నవతెలంగాణ-బజార్హత్నూర్
మండలంలోని జాతర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామీణ కబడ్డీ పోటీల్లో గుడిహత్నూర్ మండలంలోని గర్కంపేట జట్టు విజేతగా నిలిచింది. వాలీబాల్ పోటీల్లో మహారాష్ట్రలోని మార్వా జట్టు సత్తా చాటి మొదటి స్థానంలో నిలిచింది. నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతరాష్ట్ర గ్రామీణ క్రీడా పోటీలు ఆదివారం అర్ధరాత్రి ముగిశాయి. ఆదివారం రాత్రి కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. కబడ్డీలో గర్కంపేట్ కబడ్డీ జట్టు గెలుపొందింది. మొదటి బహుమతి రూ.21 వేలు, రెండో స్థానంలో తాంసి జట్టుకు రూ.15 వేలను ఎంపీ నగేష్ అందజేశారు. వాలీబాల్ పోటీల్లో మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన పార్వ జట్టు మొదటి బహుమతి, మహారాష్ట్రకు చెందిన నందిగాం జట్టు రెండో స్థానంలో నిలిచింది. వీరికి ఎంపీ బహుమతులు అందజేశారు. షటిల్ పోటీల్లో మొదటి బహుమతి బోథ్ మండలానికి చెందిన ఎం. శ్రీకాంత్ గెలుపొందాడు. అర్ధరాత్రి వరకు ఎంపీ నగేష్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి కుంగిపోకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లి విజయం సాధించాలన్నారు. నిత్యం క్రీడా సాధన చేస్తూ నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. ఇందులో భాగంగా పలు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు, గ్రామంలోని యువతీ యువకులు జానపద గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెందూర్ భీంబాయి-ఈశ్వర్, జడ్పీటీసీ మునేశ్వర్ నారాయణ, ఎంపీటీసీ లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నానెం రమణ, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జివి రమణ, నవజ్యోతి క్లబ్ సభ్యులు గోడం చందన్, మడావి కృష్ణ రావు, కత్లె గంగారాం, పెందూర్ సుదర్శన్, మెస్రం హన్మంత్, మెస్రం రవిందర్, గోడం తిరుంబక్, మడావి కల్యాణ్, టీఆర్ఎస్ నాయకులు అల్కే గణేష్, జాంసింగ్, ఉత్తం, కొత్త శంకర్, అందె ప్రకాష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.

Comments
Post a Comment