Skip to main content

అందం..ర‌క్ష‌ణ‌..ఆరోగ్యం - Caps, Scorfs & Sunglasses protection in summer

ఫిబ్రవరి మొదటి వారం నుంచే భానుడు ప్రతాపం మొదలుపెట్టినట్టు వాతావరణ మార్పులు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత తగ్గిపోయి అదే క్రమంలో ఎండ వేడిమి పెరుగుతోంది. గత సంవత్సరం కంటే భానుడు భగభగలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ప్రజలు చలికాలం ఫోబియా నుంచి బయటికొచ్చేసి వేసవి కాలం ఉపశమన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వేసవి నుంచి కాపాడే వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
నవతెలంగాణ - ఆదిలాబాద్‌టౌన్‌
ఎండ పెరుగుతోంది. మెల్లమెల్లగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఎండ నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ఉపశమన చర్యలు మొదలుపెట్టారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి, వడదెబ్బ తగలకుండా ఉండడనికి చిన్న చిట్కా.. పెద్ద రక్ష.. టోపీ. పల్లెల్లో అయితే రైతులు, శ్రామికులు కండువాతో తలపాగా చుట్టి ఎండ నుంచి రక్షణ పొందుంతుంటారు. పట్నాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు టోపీలు ధరించడానికి ఇష్టపడతారు. ఇది ఎండకు రక్షణ మాత్రమే కాదు.. యూత్‌కు ఫ్యాషన్‌. సాంస్కృతిక ఐకాన్‌ కూడా.
టోపీల చరిత్ర ఇది...
క్రీస్తు పూర్వం 3,300 సంవత్సరంలో ఓట్జీ అనే వ్యక్తి దీనిని తొలిసారిగా ధరించాడని చరిత్రకారులు చెబుతున్నారు. తలకు రక్షణగా, చల్లగా హాయిగా ఉండటంతో ఆ ఫ్యాషన్‌ రాను రాను అవసరంగా మారింది. లండన్‌ హ్యాటర్స్‌ జేమ్స్‌లాక్‌ అండ్‌ కంపెనీ తొలుతగా టోపీలను తయారు చేసింది. ప్రపంచంలో అతి ప్రాచీన హ్యాట్‌ షాప్‌గా ఇది ప్రసిద్ధి చెందింది. 19వ శతాబ్దంలో లండన్‌లో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో హాజరైన వేలాది మంది ప్రజలంతా టో పీలు ధరించి ప్రత్యేకత చాటుకున్నారు. పూలు, ఈకలు, నూలు వస్త్రాలతో తయారు చేసిన ఫ్యాషన్‌ టోపీలను స్త్రీలు ధరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టోపీలు పలు రకాల్లో, డిజైన్లలో, అలంకారాల్లో దర్శనమిస్తూ ఫ్యాషన్‌కు,రక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి..
మార్కెట్లో పలు రకాల టోపీలు..
డెనిమ్‌జీన్స్‌, ఆడిడాస్‌, మైక్‌, నైక్‌, పూమా, పనామా, రీబాక్‌, క్లాసిక్‌, మేడిన్‌ బంగ్లాదేష్‌, కొరియా తదితర బ్రాండెడ్‌ టోపీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూ.50 నుంచి రూ. 999 వరకు ధర పలుకుతున్నాయి. మాన్‌స్టర్‌, చెగువేరా, బేస్‌బాల్‌, దేవానంద్‌, ఆర్మీ, యోయో, కమాండర్‌, డాక్‌నెస్‌, న్యూజనరేషన్‌, ఐపీఎల్‌, హ్యార్లీ డేవిడ్‌సన్‌, బేబీ క్యాప్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. కాటన్‌, పాలిస్టర్‌, స్పన్‌, డబుల్‌ క్లాత్‌లతో తయారు చేసిన పలు రకాల టోపీలను విక్రయిస్తున్నారు. సాధారణ టోపీలు రూ.30 నుంచి ఖరీదైన టోపీలు రూ. వెయ్యి వరకు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్లేన్‌ టోపీలతో పాటు, కొన్ని టోపీలపైన రకరకాల బొమ్మలు, నంబర్లతో వారి వారి అభిరుచులను తెలియజేస్తాయి. హాయిగా గాలి రావడానికి అన్నట్లు టోపీ చుట్టూ చిల్లులు చిల్లులు ఉండే జాలీ క్యాప్స్‌ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి..
కూలింగ్‌ డ్రెస్‌..
మిగతా సీజన్లో దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా నడుస్తుందేమో కానీ సమ్మర్‌లో ఆ మాటే నడవదు. మండే ఎండల్లో ఏ డ్రెస్సయినా తడచిముద్దవ్వాల్సిందే. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు చెమటతో పదిమందిలో తిరగాలన్నా.. కలిసి ప్రయాణం చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాటన్‌ డ్రెస్‌లకు సమ్మర్‌లో భలే ఆదరణ ఉంటుంది. గతంలో ఒకే రకమైన కాటన్‌ డ్రెస్‌లు అందుబాటులో ఉండేవి. వాటివల్ల సెలెక్టివ్‌గా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాటన్‌లో చాలా వెరైటీలు వచ్చాయి. లెనిన్‌ డ్రెస్‌లు కూడా చల్లదనాన్నందిస్తాయి.
కూలింగ్‌ గ్లాస్‌లు..
ఎండ ప్రభావానికి గురికాకుండా చర్మ రక్షణ కోసం సన్‌స్క్రీన్స్‌ వాడినట్టే కండ్లకు అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే చలువ కళ్లద్దాలు వాడాలి. ఎక్కువ సమయం ఎండలో పనిచేసేవారు పోలరైజ్‌డ్‌ లెన్సెస్‌ వాడితే ఎదుటివాళ్లని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా కండ్లలోకి పడకుండా ఎండలోకెళ్లినప్పుడల్లా తలకు క్యాప్‌ పెట్టుకోవాలి. ఎండాకాలం పార్క్‌లు, బీచ్‌లు వెళ్లేవారు హ్యాట్‌-సన్‌గ్లాసెస్‌ కాంబినేషన్‌ వాడితే రెండు విధాల ఉపయోగం ఉంటుంది. అలాగే రాప్‌ అరౌండ్‌ ఫ్రేమ్‌ కలిగిఉండే సన్‌గ్లాసెస్‌ వాడితే ఏటవాలు సూర్యకిరణాలు కళ్లను తాకకుండా ఉంటాయి. కూలింగ్‌ గ్లాసెస్‌ వంద రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి.
పాదాలు పదిలం..
వేసవిలో ఫుట్‌వేర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువసేపు షూస్‌ వేసుకోవడం వల్ల కాళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి షూస్‌ కంటే సాండిల్స్‌, చప్పల్స్‌ వేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ షూస్‌ వేసుకున్నా క్లోజ్డ్‌గా ఉన్నవి కాకుండా ఓపెన్‌గా, వదులుగా ఉన్న షూస్‌ ఎంచుకోవాలి. లెదర్‌ బూట్లు అస్సలు వేసుకోరాదు. కాన్వాస్‌, కాటన్‌ షూస్‌ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. షూస్‌ శాండిల్స్‌, చెప్పుల రంగుని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. లేత రంగులకు ప్రయారిటీ ఇవ్వాలి.
మహిళలకు స్కార్ఫ్‌
హ్యాట్‌ పెట్టుకోవడం ఇష్టం లేని అమ్మాయిలకు బెస్ట్‌ ఆప్షన్‌. ముఖం మొత్తం కనిపించకుండా తల చుట్టూ కట్టుకుని ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కనిపిస్తున్నారు. చుడీదార్‌, కుర్తాలకు ఇవి మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంటున్నారు. కాకపోతే సమ్మర్‌కి అన్ని స్కార్ఫ్‌ సూట్‌ అవ్వవు. సిల్క్‌ స్కార్ఫ్‌లు కాకుండా కాటన్‌, లెనిన్‌ ఫ్యాబ్రిక్‌వి తీసుకోవడం మంచిది. ఫ్లోరల్‌ ప్రింట్స్‌, లైట్‌ కలర్‌వి అయి ఉండాలి. ముదురు రంగువి తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు
మరికొన్ని చిట్కాలు..
* వేసవిలో కాటన్‌, లినెన్‌ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన క్యాప్స్‌నే పెట్టుకోవాలి
శ్రీపొట్టిగా ఉన్నవారు క్రౌన్‌ ఎక్కువగా ఉన్న హ్యాట్‌ పెట్టుకుంటే కాస్త పొడవుగా కనిపిస్తారు. లైట్‌ కలర్‌ హ్యాట్‌ అయితే మరీ మంచిది.
* సన్నగా ఉండేవారు చిన్నసైజ్‌లో ఉన్న హ్యాట్‌లను సెలెక్ట్‌ చేసుకోవడం బెటర్‌.
* యూవీ కిరణాల నుంచి వందశాతం రక్షణ అని లేబుల్‌పై రాసి ఉన్న గ్లాసెస్‌నే ఎన్నుకోవాలి.
* ముదురు రంగులో ఉండే కళ్లద్దాలన్నీ ఎండ నుంచి కండ్లను రక్షిస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. రసాయ

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...