Skip to main content

ఫసల్ బీమా యోజన ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్


ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కు సంబందించిన ప్రచార రథాన్ని బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ఈ ఫసల్ బీమా యోజన పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారిని ఆశాకుమారి, వ్యవసాయ అధికారి శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ రామావత్ రామ్ సింగ్, ఇఫ్కో బీమా స్టేట్ కోఆర్డినేటర్ శివరాజా, క్లస్టర్ కోఆర్డినేటర్ సాకేత్ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ప‌ల్లె‌ను క‌విత్వ శిలాఫ‌ల‌కం చేసిన కుర్మె - GR Kurme Shilaafalakam

      ప్రకృతి లేని కవిత్వముండదు. కవిత్వానికి మొదటి వస్తువు ప్రకృతి. కవి రచయిత తన రచనా వ్యాసాంగంలో ఏదో ఒక రూపంలో ప్రకృతి పచ్చదనం ఇమిడి పోతుంది.       ఈ ప్రకృతి ఒడిలో మానవ జీవిత మూలాలను నాగరికత సుఖ దు:ఖాలను, అనుబంధాలను తన ఒడిలో భద్ర పరుచుకున్నదే పల్లె. పల్లెటూరు మనిషి మొదటి చైతన్యానికి సహజీవనానికి మూలం. అటువంటి పల్లెను అనేక కోణాలలో ఆవిష్కరిస్తూ చక్కని కవిత్వం రాసిండు జీఆర్‌ కుర్మె. ఆ కవిత్వమే 'శిలా ఫలకమనే' దీర్ఘ కవిత.       జీఆర్‌ కుర్మె అనగానే పునాది రాయి గుర్తుకొస్తుంది. ముద్దుగుమ్మ నుంచి సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించి ధమ్మపథం, శిలాఫలకం, ఆనవాలు కవితా సంపుటాలను వెలువరించిండు. కుర్మె మంచి కవిగా తెలుగు సాహిత్య లోకానికి పరిచయం. 2016 ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఇతని శిలాఫలకం.. నిజానికి కుర్మె గారు పుట్టిన ఊరు, బాల్యం, ఆనాటి తన ఎత్తు పల్లాల జీవితమే అయినా.. పల్లె నుంచి పట్టణానికి ప్రయాణమైన ప్రతి మనిషి అనుభూతిగా భావించవచ్చు. నిజంగా ఈ పుస్తకం చదివిన వారికి వాళ్లను బాల్యంలోకి తీసుకెళ్తుంది. 'కుగ్రామంగాని గ్ర...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...