వచ్చిన వస్తున్న అస్తిత్వ ూద్యమాల ఫలితంగానే మనిషి తనను తాను
బహుముఖాలుగా చూసుకుంటున్నడు. తానేమిటి,, తన మూలాలెక్కడని తరచితరచి
తర్కించుకుంటున్నడు. ఈ నేపథ్యంలోనే తన భాష, చరిత్ర, సంస్కృతి, వారసత్వాలకు
మళ్లీ ప్రాణం పోసుకుంటున్నడు. తన భాష, యాసలు కూడా గొప్పవనే ఎరుగలోంచి
నినదిస్తున్నడు. తెలంగాణ ప్రాంతం గత వంద సంవత్సరాల నుంచి ూర్దూ భాష,
ఆంధ్రభాష కోరల్లో విలవిల్లాడి తెలంగాణ మలిదశ ూద్యమంతో తనను తాను రుజువు
చేసుకుంటున్నది. గత 60 సంవత్సరాల నుంచి బుద్ధి జీవులు సైతం తెలంగాణ భాషను,
యాసను చిన్నచూపు చూసిన్రు. చరణ్‌దాస్ తెలంగాణ మలిదశ ూద్యమంలో కాలికి
గజ్జెకట్టి ధూంధాం ఆడినోడు. తన పాటలతో ప్రజల్ని ూషారు జేసినోడు. తన కవితలు,
పాటలను తెలంగాణ యాసలో రాసి ఔరా! తెలంగాణ భాష ఇంత గొప్పదా అని పక్కవారు
ముక్కున వేలేసుకునేట్టు రాసిండు. అందుకే తన నెల పొడుపులోని కవితలన్నీ
అచ్చమైన తెలంగాణ భాషలనే మనల్ని పలుకరిస్తయి. మట్టిమనుషుల శ్వాసనే
వినిపిస్తయి. ూదా..కు ఇక్కడ ఒక కవితలో ' తెల్లారుజామట్టు కోడి పుంజు కూత /
కొట్టాల గూసుండి సుట్టగుంజుతున్న తాత /పెంటదోడుకుంట పిల్లల్ని మేపుతున్న
కోడి' అంటూ పల్లె చిత్రాన్ని తల్లి భాషలో మన కళ్లముందుంచుతడు. అదే విధంగా
తంగేడు పూల గురించి రాస్తూ 'బొడ్డెమ్మకు వొడ్డాణమైంది/బతుకమ్మకు మెతుకు
నిచ్చింది' అంటూ తంగేడు పువ్వు తెలంగాణ జనజీవితంలో ఎలా భాగమైపోయిందో
వివరిస్తడు.
చరణ్‌దాస్ మట్టి మనుషుల మధ్య బతుకుతున్న కవి. మట్టి బెడ్డల గోసను
వింటున్న కవి. అందుకే అతని కవితలో స్వచ్ఛత, ఆప్యాయత, ఆత్మీయత, కరుణ
కదలాడుతై. అతనెంత సాదాగా ూంటడో అతని వాక్యమూ అంతే సాదాగా ూంటది. వాక్యంలో
ఎక్కడో ఒక చోట ధ్వని మనల్ని వెంటాడుతది. 'అరుగు మీద రంజ్రాల లీల్లు/
గుడ్లమీద పొదిగేసిన కోడి/ దళ్ల కొంపనేగని సల్లగున్నది' ఈ వాక్యాల్లోని
సహజత్వం ఎంత హృద్యంగున్నదో తెలుస్తున్నది.
చరణ్ దాస్ ఇతర ప్రాణుల బాధల్ని తనవిగా భావించి కలత చెందేవాడు. కాబట్టే
తన కవిత్వంలో ఆర్ద్ర ూట్టి పడుతోంది. చరణ్‌దాస్ మంచి కవి అని ఈ ఒక్క
కవితను చూస్తేనే తెలుస్తుంది. 'ఈ ముసలెడ్లని కటికోని కమ్ముదామని /జీతగానికి
చెప్పంగిన్న/నిలవడి నెమరుగొట్టేదాన్ని, కూలవడి పెండవెట్టిన/ఫోన్ల బేరం,
తెల్లారుడే ఆల్సం/కటికోడు ట్రాలీగట్టుకొని యముని రథం సిద్ధం' ఆవును అమ్మ
అని పూజించే వారికి ఎద్దు నాన్నగా కనబడదేంది. సంక్షోభంలో పడ్డ వ్యవసాయరంగమే
దీనికి కారణమంటే వీరు నమ్మరేమో!
ఈ విధంగా చరణ్‌దాస్ నెలపొడుపు కావ్యం నిండా మట్టి మనుషుల మౌన రోదన
కనబడుతుంది. ఆధునిక కాల స్వభావాన్ని పసిగట్టిన కవి చరణ్‌దాస్. అందుకే
చరణ్‌దాస్ ప్రగతిశీల భావాలతో అతను ఎన్నుకున్న వస్తువులు శాస్త్రీయతను,
అభ్యుదయాన్ని సంతరించుకున్నయి. సదాశివగారి మీద రాసిన ఎలిజీ కవిత చదివితే
చరణ్‌దాస్‌ను మంచి కవిగా అనకుండా ూండలేరు. ఈ పుస్తకంలో కొన్ని కవితలు
బాల్యావస్థని దాటకుండా తడబడుతున్నయి. ఇంకా అధ్యయనం, సామాజిక అవగాహన
పెంచుకుంటే ఈ నెల పొడుపు నెలాఖరు చంద్రుడవుతుంది. కావాలని అందరం ఆశిద్దాం!
- డాక్టర్ ఉదారి 9441413666
- డాక్టర్ ఉదారి 9441413666
Comments
Post a Comment