పురపాలక సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12 న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని, ఈ నెల 12 నుండి 17 వరకు అభ్యంతరాలు, అక్షేపణలు స్వీకరించి, ఈ నెల 18న ఫైనల్ జాబితాను ప్రకటించాలని అన్నారు. ఆయా వార్డులలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, ఫైనలైజేషన్ చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సీందిని సమకూర్చుకోవాలని అన్నారు. పోలింగకు అవసరమైన బ్యాలట్ బాక్సులు, బ్యాలట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ల గుర్తింపు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి అశోక్ కుమార్, మున్సిపల్ పరిపాలన సంచాలకురాలు శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ జి. సంధ్యారాణి, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, సహాయ కమీషనర్ రాజు, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు,
మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...
Comments
Post a Comment