Skip to main content

పగలు ఎండ..రాత్రి చలి - The peculiar atmosphere

పగటిపూట నెత్తిన సూర్యుడు మండిపోతున్నాడు. అదే రాత్రైతే చలి తీవ్రతకు అల్లాడిపోతున్నాడు. పూర్తిగా ఎండా లేదు. పూర్తిగా చలి లేదు. ఈ విచిత్ర పరిస్థితి జిల్లాలో వారం రోజులుగా కొనసాగుతోంది. ఈ పరిస్థితితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాతావరణ విచిత్ర పరిస్థితి వల్ల వృద్ధులు, చిన్నారులు మొదలుకుని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.జిల్లా వాతావరణ పరిస్థితిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


రాష్ట్రంలోనే జిల్లాలో వాతావరణ పరిస్థితి భిన్నంగా ఏటా ఉంటుంది. కానీ ఈ సారి వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. కానీ రాత్రి సమయంలో మాత్రం చలి వణికిస్తోంది. ఈ విచిత్ర పరిస్థితి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి రాత్రి ఏడు నుంచి తెల్లవారి 8 గంటల వరకు ప్రజలను చలితోపాటు చలిగాలులు వణికిస్తున్నాయి. మరోవైపు ఉదయం 10 గంటలు దాటిందంటేనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక మధ్యాహ్నానికి ఎండలు హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి విపరీతంగా ఉండడం సర్వసాధారణమే. కానీ ఈ సారి పగలు ఎండ, రాత్రి చలితో ప్రజలు ఫిబ్రవరి మాసంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆహారంతో పాటు వ్యాయామం... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి నుండి తెల్లవారు జాము వరకు చలి వణికిస్తోంది. మధ్యాహ్నం వేసవిని తలపిస్తున్న ఎండలతో చెమట పడుతోంది. చిన్నారులు, వృద్ధులు, రోగులు ఈ పరిస్థితితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల స్వైన్‌ఫ్లూ, జ్వరం, వైరల్‌ఫీవర్‌, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం, ఇప్పటికే చిన్నారులు, వృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో క్యూ కడుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుండడంతో ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో 12.1డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. అంటే సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయన్నమాట. ఇక పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 37.5 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల కారణంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే జబ్బులతో అవస్థలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సీజనల్‌ వ్యాధులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో నెలకొన్న మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో చిన్నపిల్లల ఆస్పత్రులతోపాటు ప్రధాన ఆస్పత్రి రిమ్స్‌లోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఇటీవల వృద్ధులు, చిన్నారులు సాధారణ రోజుల్లో కన్నా పదిశాతం అధికంగా వస్తున్నారని వైద్యులు సూచిస్తున్నారు. ఇక చిన్న పిల్లల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే 15 వరకు చిన్న పిల్లల ఆస్పత్రులు ్పయివేటువి ఉన్నాయి. అన్నింటా చిన్న పిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 100 నుండి150 మంది చిన్నారులను వైద్యులు పరీక్షిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...