Skip to main content

వ్యాధుల ముప్పు.. కావాలి కనువిప్పు - Summed Diceases



వేసవిలో వ్యాధులతో జాగ్ర త్త
జాగ్ర త్తలు పాటిస్తేనే మేలు

చూస్తుండగానే చలికాలం వెళ్లిపోయింది. వేసవి వచ్చేసింది.. అప్పుడే
భానుడు తన ప్రతాపాన్నిచూపిస్తున్నాడు. భగ భగ మండే ఎండలతో జనాన్ని
విలవిల్లాడిస్తున్నాడు. అయితే వేసవి కాలంలో మనిషిలో అనేక పరిణామాలు
చోటుచేసుకుంటాయి. వివిధ రకాల వ్యాధులు దాడి చేస్తాయి. ఇలాంటి
సమయాల్లో జాగ్ర త్తలు పాటించకపోతే తిప్పలు తప్పవు. ముఖ్యంగా
డీహైడ్రేషన్‌తో మనిషి తన శక్తిని పూర్తిస్థాయిలో కోల్పోతాడు.

నవతెలంగాణ - ఆదిలాబాద్‌
ప్రస్తుతమున్న వాతావరణాన్ని బట్టి జాగ్ర త్తలు తీసుకోకపోతే రోగాలు తప్పవని
వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండలో తిరిగేవారికి వాంతులు,
విరేచనాలు, హైఫీవర్‌, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్‌, బీపీ పెరగ డం,
కిడ్నీ, గ ుండె ఫెయిల్యూర్‌, కోమాలోకి వెళ్లడం వంటివి సంభవిస్తాయని
వైద్యులు అంటున్నారు. వేసవిలో నీటిఎద్దడి కారణంగా నీరు కలుషితమయ్యే
అవకాశాలు ఎక్కువని, నిల్వ ఉంచిన ఆహారపదార్థాల్లో చేరిన బ్యాక్టీరియా
స్వల్ప కాలంలోనే తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు.

డీ హైడ్రేషన్‌ సమస్య..
30 డిగ్రీల ఉష్ణోగ్ర తకు అలవాటు పడిన మనిషి శరీరం ఒక్కసారిగా 38
డిగ్రీలు, అంతకన్నా ఎక్కువ తీవ్రత గ ల ఉషోఅనగ్ర తలను అనుభవిస్తే
శరీరంలోని దాదాపుగా మూడు నుంచి నాలుగ ు లీటర్ల నీటిని చెమట
రూపంలో కేవలం 12గ ంటల వ్యవధిలోనే కోల్పోతాడు. అయితే మనిషి శరీరం
లోని నీరే కాకుండా సోడియం, పొటాషియం, క్లోరైడ్‌, పాస్ఫరస్‌ వంటి
ముఖ్యమైన లవణాలు కూడా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయని
గ ుర్తించాలి. అయితే మనిషి కోల్పోయిన లవణాలు తిరిగి చేజిక్కిచ్చుకోవాలంటే
చేరువలో ఉన్న నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. బయటకు విసర్జించబడిన
లవణాలను అన్నింటినీ భర్తీ చేసే ఏకైక ద్రావణం, ప్రకృతి సహజసిద్ధంగా
అందించిన వరం కొబ్బరినీళ్లు. వాస్తవానికి సోడియం, ఫాస్పరస్‌,
మెగ్నీషియం, క్లోరైడ్‌ వంటి పదార్ధాలు కొబ్బరి నీళ్లలో తప్ప మరే పదార్ధాల్లో ఉ
ండవు. దాహం అనిపిస్తే వెంటనే థమ్స్‌ అప్‌, కోక్‌ వంటి రసాయనాలు
కలిగిన వాటిని తీసుకోకుండా కొబ్బరినీళ్లు తాగ డం మంచిది.

తక్షణమే వైద్య చికిత్స
రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు,
వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం, 101 డిగ్రీల ఫారెన్‌హీట్‌
కంటే ఎక్కువ జ్వరం ఉండడం, ఐదారు గ ంటలుగా మూత్రవిసర్జన
నిలిచిపోవడం, చర్మం పొడిబారి, లాగితే సాగిపోతుండటం, బాగా
నీరసించిపోవడం, నాలుక తడారిపోవడం, ఏడ్చినా కన్నీరు రానప్పుడు...
ఇవన్నీ ఒంట్లోంచి నీరు గ ణనీయంగా తగ్గిపోయిందని గ ుర్తించే లక్షణాలు.
అలాగే పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం వంటి
లక్షణాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను
సంప్రదించాలి.
ఒక్కొక్కరికి ఒక్కో లక్షణాలు..
కాళ్లు, చేతులే కాదు శ్వాసకోశ కండరాలకు పొటాషియం అందకపోతే అవీ
పనిచేయవు. ఫలితంగా ప్రాణమే పోవచ్చు. డీ హైడ్రేషన్‌ తాకిడి అనేది
అందరి మీదా ఒకేలా ఉండదు. వయసులో ఉన్నవారు, ఆరోగ ్యవంతులు
ఎండలోకి వెళితే చెమటలు పట్టవచ్చు. కొంత మేరకు సోడియం,
పొటాషియం తగ ్గవచ్చు కానీ, వారి రక్తపోటు మీద ఏ ప్రభావమూ ఉండదు.
థర్మోరెగ ు్యలేటర్‌ సెంటర్‌ బాగానే పనిచేయడం వల్ల శరీరం కొంత వేడెక్కినా
అంతపెద్ద ప్రమాదమేమీ ఉండదు. అయినా నీరు, లవణాలుండే రసాలు
ఎక్కువగా తీసుకోవాలి. రేడియేషన్‌కు ఎక్కువ అవకాశం ఉండే జీన్స్‌, నలుపు,
ఇతర గాఢమైన రంగ ు దుస్తులను ధరించకూడదు. లేత రంగ ులు, వదులు
దుస్తులు, ప్రత్యేకించి కాటన్‌ దుస్తుల్ని ఈ సీజన్లో ధరించడం మంచిది.
మామూలుగా కన్నా రెండు మూడు లీటర్ల నీటిని అదనంగా తాగాలి. ఆ
నీటిలో పళ్లరసాలు, కాస్తంత ఉప్పు కలుపుకోవాలి. చక్కెర కలిపిన నిమ్మరసాన్ని
తాగాలి. వీటిద్వారా డీ హైడ్రేషన్‌ సమస్య నుంచి కొంతమేర బయటపడొచ్చు.
కానీ వయసుమీరిన వారు, పసిపిల్లలు, మధుమేహ వ్యాధిగ్ర స్తులు దీనికి
గ ురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు రేడియేషన్‌,
కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్‌, హెచ్‌.ఐ.వి బాధితులు, దీర్ఘకాలిక
వ్యాధిగ్ర స్తులు చాలా త్వరగా డీ హైడ్రేషన్‌కు ఆ వెంటనే వడదెబ్బకు గ ురయ్యే
ప్రమాదం ఉంది. అందువల్ల వీరు మిగ తా వారికంటే చాలా అప్రమత్తంగా ఉ
ండాలి.

వడదెబ్బ
వేసవి సమయంలో వడదెబ్బ చాలా తీవ్రమైనది. అధిక ఉష్ణోగ్ర త వల్ల
శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై డీ హైడ్రేషన్‌ జరిగి
ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వడదెబ్బ ఎవరికైనా రావొచ్చు.
అయితే కొంతమంది మాత్రమే దీనికి వెంటనే లోనౌతారు. వృద్ధులు, పిల్లలు,
క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధి ఉన్నవారు, మద్యాన్ని సేవించేవారు.
తీవ్రమైన సూర్యరశ్మికి, వేడిమి అలవాటు లేనివారు ఎక్కువగా వడదెబ్బకు
గ ురౌతుంటారు. కొన్నిరకాల మందులు కూడా వడదెబ్బకు
కారణమౌతున్నాయి.

లక్షణాలు
- అధికంగా శరీర ఉష్ణోగ్ర త 104 డిగ్రీల ఫారన్‌ హీట్‌ కంటే ఎక్కువ ఉ
ండడం.
- అయోమయం నుంచి అపస్మారక స్థితి వరకూ ప్రవర్తనలో మార్పులు.
- గ ుండె/ నాడి అసాధారణంగా కొట్టుకోవడం.
- వేగ ంగా, తక్కువగా శ్వాస తీసుకోవడం.
- రక్తపోటు బాగా పెరగ డం, బాగా తగ్గిపోవడం
- చెమట పట్టకపోవడం.
- శరీరమంతా తిమ్మిరి ఎక్కడం.
- కాళ్లు, చేతుల్లో బాధాకరమైన ఈడ్పులు.
- తల తిరగ డం. శరీరం తేలిపోతున్నట్లు అనిపించడం.
- తలపోటు, వికారం, వాంతులు రావడం.
- పెద్దవారైతే స్ప హ కోల్పోవడం.
- అప్పటికే కిడ్నీ, లివర్‌ వంటి మిగ తా అవయవాలేమైనా దెబ్బ తిన్నాయేమో
చూడాలి.
- అవి దెబ్బ తింటే బయటికి వెళ్లకుండా లోపలే నిలిచిపోయే వ్యర్థ,
విషపదార్థాల వల్ల గ ుండె దెబ్బ తింటుంది. మెదడుకు రక్తప్రసరణ
తగ ు్గతుంది.
- అంతిమంగా రోగి కుప్పకూలిపోతాడు. చాలా తీవ్రంగా డీ హైడ్రేషన్‌కు
గ ురైన వారి పరిస్థితి మాత్రమే ఇలా ఉంటుంది.
- ఇలాంటి లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం చేయకుండా జాగ్ర త్త పడాలి.

ప్రాథమిక స్థాయిలో
వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని వెంటనే చల్లబర్చే చర్యలు చేపట్టాలి.
అందుబాటులో టబ్‌ వంటిది లభిస్తే రోగిని చల్లని నీటిలో ఉంచాలి. ఆ
అవకాశం లేకపోతే చల్లని, తడిబట్టలలో అతనిని చుట్టాలి. తడి బట్టతో
శరీరమంతా అద్దాలి. శరీర ఉష్ణోగ్ర త 101డిగ్రీలకు తగ్గితే అతనిని చల్లని నీటి
నుంచి తీసి గాలి వెలుతురు వచ్చే గ దిలో సౌకర్యవంతంగా పడుకోబెట్టాలి. ఉ
ష్ణోగ్ర త మ ్ల పెరుగ ుతున్నట్లయితే మొదట చెప్పినట్లు చేసి, దానిని తగ్గించాలి.
రోగి తాగ గ లిగితే తేలికగా జీర్ణమయ్యే పానీయాన్ని ఇవ్వాలి. ఎటువంటి
మందులు ఇచ్చి, సొంతవైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
వడదెబ్బకు అత్యవసర చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో బాధితుడి శరీరంలోంచి
బయటికి వెళ్లిపోయిన ద్రవాల్ని తిరిగి పూరించాలి.

జాగ్ర త్తలు
వడదెబ్బ తగ లకుండా ఉండడానికి కొన్ని జాగ్ర త్తలు తప్పని సరి. బయట
పనులు చేసేటప్పుడు ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకొని శరీర ఉష్ణోగ్ర తని
మాములుగా ఉంచుకోవాలి. కెఫీన్‌ ఉన్న టీ, కాఫీలకు, మద్యానికి దూరంగా ఉ
ండాలి. అవి శరీరంలో నీటిని త్వరగా హరించేస్తాయి. లేతరంగ ులో ఉన్న
వదులైన దుస్తులను ధరించాలి. ఎండలు ముదిరిన రోజుల్లో ఉదయం 11
గ ంటల నుంచి మధ్యాహ్నం 3 గ ంటల దాకా బయటకు వెళ్లకూడదు. ఆ
సమయంలో బయటికి వెళ్లడం తప్పకపోతే, రెండు మూడు లీటర్ల నీరు, పండ్ల
రసాలు, ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని దగ ్గర పెట్టుకుంటే డీ-హైడ్రేషన్‌కు
గ ురికాకుండా వడదెబ్బ సోకకుండా ఉంటారు.

డయేరియా
వేసవి కాలంలోనే మంచినీటి సమస్యలు తీవ్రమై ఉన్న నీరు కూడా
కలుషితమౌతుంది. దీంతో వాంతులు, విరేచనాల వంటి పలు సమస్యలు
ఎక్కువగా ఉంటాయి. డయేరియా కూడా వ్యాపించే అవకాశం ఉంది. దీనివల్ల
శరీరంలోని నీరంతా బయటికిపోయి మనిషి నీరసపడి పోతాడు. పిల్లలు, వ
ద్ధులు ఈ సమస్య బారిన పడితే కోలుకోవడం చాలా కష్టం.

లక్షణాలు
ఈ సమస్య ప్రారంభంలో పొట్ట నొప్పితో బాటు నీళ్ల విరేచనాలు అవుతాయి.
కొన్నిసార్లు పదేసి సార్లు కూడా అవ్వొచ్చు. జ్వరంతో బాటు వాంతులు కూడా
అవుతాయి. వాంతులు, విరేచనాల మూలంగా ఒంట్లోని నీరు, లవణాలు
బయటికిపోయి, మనిషి త్వరగా నీరసపడిపోతాడు. అందుకే ఈ సమస్య
వచ్చినవారు వీలున్నంత వరకూ నీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ ూ్లకోజ్‌
వంటివి అధికంగా తీసుకోవాలి. లేకపోతే డీ హైడ్రేషన్‌కు గ ురౌతారు.
దీనివలన తొలిరోజు దాహంగా ఉంటుంది. పసిపిల్లలైతే ఆపకుండా ఏడుస్తూ
ఉంటారు. పెద్దల్లో చికాకు, నీరసం, ఏ పనిమీదా ఆసక్తి ఉండదు కళ్లు
లోపలికి పీక్కుపోతాయి. నాలుక, కళ్లు పొడిబారతాయి. చర్మం సాగినట్టు
కనిపించి, కాంతిని కోల్పోతుంది. డీ హైడ్రేషన్‌ ఎక్కువైన కొద్దీ పిల్లల నాడి
వేగ ం తగ్గి స్ప హ కోల్పోతారు.

చికిత్స
వాంతులు, విరేచనాలు ఆగ డానికి అందుబాటులో ఉన్న మందులు వాడితే
సమస్య అప్పటికి తగ్గినట్టు అనిపించినా, పేగ ులలోని వ్యర్థాలు లోపలే ఉండి,
ఒక్కసారిగా తీవ్రతతో కూడిన విరేచనాలు కావచ్చు. అందుకే ఈ విషయంలో
సొంత వైద్యాన్ని ఆశ్రయించకుండా వైద్యుల సలహాలను పాటించాలి.
అప్పటికప్పుడు అయ్యే వాంతులు, విరేచనాల విషయంలో కంగారు పడకుండా
సాధారణ జాగ్ర త్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, గ ూ్లకోజ్‌, మజ్జిగ వంటివి
తీసుకోవాలి. విరేచనాల్లో రక్తం, జిగ ురు లాంటివి కనిపించిన సందర్భంలోనూ,
ఒకటి, రెండు రోజులైనా విరేచనాలు,వాంతులు తగ ్గకపోతే ఆలస్యం
చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

ఆహార జాగ్ర త్తలు
వాంతులు, విరేచనాలతో బాధపడేవారు తేలికపాటి ఆహారంతో పాటు
ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. నిర్ణీత వ్యవధిలో ఉప్పు, పంచదార కలిపిన
నీరు, ఎలక్ట్రోల్‌ పొడి కలిపిన నీరు తాగాలి. ఈ ఎలక్ట్రోల్‌ పొడిని
అవసరమైనప్పుడల్లా ఒక్కో చెంచా చొప్పున నీటిలో కలుపుకోవటం కంటే
ఒకేసారి లీటరు నీటిలో మొత్తం పాకెట్‌ పొడినీ కలిపి రోజంతా అప్పుడప్పుడు
ఒక్కో గ్లాసు తాగ డం మంచిది. వాంతులు తగ్గినా, ఉప్పు వేసిన మజ్జిగ , కొబ్బరి
నీరు, గ ంజి, సగ ు్గబియ్యం జావ, క్యారెట్‌ సూప్‌ వంటివి ఇవ్వాలి. చనుపాలు,
పోతపాలు తాగే పిల్లలకు ఎప్పటిలాగే పాలివ్వాలి. వాంతులు తగ్గిన తర్వాత
అటుకులు, మరమరాలు, ఇడ్లీ, ఉప్మా వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం
తీసుకోవాలి. బయట అమ్మే పండ్ల రసాలు, కూల్‌ డ్రింకులు, ఐస్‌ కలిపిన
పానీయాలు తాగ కూడదు. ఐస్‌క్రీములు తినకూడదు. పచ్చి కూరగాయలకు
బదులుగా ఉడికించినవి తినాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా
కడిగి వాడాలి. భోజనానికి ముందు, మలమూత్ర విసర్జన తర్వాత తప్పక
సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తాగ ునీరు కలుషితం కాకుండా చూడడం,
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆహారంపైకి, తాగే నీటిలోకి
ఈగ ల వంటి కీటకాలు, బ్యాక్టీరియాలు చేరకుండా చూడడం చాలా అవసరం.


చికెన్‌ఫాక్స్‌
వయసులతో సంబంధం లేకుండా చికెన్‌ఫాక్స్‌ వచ్చే ప్రమాదముంది.
వాతావరణ మార్పుల వల్ల 10 డిగ్రీల పెరిగితే ఆమేరకు ఇన్‌ఫెక్షన్లు 17
శాతం పెరుగ ుతాయని, ఇటీవలనే ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు
ఆధారాలతో సహా వెల్లడించారు. వేసవిలో డీ హైడ్రేషన్‌ సమస్యతో ఎక్కువ
మంది బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. అలాగే చర్మ సంబంధిత
వ్యాధులతో పాటు కళ్ల సమస్యలు కూడా ఈ కాలంలోనే వేధిస్తుంటాయని,
కొద్దిపాటి జాగ్ర త్తలతో వీటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని
చెబుతున్నారు.

గ ుండెపోటు సమస్య..
వేసవిలో సాధారణంగా గ ుండెపోటు సమస్య కూడా ఎక్కువగా ఉంటోంది.
ఎలాగ ంటే.. వేసవిలో ఎండ వేడిమి వల్ల హైపర్‌థెర్మియా వచ్చే అవకాశా
లున్నాయి. హైపర్‌ థెర్మియా అనేది మానవశరీరం తాను స్వీకరించగ లిగిన
దానికన్నా అధిక వేడిని స్వీకరించడం వల్ల వస్తుంది. అతి తీవ్రమైన స్థితి
మాత్రమే కాదు అత్యవసర వైద్యసహాయం అవసర మైన పరిస్థితి కూడా ఇది.
ఎక్కువగా ఎండలో పనిచేసే వారికి ఇది వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం
40 డిగ్రీల సెంటిగ్రేట్‌ ఉష్ణోగ్ర త దాటే పరిస్థితులున్నాయి. కాబట్టి జాగ్ర త్త
పడటం చాలా అవసరం. అపార్ట్‌మెంట్‌లలో బాగా పైనున్నవారు శరీరాన్ని
చల్లగా ఉంచుకునే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. వదులుగా ఉండే
తేలికపాటి వస్తాల్రు ధరించడంతో పాటు నీటిని అధికంగా తాగ ుతుండాలి.

వేడి చల్లారక ముందే తినాలి
35 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్ర తలో ఈ.కోలీ బ్యాక్టీరియా అభివృద్ధి
చెందటానికి అనువైన వాతావరణం. అందుకే మనం తినే ఆహారం పట్ల
చాలాజాగ్ర త్త వహించాలి. వంట అయిన వెంటనే ఆరగించడం లేదా వేడి
చల్లారక ముందే తినడం చేయాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను కూడా
వేడి చేసుకుని తినడం ఉత్తమం. ఫ్రిజ్‌లో ఉన్నాయి కదా అని పచ్చి
కూరగాయలను సైతం వేసవిలో తినకపోవడమే మంచిది.

టైఫాయిడ్‌
వేసవిలో కనిపించే మరో సమస్య.. టైఫాయిడ్‌. అధిక జ్వరం, తలనొప్పి,
నీరసం లక్షణాలుగా ఉండే ఈ రోగ ం రాకుండా ఉండటానికి అపరిశుభ్ర
ఆహారం భుజించకపోవడం మంచిది. కాచి చల్లార్చిన నీటిని తాగ టం
మంచిది.

పిల్లల్లో రోటావైరస్‌ ప్రభావం..
వాతావరణంలో వేడిపెరిగే కొద్దీ సాధారణంగా పిల్లల్లో రోటావైరస్‌
ప్రభావమూ ఎక్కువగానే కనిపి స్తుంది. వాంతులు, అధిక జ్వరం ఎక్కువగా ఈ
వైరస్‌ సోకిన పిల్లల్లో కనిపిస్తుంటాయి. తగిన విశ్రాంతి తీసుకోవడం..
కొద్దిపాటి మందులతో సమస్యను అధిగ మించినా ఈ వైరస్‌ సోకకుండా
కాపాడుకోవడమే మంచిది. ఇప్పుడు వ్యాక్సిన్‌లు వచ్చాయి కాబట్టి పెద్ద
ప్రమాదేమీ లేదు కానీ,జాగ్ర త్త పడటం మంచిది.

కళ్ల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ
వేసవిలో బయట వేడికి కంటిలో కూడా తేమ ఆవిరైపోతుంటుంది. వేసవిలో
దుమ్ము, ధూళి ఎక్కువగా రాేవడం, అది కంట్లో పడటం వల్ల ఈ సమస్య
వచ్చినా.. పెరిగిన కాలుష్యం కూడా ఓ కారణంగానే చెప్పాల్సి ఉంటుంది.
కళ్లు ఎర్రబడటం.. దురద, మంటలతోపాటు కంట్లో ఇసుక ఉన్నట్టు బాధ..
ఇలాంటి సమస్యలెన్నో తలెత్తుతాయి. దీంతో ఎండల నుంచి కండ్లను
సంరక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు
సన్‌గ్లాసెస్‌ ధరించడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

కామెర్లుజి
(హెపటైటిస్‌)
నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల
ఈ వ్యాధి వస్తుంది. టఇది కూడా వైరస్‌ వల్ల
వ్యాప్తి చెందుతుంది. రోజూ ఇలాంటి కేసులు ఫీవర్‌ ఆస్పత్రికి వస్తూనే ఉ
న్నాయి.
లక్షణాలు ఇవి...
లి వ్యాధి కనిపించడానికి వారం రోజుల ముందే ఆకలి తగ ు్గతుంది.
నోటికి రుచి తెలియదు.
లి మూత్రం పచ్చగా రావడంతో పాటు కళ్లు పచ్చబడతాయి.
లి నోరూ పచ్చబడి నాలుక కిందిభాగ ంలో పచ్చదనం స్పష్టంగా కనిపిస్తుంది.
లి కాలేయం పెరుగ ుతుంది. కడుపు కుడివైపు నొప్పి ఉంటుంది. వాంతులు
కావొచ్చు.
జాగ్ర త్తలివి...
లి చికిత్స కంటే నివారణే సరైన మార్గం. నీరు, ఆహారం కలుషితం కాకుండా
చూసుకోవాలి. అందుకే కాచి వడపోసిన నీళ్లు వాడాలి.
లి విసర్జక పదార్థాలతో నీళ్లు, ఆహారం కలుషితమైతే వ్యాధి వ్యాప్తి
చెందుతుంది.
దీన్ని నివారించేందుకు వ్యక్తిగ త పరిశుభ్రత పాటించడం అవసరం.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...