నవతెలంగాణ-బోథ్
ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర గౌరవాధ్యక్షులు సోయంబాపురావు అన్నారు. మండలకేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సింహగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ఆదివాసుల చట్టాలను ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం చెల్లప్ప కమిషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. కైతి లంబాడా, వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే ఆ కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వలస లంబాడీలతో తెలంగాణ రాష్ట్ర ఆదివాసులు ఎంతగానో నష్టపోయారన్నారు. వలస లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి దోహదపడాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్‌లోనే ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆదివాసులు ఉన్న నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఖాళీ ఉద్యోగాలను, ప్రమోషన్లను స్థానిక ఆదివాసీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంత ఉత్తర్వులను అనుసరించి జీఓ నెంబర్ 3, ఆర్టికల్ 342 ప్రకారం అన్ని శాఖల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఆదివాసీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించాలన్నారు. ఆదివాసులకు అటవీ హక్కు పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేద ఆదివాసులకు మూడెకరాల భూమి ఇవ్వాలని కోరారు. ఆదివాసులకు ఉన్న రిజర్వేషన్ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ వలసలను అరికట్టాలన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ ఆదివాసులకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు ప్రవేశపెట్టిందని, చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయవద్దన్నారు. చట్టం ప్రకారం గిరిజన ఆదివాసులకు అందే అభివృద్ధి సంక్షేమం వారికే వంద శాతం చేందాలన్నారు. సింహగర్జనకు జిల్లా నలుమూలల నుంచి ఆదివాసులు తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చందా లింగయాదవ్, ఆత్రం సక్కు, కె. భీంరావు, వసంత్ నారాయణ, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు సంజీవ్, నారాయణ, నాగేశ్వర్, జితేందర్, అమ్రాజ్, అరుణ్‌కుమార్, రవి, సాయన్న, బొజ్జ, జిల్లా నాయకులు నగేష్, నందు సోయం మారుతి, కృష్ణమూర్తి, వికాష్, విశ్వనాథ్ పాల్గొన్నారు.

Comments
Post a Comment