'సమాజంలో
ఒంటరి జీవితం గడుపుతున్న మహిళల పరిస్థితిని గమనించాం. వారిని ఆదుకునేందుకు
నెలకు రూ.వెయ్యి చొప్పున జీవనభృతి అందిస్తాం. ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి
ప్రారంభిస్తాం.. ఒంటరి మహిళలను గుర్తించేందుకు అధికారులకు ఆదేశాలిస్తాం'
అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాక్ష్యాత్తు శాసనసభలో ప్రకటించారు.
రోజులు గడుస్తున్నా ఒంటరి మహిళలను గుర్తించేందుకు ప్రభుత్వం ఎలాంటి
వివరాలను ప్రామాణికం చేసుకోవాలో ప్రకటించకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు
పడుతున్నారు. ఆదిలాబాద్ మండలంలో ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు ఒంటరి
మహిళలపై సర్వే చేపట్టగా, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మాత్రం ఒంటరి మహిళల
ఊసే లేకుండా పోయింది.
ఆదిలాబాద్ మండలంలో 2602 మంది, దివ్యాంగులు 793, వితంతువులు 305, పింఛన్లు పొందుతున్నారు. వీరు కాకుండా సమాజంలో ఆదరణ లేని ఒంటరి మహిళలకు జీవనభృతి అందించి చేయూతనిచ్చేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయంతో అర్హత పొందుతామనుకునే వారిలో ఆనందం వ్యక్తమవుతుండగా, స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. విడాకులు తీసుకున్న వారు, వివాహం కాకుండా ఒంటరిగా ఉంటున్నవారు, దిక్కులేని మహిళలకు ప్రభుత్వపరంగా ప్రతినెలా రూ.వెయ్యి జీవనభృతి అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల గుర్తింపునకు ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం ఎలా ఎంపికచేయాలో తెలపకపోవడంతో మండలస్థాయిలోనే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి పథకం అమలుచేస్తామని అటు ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు.
బడ్జెట్లో నిధులు
సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి 'ఆసరా' కల్పిస్తున్న ప్రభుత్వం మానవీయకోణంలో ఒంటరి మహిళలకు జీవనభృతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశమున్నా ఈ పథకం విషయంలో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతలేదు. గతంలో రాష్ట్రస్థాయిలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జిల్లాలో ఒంటరి మహిళల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల గుర్తింపునకు అధికార యంత్రాంగం మండలస్థాయిలో ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేసింది. ఎలాంటి ఆదరణకు నోచుకోని మహిళలు, కష్టాల సహవాసంతో జీవిస్తున్న మహిళలకు జీవనభృతి కల్పించేందుకు అర్హులుగా గుర్తించాలని ఆదేశించారు. సామాజిక భద్రత పింఛన్లలో భాగంగా ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులతో వితంతువులకు కూడా ప్రభుత్వం ఆసరా పథకంలో ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నారు. వికలాంగులకు నెలకు రూ.1,500, మిగిలిన వారికి రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు.
ఎలా గుర్తించాలి
జీవనభృతి అందించేందుకు ఒంటరి మహిళలను ఏ ప్రాతిపాదికన గుర్తిస్తారనేది విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం అందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో గుర్తింపు ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎంపీడీవోలు ఒంటరి మహిళల గురించి సేకరించిన జాబితాను డీపీవో కార్యాలయానికి చేరవేశారు. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు లేకుండానే చేపట్టిన ఈ సర్వేతో అసలైన లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తలు వదిలేసిన వారు.., చెప్పాపెట్టకుండా భర్తలు వెళ్లిపోయిన వారు... విడాకులు తీసుకున్నవారు.. జోగినీలు.. ఏ వయసు అన్న నిబంధనలేంటి ఈ విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీకాలేదు. ఇప్పటికే ప్రభుత్వ సంకేతాల మేరకు డీఆర్డీఏ నుంచి ఎంపీడీవోలకు ఒంటరి మహిళలను గుర్తించాలని ఆదేశాలందాయి. ఈ మేరకు ఆయా మండలాల్లో అంచనా వేస్తున్నారు. ఒంటరి మహిళల్లో ఇప్పటివరకు 60 శాతం మంది ఆసరా పథకంలో వితంతువు పింఛన్ పొందుతున్నారు. జిల్లాలో వితంతు పింఛన్లు పొందుతున్న వారికి కాకుండా ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాల ద్వారా మరింత మందికి లబ్ధి చేకూరనుంది.
సర్వే చేపట్టాం
ఒంటరి మహిళల గుర్తింపునకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేపట్టాం. మండలంలో 430 మంది ఒంటరి మహిళలను గుర్తించాం. భర్త నుంచి విడాకులు పొందిన వాళ్లు, భర్త నుంచి ఏడు సంవత్సరాలకుపైగా విడిగా ఉంటున్న మహిళలు, 30 ఏండ్లుదాటి పెండ్లికాని మహిళలను ఈ సర్వేలో గుర్తించాం.
- రాథోడ్ రవిందర్, ఎంపీడీవో, ఆదిలాబాద్

- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment