- పరిసరాలు అధ్వానం
- పట్టించుకోని యంత్రాంగం
జిల్లా కేంద్రంలోని మినీ పార్క్లో ఆహ్లాదం కరువైంది.. ఎవరూ పట్టించుకోకపోవడంతో రోజురోజుకు అధ్వానంగా తయారవుతోంది. పరిసరాలు ఎడారిలా మారుతుండగా.. చెట్లు ఎండిపోతున్నాయి. పిల్లల ఆట వస్తువులు చెడిపోతున్నాయి.. పార్కును అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్పిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి.
జిల్లా కేంద్రం నడిబొడ్డున ఎన్టీఆర్ చౌక్ సమీపంలో గల పార్కు ఎడారిని తలపిస్తోంది. పట్టణం మధ్యలో ఉండడంతో రోజు చాలా మంది ఈ పార్కుకు వస్తుంటారు. కానీ ప్రస్తుతం పార్కు పరిస్థితి అధ్వానంగా ఉంది. పార్కులో ఉన్న ఇతర చెట్లన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. పార్కు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయింది. దీంతో పార్కులో వీధి కుక్కలు, పందులు తిరుగుతున్నాయి. పార్కులో పచ్చదనం కూడా కనిపించడం లేదు. ఈ పార్కు అభివృద్ధిపై అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం మానేశారు. గతంలో జిల్లా కేంద్రంలో పర్యటించిన ప్రభుత్వ సీసీఎల్ఏగా రేమండ్పీటర్ జిల్లాలో పర్యటించినప్పుడు పార్కులో హరితహారం కింద మొక్కలను నాటారు. వాటి పరిరక్షణ చూడాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పుడు ఆ మొక్కలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పార్కు మొత్తం మైదాన ప్రాంతంలా మారిపోయి బోసిపోయి కనిపిస్తోంది. ఇప్పటికైన ఈపార్కులను అభివృద్ధి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments
Post a Comment