Skip to main content

చిగురించే తెలంగాణ‌పై...మ‌న స‌త్తె‌న మాస్టా‌రు ఆశ‌లు! - Poet Sattenna

పురుగు మందు దాగి నేను...
పాణం దీసుకోను..
తెలంగాణ కొరకు నేను పాణమైనా ఇస్తాను..
ఓ మల్లన్న...చిగురించాలి తెలంగాణ ఆశ గంపెడంత..
అంటూ నాడు తెలంగాణ ఉద్యమంలో రైతులను భాగస్వామ్యం చేయాలని తన (చిగురించిన తెలంగాణ ఆశ)...కవితా గేయమాలికలో పిలుపునిస్తారు..మన పోతుగంటి సత్తెన్న మాస్టారు..
కరెంటేమొ కోతలాయె..
పంటలెమొ ఎండవట్టె...
రైతుకంట నీరు వొలికెరా...
ఓ మల్లన్న రైతుగోస..
వినేదెవడురా...
సేసిన అప్పులేమో..
అడ్డి మీద అడ్డి పెరిగి..
నడ్డేమో యిరగపట్టెరా..
ఓ మల్లన్న రైతు గోస..
వినేదెవడు రా...
అంటూ రైతు కష్టాలను, ఆవేదనను తన కవితాగేయమాలికలో పొందు పరుస్తారు...మన పోతుగంటి సత్తెన్న మాస్టారు.
ఏమని వ్రాయను ఓ నేస్తం..
నా పవిత్ర భారతంలో..
మర్డర్లూ..మానభంగాలు..
మతోన్మాద కలహాలు, మారణ హోమాలు..
నిత్య కృత్యాలై చరిత్ర సృష్టిస్తున్నాయని..
వ్రాయనా ఓ నేస్తాం...
నవతెలంగాణ-నిర్మల్‌
మన పోతుగంటి సత్తెన్న మాస్టారు నేటి నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని పాత ఎల్లాపూర్‌ గ్రామంలో నర్సాగౌడ్‌, మల్లమ్మ దంపతులకు జన్మించారు. ఖానాపూర్‌లో విద్యాభాసం కొనసాగించి 1972-73లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారు. 1976లో టీటీసీ పూర్తి చేసి తొలిసారిగా1977లో భీంపూర్‌ జెడ్‌పీఎస్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత 1982లో సత్తెనపెల్లిలో పని చేశారు. 1983-89 వరకు ఖానాపూర్‌ యూపీఎస్‌లో, 1989-2000 వరకు గోసంపల్లిలో, 2000-2001 వరకు కెరమెరి మండలం సాంగ్విలో పని చేశారు. 2001-2005 వరకు జాప్రాపూర్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగోన్నతి పొందారు. 2005-2011వరకు వెంకటాద్రిపేట, సోమార్‌పేట్‌, గొల్లపేట్‌లో పని చేశారు. 2011-2012 వరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పని చేసి ఉద్యోగ విరమణపొందారు.
సాహిత్యంపై ప్రేరణ..
పోతుగంటి సత్తెన్న చదువుకునే రోజుల్లో రేడియోలో ఉగాది సందర్భంగా వచ్చే కవి సమ్మేళనాల్లో వివిధ కవుల కవితలను వినేవారు. అందులో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి కవిత్వం ఆకట్టు కోవడం, నేను కూడా కవిత్వం రాస్తే బాగుంటుందని అనుకోవడంతో సాహిత్యంపై మక్కువ పెరిగింది..
ప్రశంసలు...
కవి గూడ అంజయ్య, డాక్టర్‌ సామల సదాశివ మాస్టారు సత్తెన్న రాసిన కవితలను ప్రశంసించారు. 2011లో అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా సాహితీ సమాఖ్యవారు ప్రశంసాపత్రం అందించారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డిపై రాసిన కవితకు ఆయన నుండి పోస్టు ద్వారా అభినందన పత్రము అందజేశారు.
రచనలు...
చిగురించిన తెలంగాణ ఆశ...అనే కవితా గేయమాలిక పుస్తకావిష్కరణను 2007లో ప్రథమ ముద్రణ వేశారు.
అవార్డులు...
*1995లో అదిలాబాద్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు దక్కించుకున్నారు. వేణుగోపాలచారి చేతుల మీదుగా సన్మానం పొందారు.
* చిగురించిన తెలంగాణ ఆశ...కవితా గేయమాలిక పుస్తకావిష్కరణలో గోరేటి వెంకన్న చేతుల మీదుగా సన్మానం పొందారు.
మానవత్వం మంట గలిసె..
దానవత్వం ధరణి వెలిసే..
మరణ కాండ పెచ్చు పెరిగె..
మనిషి జాడ తెలుపదాయె..

భాయి భాయి అన్న వాడె..
బాకుతోడ పొడిచి పోయె..
రక్తం సిక్తం ధరణి తలం..
వ్యక్తికిక్కడ చోటులేదు...

గూండాలకు గొడుగు పట్టే..
రాజకీయపు అండదండలు..
అణువణువునా రాజకీయం..
అణుబాంబులా భీతిగొలుపు..

అయోధ్య మంటల్లో..
ఆహుతైన ప్రాణులెన్నో..
బొంబాయి మత బాంబుకు..
భరతమాత తల్లడిల్లెను..

రుధిర ధారలు మిన్ను ముట్టె..
హృదయస్పందన కొడిగట్టె..
మతం చిచ్చు మాసిపోదా..
మానవత్వం మేలుకొనదా..

అంటూ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను తన ఏమని వ్రాయను ఓ నేస్తం కవితాగేయంలో పేర్కోంటారు. మన పోతుగంటి సత్తెన్న మాస్టారు...
సమాజాన్ని మేలుకోల్పేవిధంగా సాహిత్యం ఉండాలి
నేటి కవిత్వం ఊసుపోక రాసేది కాక..సమాజాన్ని మేలు కోల్పేలా ఉండాలి. సమాజంలో జరిగే సంఘటనలకు స్పందించి మంచి కవిత్వాన్ని నేటి కవులు అందిచాలి. కవిత్వం అందరిని ఆలోచింప చేసే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరి మనస్సు పొరల్లోకి వెల్లి చైతన్యం నింపేలా రాయాలి..
- పోతుగంటి సత్తెన్న

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...