Skip to main content

ప‌రీక్ష కాలం.. జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం - Inter Exams.. Tips



బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు.. మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. మళ్లీ డిగ్రీ పరీక్షలు.. విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఎండల తీవ్రత ఒకేసారి వచ్చాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి సన్నద్ధమవుతున్న విద్యార్థులు నిపుణులు సూచించే పలు సలహాలు, సూచనలు పాటిస్తే పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయి.

పరీక్షకు ముందు..
* విద్యార్ధులు తప్పనిసరిగా తమ ఆధార్‌ నెంబర్లను నమోదు చేయించుకోవాలి. హాల్‌ టిక్కెట్లపై ముద్రించి ఉండే ఆధార్‌ నెంబర్‌ తమదో కాదో సరిచూసుకోవాలి.
* హాల్‌ టికెట్‌లోని తమ పేరు, మాధ్యమం, సబ్జెక్టుల పేర్లు, ఇతర అంశాలను సరిచూసుకోవాలి. తప్పులున్నట్లయితే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల దృష్టికి తెచ్చి వాటిని సరిచేయించుకోవాలి. హాల్‌ టిక్కెట్లు లేకుండా ఏ విద్యార్థిని పరీక్షకు అనుమతించరు.
* కేంద్రాలకు పరీక్ష సమయం ఉదయం 9 గంటలకన్నా అరగంట ముందుగా 8-30 గంటలకు చేరుకోవాలి. 9 తరువాత అనుమతించరు.
* ఓఎమ్మార్‌ బార్‌కోడ్‌ షీట్లలోని పేరు, సబ్జెక్టు, ఇతర అంశాలను సరిగా గుర్తించాలి. తప్పుడు గుర్తింపు వల్ల ఫలితాల వెల్లడిలో తప్పు ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక అభ్యర్ధులు ఓఎమ్మార్‌ బార్‌కోడింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే తప్పుడు ఫలితాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
* అభ్యర్ధులు రాత, ప్రింటింగ్‌ మెటీరియల్‌ను, సెల్‌ఫోన్లు, పేజర్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తమతో పాటు తీసుకువెళ్లరాదు.
*పరీక్ష ముగింపు చివర్లో అభ్యర్ధులు తమ సమాధాన పత్రాలను ఇన్విజిలేటర్లకు సమర్పించి వారినుంచి హాల్‌టిక్కెట్లను తీసుకోవాలి,
* విద్యార్థికి 24 పేజీల ఆన్సర్‌షీట్‌ మాత్రమే అందజేస్తారు. ఎలాంటి అదనపు జవాబు పత్రాలు ఇవ్వబడవు. కనుక జాగ్రత్తగా అవసరం ఉన్న మేరకే సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేయండి.
* ముందే ఒకసారి పరీక్షా కేంద్రానికి వెళ్లి సందర్శించి రావడం ఉత్తమం.
శ్రీ ఆన్సర్‌ షీట్‌పై హాల్‌టికెట్‌ నంబర్‌, పేర్లను రాయకూడదు.
శ్రీ మీకు ఇచ్చిన ఓఎమ్మార్‌షీట్‌, ప్రశ్నా పత్రం, ఆన్సర్‌షీట్‌ డ్యామేజ్‌ అయి ఉండవచ్చు, అలా జరిగి ఉంటే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి కొత్తవి పొందండి. దీనికోసం బ్లాంక్‌ ఓమ్మార్‌షీట్‌, అదనపు ప్రశ్నప్రతాలు, జవాబు ప్రతాలను అందుబాటులో ఉంచుతారు.
* మీకిచ్చిన ఓఎమ్మార్‌ షీట్‌, ప్రశ్నాపత్రం, సబ్జెక్‌,్ట మీడియం మీకు సంబందించినవో కాదో సరిచూసుకోండి. ఓఎమ్మాఆర్‌ షీట్‌లోని విద్యార్థి వివరాలను సరిచూసుకోవాలి, బార్‌కోడ్‌ను చెరిపివేయకూడదు.
* పరీక్షకు వెళుతున్నప్పుడు సెల్‌ఫోన్లు, బ్యాగులు, ఇతర పరికరాలు తీసుకెళ్లకండి. భద్రపరిచే అవకాశం లేకపోతే వాటిని కోల్పోయో ప్రమాదం ఉంటుంది.

ఒత్తిడికి దూరంగా ఉంచాలి
అధిక మార్కులే లక్ష్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. ఇండ్ల వద్ద తల్లిదండ్రులు రాత్రింబవళ్లు చదివిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఒత్తిడి.. ఆందోళన పెరిగి ఉన్న కొద్దిపాటి సమయం కూడా నిద్రకు దూరమవుతున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. పరీక్షలకు ముందు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.. నేటి పోటీ ప్రపంచంలో మార్కులకే ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల అభిరుచిని తల్లిదండ్రులు పట్టించుకోకుండా మంచి మార్కుల కోసం పేరున్న విద్యాసంస్థల్లోనే చేర్పిస్తున్నారు. ఎంత ఖర్చయినా వెచ్చిస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు మంచి మార్కులు తెప్పించి మరింత గుర్తింపు పెంచుకోవాలనే లక్ష్యంతో విద్యార్థులను రాత్రింబవళ్లు చదివిస్తున్నారు. దీంతో వారు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది భవిష్యత్తులో వారి అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

విశ్రాంతి అవసరం
ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేవడం మళ్లీ హడావుడి.. దీంతో పిల్లలకు విశ్రాంతి కొరవడుతుంది. పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రత్యేక తరగతులు, పరీక్షల పేరుతో ఒత్తిడి పెరుగుతుంది. వీరైతే నిద్రకు మూడు నాలుగు గంటలు మించి కేటాయించలేక పోతున్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయి చదివింది కూడా గుర్తుండడం లేదు. ఎన్నిసార్లు చదివినా కొద్దిసేపటికే మర్చిపోతున్నామని పిల్లలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు మానసిక నిపుణులు.
పరీక్షా సమయంలో..
* పరీక్షకు కావాల్సిన వస్తువులను ఒకటి రెండు ఎక్కువగా ఉంచుకోండి. ఉదాహరణకు పరీక్ష రాస్తున్నప్పుడు పెన్ను రాయకుంటే కంగారుపడాల్సి వస్తుంది. చిన్న వస్తువైనా జాగ్రత్త తీసుకోవాలి.
* ముందు రోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకుని రండి. ఇంటి నుంచి అక్కడకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో కూడా అవగాహన వస్తుంది.
* పరీక్ష రోజు 30 నిమిషాల ముందే హాల్‌కు చేరుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి తగ్గుతుంది.
*రాని జవాబు గురించి సమయం వృథా చేయవద్దు. వచ్చిన దానిని చక్కటి దస్తూరితో, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని రాయండి. స్పీడుగా రాయడం వల్ల దస్తూరి సరిగా ఉండదు. దీనిని కూడా పేపర్‌ దిద్దేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.
* పరీక్ష రాసి బయటకు వచ్చిన తరవాత దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దు.
* పరీక్షకు మీ పెద్దవారిని వెంటపెట్టుకొని తీసుకువెళ్లండి. కొంత ఆత్మవిశ్వాసంగా ఉంటారు.

తల్లిదండ్రుల జాగ్రత్తలు
* పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఉంటాయి.
* తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకుండా పరీక్షలు బాగా రాసేవిధంగా ప్రోత్సహించాలి.
ఇప్పటివరకు చెప్పినట్లుగా ఇంటి, బయటి పనులను చెప్పడం తగ్గించాలి.
*పరీక్షలకు తమ పిల్లలు సిద్ధం కావడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ఇంటి సమస్యలు, బయటి సమస్యలతో పిల్లల ముందు గొడవలు పడడం వంటివి చేయకూడదు.
* పిల్లల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించకూడదు.
* అదే పనిగా చదువుకోవాలని ఒత్తిడి చేయకూడదు.
* ప్రతిరోజు పిల్లలకు ఆరోగ్యాన్ని కలిగించి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను అందించాలి

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...