- ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లకు భలే డిమాండ్
- ముందుగానే ఊపందుకున్న విక్రయాలు
ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటేశాయి. వేడిగాలులు, ఉక్కపోతలు.. వారం రోజులుగా పట్టణంలో పరిస్థితి ఇది. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు చల్లని నేస్తాలను వెతుక్కుంటున్నారు పట్టణవాసులు. గతేడాదితో పోలిస్తే అప్పుడే ఎండ తీవ్రత అధికమైంది. ఉదయం పది గంటల నుంచే బయటికి రాలేని విధంగా ఎండ ఉంటోంది. ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీల కొనుగోళ్లలో బిజీబిజీ అయ్యారు. దీంతో మార్కెట్లలోనూ కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈమారు కొనుగోళ్ళు ఆశాజనకంగా ఉన్నాయంటూ దుకాణదారులు చెబుతున్నారు.
మరికొన్ని రోజుల్లో సూర్యుడు మరింత ప్రతాపాన్ని చూపేలా ఉన్నాడు. రాత్రివేళల్లోనూ ఇంట్లో కూలర్ తప్పనిసరి అయ్యింది. ఆర్థికంగా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఏసీలు కొనేందుకు ఎక్కుమంది ప్రయత్నిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారంతా కూలర్లవైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం కూలర్ల అమ్మకాలు పెరిగేలా ఉన్నాయని దుకాణ దారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండ్లలో కూలర్లు ఉన్నవారు వాటికి మరమ్మతులు చేసుకోవడం, రంగులు వేయడం ప్రారంభించారు. రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల ధరల్లో కూలర్లు అందుబాటులో ఉన్నాయి. మోడళ్లు, మోటార్ సామర్థ్యం ఆధారంగా ధర ఉంటుందని దుకాణదారులు పేర్కొంటున్నారు. ప్రతి వస్తువుపై ఒక సంవత్సరం వరకు వారంటీ ఉంటుందన్నారు. అవసరమైన వారికి హౌండెలివరీ చేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈమారు కొంత ముందుగానే అమ్మకాలు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు కొనుగోళ్లు ఆశాజనకంగానే ఉన్నాయని వివరిస్తున్నారు.
పరిమళించే చల్లదనం
గదిలో ఉష్ణోగ్రతలను నియంత్రించడంతోపాటు కూలర్లు సువాసనలు వెదజల్లడంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల ఫ్లేవర్లలో ఎయిర్ ఫ్రెషనర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గడ్డిలేని కూలర్ మార్కెట్ లోకి వచ్చింది. సాధారణంగా కూలర్లో చల్లదనం అందించేం దుకు గడ్డిఏర్పాటు చేస్తారు. దీనిని ఏటా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ సారి భిన్నంగా గడ్డిలేని కూలర్ అందు బాటులోకి వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా అట్టముక్కలు అమర్చి ఉంటాయి. ఐదేండ్ల వరకు వీటిని మార్చుకోవాల్సిన ఆవసరం ఉండదని వ్యాపారులు చెబుతున్నారు.
విడిభాగాలకూ డిమాండ్..
వేసవి రాగానే అంతవరకూ పెట్టేసిన కూలర్లను అందరూ బయటకు తీస్తుంటారు. వాటిని మరమ్మతులు చేయించి తిరిగి ఉపయోగిస్తుంటారు. దీంతో ఎయిర్ కూలర్ల విడిభాగాలకు సైతం డిమాండ్ ఉంటుంది. పాతకూలర్లో విడిభాగాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవచ్చు. కూలర్ బాడీ (ఫైబర్, మెటల్) ఫ్యాన్, ఫ్యానెల్, డ్రువర్డర్, పైపులు, వైర్లు వీల్స్, స్విచ్‌లు ఇలా ఒకటేమిటి అన్ని వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి అమరిక కూడ సులువుగా ఉండడంతో వినియెగదారులు సొంతంగానే మరమ్మతు చేసుకోవచ్చు .
కూలర్ వాడకంలో జాగ్రత్తలు
కొనుగోలుకు ముందే ఇంట్లో స్థలాన్ని బేరీజు వేసుకుని, దానికి అనుగుణంగా కూలర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫైబర్ బాడీ కూలర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. మెటల్ కూలర్ చాలా కాలం మన్నుతుంది. కానీ షార్ట్ సర్య్కూట్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. కూలర్‌ను ఇంటిలోపలి భాగంలో కంటే కిటికి వెలుపల భాగంలో ఉంచితే రెట్టింపు చల్లదనం ఇస్తుంది. కూలర్ నడుస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న వేడిగాలి బయటికి వెళ్లే ఏర్పాటు కచ్చితంగా ఉండాలి. లేకపోతే గాలిలోని తేమతో ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతిరోజు నీటిని మార్చడం తప్పనిసరి. దుర్వాసన రాకుండా దోమలు బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వాసన రాకుండా ఎయిర్ రిఫ్రెష నర్లకు ఉప యోగించు కోవాలి. వీలైనంత వరకు ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. డ్రైవర్ల విషయంలో జాగ్రత్త వహించాలి. అవి తొలగిపోతే వెంటనే మార్చాలి. పిల్లలు కూలర్లో చేయిపెట్టే ప్రమాదం ఉంటుంది.
రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు..
పట్టణంలో రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఒక మాదిరిగా కొనసాగుతున్నాయి. మధ్యతరగతి సంపన్న వర్గాలు వీటిపై అధికంగా దృష్టి సారిస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేసిన రిఫ్రిజిరేటర్లు వివిధ రకాల మోడళ్లలో అందు బాటులో ఉన్నాయి. ఆయా కంపెనీని బట్టి వీటి ధర ఉంది. సూమారు 170 లీటర్లతో రిఫ్రిజిరేటర్లతో అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో సైడ్డోర్, మల్టీ డోర్, డబుల్ డోర్, సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీని బట్టి వీటి ధర సూమారు రూ.9వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
ధరలు..
* స్థానికంగా తయారయ్యేకూలర్లు రూ.2వేల నుంచి మోడల్‌ను బట్టి రూ.8వేల వరకు ధర పలుకుతున్నాయి.
* ఐరన్ కూలర్లకు రూ.4వేల నుంచి 25వేల వరకు అందుబాటులో ఉన్నాయి.
* డబుల్ డెక్కర్ కూలర్లకు రూ.6వేల నుంచి 20వేల వరకు ధరలు ఉన్నాయి.
*గడ్డి లేని కూలర్లు రూ.3వేల నుంచి 15వేల వరకు వివిధ ధరల్లో లభ్యమవుతు న్నాయి.
అందరికి అందుబాటు ధరల్లో..
సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో గృహోపకరణాలను ఉంచాం. లోకల్ మోడల్‌లతో పాటు మరో 10 రకాల వివిధ మోడల్లను అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో అందిస్తున్నాం. మావద్ద గృహోపకరణాలు, ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లతో పాటు వివిధ రకాల కూలర్ల మోడళ్లు అందు బాటులో ఉన్నాయి.
- అశ్వాఖ్ అహ్మద్, బిగ్ బజార్ ప్రొప్రైటర్
గిరాకీ ప్రారంభమైంది
ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండుతుండడంతో ఇప్పుడిప్పుడే గిరాకీ ప్రారంభమైంది. ఈ సీజన్ ఆశాజనకంగా ఉండేటట్టు కనిపిస్తోంది. అన్ని వర్గాలకు అందుబాటులో ధరల్లో కూలర్లు అందుబాటులో ఉంచాం. సరికొత్త మోడళ్లను తెప్పించాం. ఎవరి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారు వివిధ మోడళ్లను కొంటున్నారు
- అబ్దుల్ రహీం, న్యూ ఆదిలాబాద్ ఎలక్ట్రికల్స్

కూలర్లు.. ఎయిర్ కండీషన్లు మన్నికైనవి గుర్తించాలి
నవతెలంగాణ - మామడ
ప్రస్తుతం వేసవి కాలం. భానుడు భగభగ మండిపోవడంతో ఉష్ణోగ్రతలు విఫరీతంగా పెరిగిపోయాయి. రాత్రిపూట కూడా వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో కనీసం రాత్రిపూట అయినా ప్రశాంతంగా నిద్ర పోదామన్న ఉద్ధేశ్యంతో పలువురు తమ స్థోమతను బట్టి ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు తక్కువ ధర పేరుతో నాణ్యత లేని ఉత్పత్తులను అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీలు, హేర్కూలర్లతో పాటు ఫ్రిజ్‌లు కొనే ముందు వాటి గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరముంది.
కూలర్లలో కొనుగోళ్లలో జాగ్రత్తలు...
కూలర్లు రెండు రకాలుగా ఉంటున్నాయి. కొన్నింటికి రెండుమోటార్లు ఉంటే మరికొన్నింటికి ఒక మోటరే ఉంటుంది. ప్రస్తుతం కూలర్లకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో పలు పెరెన్నికైన కంపెనీలతోపాటు ఊరుపేరు లేని కంపెనీలు కూడా కూలర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక మోటారుతో పనిచేసే వాటిలో విద్యుత్ వినియోగం 180 వాట్లు ఉంటుంది. అదే నాసిరకం కూలర్లలో ఇది 250 వాట్లమేరకు ఉంటుంది. అంటే ప్రమాణాలు పాటించని సంస్థలు తయారు చేసే ఉపకరణాల విద్యుత్ వినియోగం బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక మోటారుతో పనిచేసే కూలర్లలో ఆర్పీఎం 1000 నుంచి 1450 వరకు ఉంటుంది. ఇది ఎక్కువ వేగంగా తిరుగుతాయి. దీంతో ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది. అదే రెండు మోటార్లు ఉండే కూలర్లలలో ఆర్పీఎం 200 నుంచి 600 వరకు మాత్రమే ఉంటుంది. రెండు మోటార్లు ఉన్న కారణంగా చల్లటి గాలి వీచయంతో పాటు పనితీరు మెరుగ్గానే ఉంటుంది. తక్కువ విద్యుత్ వినియోగమయ్యే కూలర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొంచెం ధర ఎక్కువైన వీటిని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మోటారు నిమిషానికి భ్రమన నిష్పత్తి (ఆర్పీఎం) తప్పనిసరిగా చూడాలి. ఎక్కువ ఆర్పీఎం ఉంటే వేగంగా బోర్లు తిరగడంతో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. అందువల్ల తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే తక్కువ ఆర్పీఎం ఉన్న వాటికే ప్రాధాన్యమివ్వాలి.
ఎయిర్ కండీషన్ల ఎంపిక..
ఏసీలు కొనుగోలు చేసేటప్పుడు బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటిలో ఎయిర్ కండీషన్ బిగించే గది విస్తీర్ణాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఒక చిన్న కుటుంబం మధ్యతరగతి అయితే అయితే 1.5 టన్నులు, పెద్ద గది లేదా హాల్ అయితే రెండు టన్నుల ఏసీలను ఎంపిక చేసుకోవాలి. అదే విధంగా విద్యుత్ వాడుకకు ప్రాధాన్యతనివ్వాలి. ఎన్ని ఎక్కువ స్టార్లు ఉంటే అంతే తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. మన్నిక కూడా బాగుంటుంది. ఏసీల్లో కూడా ఇప్పుడు పలు రకాల మోడల్ వస్తున్నాయి. ఇన్బెల్డ్, స్ట్రైలైజర్, ఆటోమెటిక్ బస్ట్క్లీనర్ ఇలా ప్రత్యేకతలు ఉంటున్నాయి. అలాగే గ్యారంటీ, వారంటీ గురించి వివరంగా తెలుసుకోవాలి.
రిఫ్రిజిరేటర్ల ఎంపిక..
రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు) 170 లీటర్ల నుంచి 235 లీటర్ల వరకు సింగిల్డోర్తో ఉన్నాయి. వీటిలో ప్రాస్ట్స్ఫ్రే (ఐస్ పట్టకుండా) సదుపాయం ఉండదు. ఇక రెండు తలుపులు ఉండేవి 250 లీటర్ల నుంచి వివిధ శ్రేణుల్లో ఉన్నాయి. వీటి ధరలు రూ.15వేల నుంచి పైబడి ఉన్నాయి. ఇంటిలో ఉండే మనుషులు ఫ్రిజ్‌లు నిల్వ చేసే వస్తువులను బట్టి ఎన్ని లీటర్ల సామర్థ్యం ఉన్నది, అవసరమో నిర్ధారించుకోవాలి. విద్యుత్ ఆదా కోసం స్టార్ రేటింగ్ చూడాలి. లోపలి భాగం శుభ్రం చేసుకునేందుకు వీలుగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయాలు నిల్వ ఉంచే ఛాంబర్‌పై గాజుమూతలు కాకుండా ఫైబర్‌తో చేసిన మూతలు ఉండేలా చూడాలి.

ఫ్రిజ్ వాడకంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి
చిన్నదైనా,
పెద్దదైనా.. ఫ్రిజ్ నేడు తప్పనిసరి వస్తువుగా మారింది. ఆహార పదార్ధాలు,
పాలు, కూరగాయలు, పండ్లు తదితరాలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ వుండే
ప్రయోజనం ఉండటం దీని వినియోగంలో ప్రధాన ఉద్దేశ్యం. అయితే దీన్ని ఉపయో
గించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. అప్పుడే సమస్యలు
లేకుండా ఎక్కువకాలం మన్నిక ఉంటుంది.
* ఫ్రిజ్‌లో ఆహారపదార్ధాలు, కాయగూరలు, పండ్లు తదితరాలు పెట్టే సమయంలో తీసు కునేందుకు వెసులుబాటుగా ఉండేలా ఖాళీఉండేలా పెట్టాలి. పూలు వంటి వాటిని పెట్టేటప్పుడు కవర్లో ఉంచినట్లయితే తాజాగా ఉండి. వాసన బయటకు రాకుండా ఉంటుంది.
* ఫ్రిజ్ తప్పనిసరిగా స్టెబిలైజర్ వాడాలి. అది వాడకపోయినట్లయితే వేసవికాలంలో విద్యుత్ కోతలు, ఒక్కోసారి విద్యుత్‌లోని వోల్టేజీల తేడాల కారణంగా ఫ్రిజ్ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మరమ్మతులకోసం కొంత డబ్బు ఖర్చుచేయవలసి రావచ్చు. అందువల్ల స్టెబిలైజర్ తప్పనిసరి. అలాగే కంప్రెషనర్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఫ్రిజ్ వెనుక బూజు వంటిది పట్టకుండా ఉండేలా గోడకు కొంచెం దూరంగా ఉంచి మధ్యమధ్యలో శుభ్రం చేస్తుండాలి. అలాగే ఫ్రిజ్లోపలి బాక్సులను అప్పుడప్పుడు శుభ్రం చేయడం మరచిపోకూడదు.
ఆకుకూరలను అలాగే పెట్టకుండా వాటిని శుభ్రంగా కడిగి, ఆరినతర్వాత తరిగి కవర్లలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టు కోవడం ఉత్తమం. పాలు, పెరుగు, పిండి, అలాగే ఆహారపదార్థాలను లోపల పెట్టేటప్పుడు మూతలు పెట్టడం మరచిపోకండి. ఫ్రిజ్ తలుపును వస్తువులు పెట్టాలన్న ఉద్దేశంతో ఎక్కువ సేపు తెరచిఉంచడం, ఎక్కువసార్లు తీయడం, వేయడం వంటివి కూడా చేయకూడదు. రెండువారాలకొకసారైనా ఫ్రిజ్ బయట మరకలు, దుమ్మువంటివి లేకుండా తుడవడం మంచిది. ఫ్రిజ్ ప్రక్కనే ఇరికించినట్లుగా బీరువా, కుర్చీలు తదితరాలు పెట్టకుండా ఉండడం మేలు.
*ఫ్రిజ్‌ను హీటర్, స్టవ్‌ల వద్ద వుండేలా అమర్చుకోకూడదు. కొంచెం గాలి తగిలేలా ఉన్న చోట ఫ్రిజ్ ఉంచినట్లయితే మంచిది. అలాగే విద్యుత్ ఆదా చేయాలన్న ఉద్దేశంతో రాత్రిపూట ఫ్రిజ్‌ను ఆఫ్ చేయకూడదు. విద్యుత్ బిల్లుల భారం ఎక్కువైతే రెండు, మూడురోజులకొకసారి కొద్దిసేపు ఫ్రిజ్‌ను స్విచ్ఛాప్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఫ్రిజ్‌ను తీసుకుంటున్న వారు అమ్మకందారుని దాని వాడకం, పని తీరుతో పాటు అత్యవసర సమయాల్లో ఊరు వెళ్లేవారు ఫ్రిజ్‌ను స్విచాఫ్ చేసి వెళ్లవచ్చా వంటి తమ సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది. తద్వారా దాని వాడకంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఫ్రిజ్‌లో ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అమ్మకందారునికి చూపించాలి. చాలామంది ఇండ్లలో చిన్నపిల్లలు ఫ్రిజ్ తలుపు తీసినప్పుడు చల్లగా ఉందని, తలుపులు తీయడం, వేయడం వంటి పనులు ఆటలాగా చేస్తుంటారు. అలాగే లోపల తలపెట్టి ఎక్కువ సేపు చూడటం చేస్తుంటారు కూడా. అలా చేయకుండా చూసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బంది పడవలసి ఉంటుంది.

Comments
Post a Comment