ప్రకృతి లేని కవిత్వముండదు. కవిత్వానికి మొదటి వస్తువు ప్రకృతి. కవి రచయిత
తన రచనా వ్యాసాంగంలో ఏదో ఒక రూపంలో ప్రకృతి పచ్చదనం ఇమిడి పోతుంది.
ఈ ప్రకృతి ఒడిలో మానవ జీవిత మూలాలను నాగరికత సుఖ దు:ఖాలను, అనుబంధాలను తన ఒడిలో భద్ర పరుచుకున్నదే పల్లె. పల్లెటూరు మనిషి మొదటి చైతన్యానికి సహజీవనానికి మూలం. అటువంటి పల్లెను అనేక కోణాలలో ఆవిష్కరిస్తూ చక్కని కవిత్వం రాసిండు జీఆర్ కుర్మె. ఆ కవిత్వమే 'శిలా ఫలకమనే' దీర్ఘ కవిత.
జీఆర్ కుర్మె అనగానే పునాది రాయి గుర్తుకొస్తుంది. ముద్దుగుమ్మ నుంచి సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించి ధమ్మపథం, శిలాఫలకం, ఆనవాలు కవితా సంపుటాలను వెలువరించిండు. కుర్మె మంచి కవిగా తెలుగు సాహిత్య లోకానికి పరిచయం. 2016 ఏప్రిల్ నెలలో వచ్చిన ఇతని శిలాఫలకం.. నిజానికి కుర్మె గారు పుట్టిన ఊరు, బాల్యం, ఆనాటి తన ఎత్తు పల్లాల జీవితమే అయినా.. పల్లె నుంచి పట్టణానికి ప్రయాణమైన ప్రతి మనిషి అనుభూతిగా భావించవచ్చు. నిజంగా ఈ పుస్తకం చదివిన వారికి వాళ్లను బాల్యంలోకి తీసుకెళ్తుంది. 'కుగ్రామంగాని గ్రామం/ పట్టణంగాని పల్లెటూరు/ మేడల్లేని మిట్టవాడ/ అదొక బతుకునీడ' పుస్తకం తెరువగానే ఇటువంటి పల్లె స్వరూప స్వభావాన్ని మనముందుంచిండు కుర్మెగారు. నిజమే కదా! మేడల్లేని మిట్టవాడనే, అదొక బతుకు నేడనే.
పల్లెటూరంటేనే ప్రకృతి, ప్రకృతి తలపోతనే పల్లెటూరు. పొద్దున నిద్ర లేచింది మొదలు చీకటి పడే వరకు పశువులు, పక్షులు, జంతువులు, మనిషితో కలిసి జీవిస్తున్న సామూహిక అనుబంధం వర్ణణాతీతం. ఆ మనిషికి పక్షులు, పశువులు ఎటువంటి ఆత్మీయతను పంచుతున్నాయో... ఇక్కడ కుర్మె గారు 'చెట్లతలలపై కాకులు/ అరపుల రెట్టలు వేస్తాయి. 'చిలుకల కోకిలలూ/ చిగురు గొంతులతో జానపదం పాడుతాయి/ రేగల అరుపులకు/ పొదుగులు ద్రవిస్తాయి' అంటూ పల్లె తెల్లవారుతుంటే అక్కడి కళాత్మక దృష్యాలు చూడాల్సిందే. పల్లె అంటే పంట చేసు, పచ్చదనం సెలయేళ్ల ధారలు, ధాన్య రాళులు. ఆ ధాన్యరాశుల్ని అన్నంగా లోకానికి అందించే రైతు ప్రధానంగా గుర్తుకొస్తడు. ఆ రైతు గురించి కుర్మెగారు 'నాగళ్లను నడిపే చేను చెల్కలు/ కాలం గొంగళ్లను కప్పుకొని గాలి వాటాన్ని చలితాపాన్ని/ ఎండకోపాన్ని వాన దు:ఖాన్ని/ తరిమి తరిమి కొడతాయి' అంటూ రైతు కష్టాన్ని కవిత్వ రాశులుగా గాఢంగా కుప్పబోసిండు కుర్మె.
పల్లె అంటే పచ్చదనమొక్కటేకాదు. మనిషికీ మనిషికీ మధ్య ఆత్మీయతల్ని అనుబంధాల్ని నేర్పింది. గౌరవ మర్యాదల్ని అలవర్చింది. కల్తీ లేని స్నేహాలు, కపటం లేని పలకరింపులు.. కష్ట సుఖాల్లో కలిసి నడిచే సామూహిక బాధ్యతలు గుర్తుకొస్తాయి. దానితోపాటు దొరల ఉక్కుపాదం కింద నలిగిపోయిన బతుకు చిత్రాలు కనబడతాయి. ఇదే విషయాన్ని 'ఒక జన్మవిత్తు మొలకెత్తినా/ ఒక మరణ వృక్షం నేలకొరిగినా' పల్లెల్లో సంబరాల గొంగల్లు/ జాతర చేయాల్సిందే! అంటూ సహజీవనాన్ని గుర్తు చేస్తాయి.
పల్లెటూళ్లలో పండగలు సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకలు ఆరుగాలం కష్టించిన మనిషి కొంచెం సేద దారడానికి మార్గాన్ని వెేతుక్కుంటాడు. 'అక్షరం పల్లె హనుమాండ్లగుడి/ రావి చెట్టు నీడలో పగలంతా పాఠమై వెలిగి/ సాయంత్రం ఆరిపోతుంది' అట్లనే పల్లెల్లో తరతరాల నుంచి నాటుకొని పోయిన అసమానతల్ని కుర్మెగారు ఒక్క మాటలో 'ఊరంతా ఒక్కటే/ వాడలే వేరు' అంటూ నిజాన్ని నిఖర్సుగా చెప్పాడు.
కుర్మెగారు పుట్టినూరు, తనకు బతుకు పాఠాలు నేర్పిన ఊరు అందరి పల్లెలాగా కాదు. అతని ఊరు కరత్వాడ. ఆ కరత్వాడ తెలంగాణ ప్రాంతంలో నైజాము పాలనలో రజాకార్ల దౌర్జన్యాలు, జమీందార్ల ఆగడాలు మొదలగునవన్నీ పల్లెల్ని అల్లకల్లోలం చేసినవి. ఈ సంఘటలన్నింటినీ కుర్మెగారు ప్రత్యక్షంగా చూశాడు. వీటి నుంచి విముక్తికి పరితపించాడు. ఆ బాధ ఆవేదనే అక్షరరూపంగా మారి 'నేల తల్లి పురుడుపోసుకుని/ రోకట పోన్నుల్ని ఆరుద్రల్ని/ సీతాకోక చిలుకల్నికంటుంది' అనడంలో కవి పల్లె విముక్తిని ప్రతీకాత్మకంగా చిత్రించాడు.
భౌతిక వస్తువును చూసి రాస్తేనే రచనగా మనగలజాలదు. ఆ వస్తువులో కవి మమేకమవ్వాలి. అమంతంగా అభిమానించాలి. అసాధారణంగా విలక్షణంగా శోధించాలి. అప్పుడే కవితైనా, కథనైనా.. మరేదైనా కొత్తగా హత్తుకుంటుంది. జి.కుర్మెగారు తన జీవితం గిరిజన గూడాల్లోనే గడిచిపోయింది. గిరిజనులతోనే సాగిపోయింది. అందుకే ఆయనకు 'నెత్తిపై నెమలిక కుచ్చు టోపి/ మణుల కిరీటంగా పెట్టుకొని ఆకలి దప్పికలను రోకలి దుడ్డుకు చుడతారు. చలిపులి తోలును/ నడుముకు చుట్టుకొని/ బెదురు జింకల చూపుల్ని/ కళ్ల కొసలకు పూసుకుంటాడు' అంటూ గిరిజన గుస్సాడీ నృత్య విశేషాలను జీవితానికి అన్వయించి కవితాత్మకంగా మలిచాడు.
ప్రపంచీకరణ ఫలితంగా ప్రపంచమే ఒక మారుమూల గ్రామంగా మారిపోయింది. వ్యాపార పంటలొచ్చి రసాయన ఎరువుల వాడకం ఎక్కువైంది. దీనితోపాటు కరువు ఏర్పడి వాగులు చెరువులన్నీ ఎండిపోయినయి. పల్లెలన్నీ ఎడారు లైనాయి అంటూ 'పచ్చని చిలుకల కంకు లేయాల్సిన/ జొన్న చేలు/ మసిబారికాటుక కంకులేసి/ వెలుతుర్ని కోల్పోతాయి' అంటూ పంటల దుస్థితిని కవితాత్మకంగా చెప్పాడు.
ఇంత దయనీయ స్థితిలో ఉన్న తన పల్లెకు జలధారలు ప్రవహిస్తే ఎండిపోయిన వాగులు చెరువులు నిండు ముత్తైదువలా జల కళ దాల్చాలని కవి కలలు కంటున్నాడు. 'హలం పట్టిన కలల రైతులు/ నిన్నటిని మరిచిపోయి/ తీపికలం సాకారం కోసం/ ఈనాటికీ ఎదరు చూపులు'
పల్లె అందాలతోపాటు ఆనందాన్ని ఆవేదనల్ని ఆవేశాల్ని సంస్కృతిని స్వచ్ఛమైన మనుషుల మధ్య అనుబంధాల్ని కుర్మె దీర్ఘ కవిత రూపంలో కావ్యం రాశాడు. ఈ కావ్యం నిండా కవిత్వమే. పిపాసకులెవరైనా కవిత్వాన్ని పీల్చు కోవచ్చు. అంతరించిపోతున్న పల్లె తనాన్ని మళ్లీ ఒకసారి తిరిగి చూసుకోవచ్చు.
- డాక్టర్ ఉదారి

Comments
Post a Comment