నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన
శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్ర త్తగా
కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి
అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం.
పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే
కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ 'డయాలసిస్'
కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా
ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా
మారదు. ఇలాంటి కిడ్నీ సంబంధిత రోగ ులు ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు
పెరిగిపోతున్నాయి. రిమ్స్‌తోపాటు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మూత్రపిండాల రక్షణకు తీసుకోవాల్సిన
జాగ్ర త్తలపై..
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో సుమారు 17 శాతం మంది కిడ్నీ
వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధికూడా విస్తరిస్తున్న నేపథ్యంలో
కిడ్నీ వ్యాధులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అదే రీతిలో ఆదిలాబాద్
జిల్లాలో కూడా సుమారు ఎనిమిది శాతం మంది వరకు ఈ వ్యాధిబారిన
పడుతున్నారు. మరో ఐదేండ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని పలువురు
వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన రిమ్స్‌లో మధుమేహంతో పాటు
మూత్రపిండాల కేసులు కూడా పెరుగ ుతున్నాయి. టైప్-1 మధుమేహ
బాధితుల్లో 10 నుంచి 30 శాతం, టైప్-2లో 40 శాతం మంది కిడ్నీ
సంబంధిత వ్యాధితో బాధపడతున్నారు. అందుకే ఈ సమస్యను తొలిదశలోనే
గ ుర్తిస్తే ముదరుకుండా గ ుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహ
వ్యాధిగ్ర స్తులు కిడ్నీపై తగ ు జాగ్ర త్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అనేక కారణాలు..
జన్యుపరమైన కారణాలతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం తదితరాలతో
కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ
వ్యాధులకు ప్రధానంగా ఐదు దశలు ఉంటాయి. చివరిదశకు చేరుకున్న వ్యక్తికి
డయాలసిస్ లేదంటే కిడ్నీ మార్పిడి చేయాలి. ముఖ్యంగా ఒకసారి
మూత్రపిండం పనితీరు మందగించి విఫలమవడం ప్రారంభమైతే పూర్తిగా
నయం చేయడం కష్టం. పైగా చికిత్సకయ్యే ఖర్చు సామాన్యులకు అందనిది..
చికిత్స తీసుకున్న కిడ్నీ కూడా తిరిగి సమర్థంగా మారదు. దీనికితోడు గ ుండె
జబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటి సమస్యలు సరేసరి. మూత్రపిండం
మార్పిడి చేసుకున్నవారు సైతం జీవితాంతం మందులు వేసుకోవాలి.
జీవన శైలిలో మార్పులతో..
జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒత్తిడి, ఆహార
అలవాట్లు, పొగ తాగ డం ఇతరత్రా కారణాలు.. ఊబకాయం, అధిక రక్తపోటు,
మధుమేహం కిడ్నీ సమస్యలకు దారితీస్తున్నాయి. టైప్-1 మధుమేహ
బాధితుల్లో 10-30 శాతం, టైప్-2 మధుమేహ బాధితుల్లో 40 శాతం మంది
కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. తొలి
దశలో గ ుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. మధుమేహ
రోగ ులు అత్యంత జాగ ురూకతతో వ్యవహరించాలి. ప్రతి మూడు నెలలకు
ఒకసారి కిడ్నీ పరీక్షలు చేసుకోవాలి. ఇక మూత్రంలో సుద్ద ఎక్కువగా
పోతుంటే వాటి వడపోత సామర్థ్యం తగ్గి పోతున్నట్టే. ప్రతి ఏటా ఈ సుద్ద
పరీక్ష చేయించుకోవాలి. తక్కువ బరువుతో పుట్టేవారిలోనూ.. శిశువుల్లోనూ
2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన వారు, నెలలు నిండక ముందే
పుట్టిన వారిలో ఈ తరహా సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువని వైద్య
నిపుణులు చెబుతున్నారు.
తొమ్మిది నెలలు నిండకుండా..
తొమ్మిది నెలలు నిండిన శిశువుల్లో మాత్రమే కిడ్నీల పెరుగ ుదల
బాగ ుంటుంది. నెలల నిండక ముందు, తక్కువ బరువుతో ఉన్నవారిలో అదే
స్థాయిలో ఉండదు. వాస్తవానికి కిడ్నీల్లో 10-15 లక్షల ఫిల్టర్లు ఉంటాయి.
ఇలాంటి శిశువుల్లో మాత్రం అవి 8-7 లక్షల మాత్రమే. సాధారణంగా
ఆరోగ ్యవంతుల్లో కూడా ప్రతి పదేండ్లకు 5 శాతం వరకు ఫిల్టర్లు తగ్గిపోతాయి.
దీంతో ఇలాంటి చిన్నారుల విషయంలో తరచూ పరీక్షలు చేయించుకొని
జాగ్ర త్తలు తీసుకోవాల్సి ూంటుంది.
మూత్రపిండాల పని
మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయటంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తపోటు
నియంత్రణ హార్మోన్‌ను ఉత్పత్తి చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. రెనిన్
హార్మోన్ రక్తపోటును నియంత్రిస్తుంది. ఎరిత్రోపాయిటిన్ హార్మోన్ రక్తాన్ని
తయారు చేయడంలో ఉపయోగ పడుతుంది. అదేవిధంగా ఆమ్ల, క్షార
సమతుల్యతను కాపాడడంలోను కీలక భూమికను పోషిస్తాయి. మనిషిని ఒక
మెకానిజంతో పోలిస్తే కిడ్నీలు 24 గ ంటల పాటు పని చేసే యంత్రంగాను,
అలుపెరుగ ని శ్రామికునిగా చెప్పవచ్చు.
చికిత్స
కిడ్నీ సమస్యలకు నేడు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం
అందుబాటులో ఉంది. సాధారణంగా కిడ్నీలు పాడు కాకముందే సమస్యలను
ప్రాథమిక నిర్థారణ ద్వారా గ ుర్తించి మందులతో సమస్యలను
అధిగ మించవచ్చు. పరిస్థితి చేయి దాటితే డయాలసిస్ ద్వారా వైద్యం
అందించవచ్చు. డయాలసిస్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో
'పెరిటోనియల్ డయాలసిస్' ద్వారా కిడ్నీ పాడైన వ్యక్తి బొడ్డు నుంచి ట్యూబ్
వేసి డయాలసిస్ ఫ్లూయిడ్ల ద్వారా చికిత్స అందిస్తారు. వారంలో రెండు
మూడు సార్లు చేయించుకోవాల్సి వుంటుంది. ఇది ఇంటి దగ ్గరే పేషంట్‌కు
చేసుకోవచ్చు. రెండవ రకం 'హీమో డయాలసిస్'. వైద్యుల పర్యవేక్షణలో రక్త
నాళాల ద్వారా మిషన్‌ను ఉపయోగించి రక్తాన్ని శుద్ధి చేస్తారు. రోజుకు రెండు,
మూడు సార్లు చేయించుకోవాల్సి వుంటుంది. అయితే ఈ చికిత్సలు అత్యంత
ఖర్చుతో కూడుకున్నవి.
కిడ్నీ మార్పిడి
అత్యంత సులువైనది, సురక్షితమైనది కిడ్నీ మార్పిడి. ప్రభుత్వ నిబంధనల
ప్రకారం కుటుంబ సభ్యులు లేక దాతలు నుంచి కిడ్నీ మార్పిడి చేయవచ్చు.
ఇది నేడు సర్వసాధారణంగా మారింది. కిడ్నీ మార్పిడితో మనిషికి పునర్జన్మ
లభించినట్లుగా చెప్ప వచ్చు. కిడ్నీ మార్పిడిపై అవగాహన పెరిగింది. ఆరో గ ్య,
ఆరోగ ్య దాన్ వంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర ట్రస్టుల ఆధ్వర్యంలో వైద్యం
అందుబాటులో వుంది.
నూతన ఒరవడి
కిడ్నీ సమస్యలు అధిగ మించేందుకు నేడు అధునిక పరిజ్ఞానం అందుబాటులో
ఉంది. కిడ్నీ మార్పిడితోపాటు నేడు (ఆర్టిఫీషియల్ వేరెబుల్) ధరించే కిడ్నీలు
అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా కిడ్నీలోని కణాల ఆధారంగా
(టిష్యూ కల్చర్ టెక్నిక్) కిడ్నీలను రూపొందించే ఆధునిక వైద్యం శరవేగ ంగా
అందు బాటులోకి రానుంది.
రిమ్స్‌లో డయాలసిస్ కేంద్రం ఎప్పుడో?
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ
బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్థోమత లేని వారైతే ఇతర
ప్రాంతాలకు వెళ్లలేక వైద్యం చేయించుకోలేకపోతున్నారు. డయాలసిస్
చేయించుకోవాలంటే 350 కి.మీ. దూరంలో ఉన్న హైదరాబాద్ లేదా 200
కి.మీ. దూరంలో ఉన్న మహారాష్ట్రలోని నాగ పూర్‌కు వెళ్లాల్సి వస్తోంది.
హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ను ఉచితంగా చేస్తారు. కాని
రోగిని ఇక్కడి నుంచి అంతదూరం తీసుకెళ్లడం, అతనితోపాటు ఒకరిద్దరు
సహాయకులు కూడా వెళ్లాల్సి రావడం జిల్లావాసులకు కష్టమవుతోంది. ఒక
సారి వెళ్లి రావాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ఆర్థిక స్థోమత
లేనివారు ఈ ఖర్చు భరించడం కష్టమైన పనే. రిమ్స్‌లో ఈ సౌకర్యం ఏర్పాటు
చేస్తే అటువంటి వారి ఇక్కట్లు దూరమవుతాయి. జిల్లాలో రక్తశుద్ధి కేంద్రాలను
పీపీ(ప్రైవేటు, పబ్లిక్) విధానంలో ఏర్పాటు చేయడానికి ప్రప్రభుత్వం కసరత్తు
చేస్తోంది. ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల్లో యాజమాన్యం
కేవలం వసతి సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో ప్రైవేటు వారు డయాలసిస్
కేంద్రం ఏర్పాటు చేస్తారు. బాధితులకు ఈ కేంద్రం సేవలందిస్తే ఆరోగ ్యశ్రీ
పథకంలో నిర్వాహకులకు చెల్లింపులు చేసే విధానంలో ఏర్పాటు
చేయనున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. వీటి
పనితీరు గ ురించి కొన్ని విధి విధానాలు నిర?యించడానికి జాప్యం
జరుగ ుతోంది.
Comments
Post a Comment