అతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. బడిలో పిల్లల కు పాఠాలు బోధిస్తాడు.. అయితే ఆ మాస్టారుకు క్రికెట్ పిచ్చి.. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడే వాలిపోతాడు. వ్యాఖ్యాత (కామెంటేటర్)గా అవతారమెత్తుతాడు. తన వ్యాఖ్యానంతో అందరినీ అలరిస్తాడు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో వ్యాఖ్యాతగా రాణించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు జబాడె రవి.
నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామాఁకి చెందిన జవాడె రవికి క్రికెట్ వ్యాఖ్యానం అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక పరిస్థితుల కారణంగా దాఁకి దూరంగా ూన్నాడు. కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్‌పీఎల్ పాఠశాలలోఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. టీచర్స్ కాలనీలో ఁవాసముంటున్నాడు. అయితే క్రికెట్ వ్యాఖ్యాత కావాలన్న కోరిక అలాగే ూండిపోయింది. దీంతో తన కలను సాకారం చేసుకోవడాఁకి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఓ వైపు పిల్లలఁ పాఠాలు బోధిస్తూనే కామంటేటర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదిలాబాద్ పట్టణంలో, జిల్లాలో ఎక్కడైనా గాఁ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయంటే అక్కడ వాలిపోయి వ్యాఖ్యానం మొదలుపెడతాడు. దీంతో మెల్లమెల్లగా ఇతఁ గురించి అందరికీ తెలిసిపోయింది. ఎంత పెద్ద ట్రోఫి అయినా సరే ఈ మాస్టర్‌ఁ వెంటనే కామెంటర్‌గా చేయమఁ ఆహ్వానం పంపిస్తారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అతను కామెంటరీ చేస్తున్న సమయంలో ప్ష్రేఁలు మంత్రముగ్దులు అయిపోవాల్సిందే. అంతేకాదు మైదానంలో ఉన్న క్రికెట్ ప్లేయర్స్‌ఁ తన కామెంటరీ ద్వారా ఉత్తేజ పరుస్తాడు.కామెంటరీలో తనదైన శైలిలో రాణిస్తూ అందరితో శభాష్ అఁపించుఁంటున్నాడు జబాడే రవి. ఇతఁ కామెంటరీకి మంచి గుర్తింపు రావడంతో సంవత్సరాఁకి ఒక సారి హైదరాబాద్ జరిగే 'స్టార్స్ క్రికెట్' లో కామెంటరీగా చేయాలఁ ఆహ్వానం అందింది. ఎల్‌బీ స్టేడియంలో వేలాది మంది క్రికెట్ ప్రేక్షఁలను తన కామెంటరీతో అబ్బురపరిచి అందరి దృష్టి ఆకర్షించాడు రవి. పలువురు సినీ ప్రముఖులు ఇతఁ కామెంటరీకి కితాబు ఇచ్చారు. హోంమంత్రి నాయిఁ నర్సింహహారెడ్డి, ఎంపీ కవిత ప్రశంసాపత్రం అందించి అభినందించారు. అంతేకాదు శ్రీలంకలో జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లఁ కామెంటరీగా చేయాలఁ పిలుపు వచ్చింది. శ్రీలంకఁ వెళ్లి ఆ మ్యాచ్‌లో కామెంటరీ చేసి పలువురి దృష్టిఁ ఆకర్షించాడు రవి. వరుసగా మహారాష్ట్రలోఁ ముంబయి, నాగ్‌పూర్, నాదేండ్ వంటి ప్రాంతాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లలో కూడా కామెంటరీ చేస్తుంటాడు. రవి ఇప్పటి వరఁ సుమారు 300 పై చిలుఁ మ్యాచుల్లో కామెంటరీ చేశాడు.
Comments
Post a Comment