1 నుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి
పరీక్షలు ప్రారంభం కానుండగా.. కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో ఇంటర్ బోర్డు
అధికారులు నిమగ ్నమయ్యారు. నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి
అనుమతి నిరాకరించనున్నారు. ూమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56,655 మంది
విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 90 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ూదయం 9 గ ంటల నుంచి 12 గ ంటల వరకు పరీక్ష ూంటుంది.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు
నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా
కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఉ
దయం 9 గ ంటల నుంచి మధ్యాహ్నం 12 గ ంటల వరకు పరీక్షలను
నిర్వహించనున్నారు. మార్చి 9నఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగ నున్న ద
ష్ట్యా ఆ రోజు జరుగాల్సిన పరీక్షను 19వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు
గ ణితం పేపర్-2బీ, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పేపర్లకు పరీక్షను
నిర్వహించాల్సి ఉండగా.. వాటిని 19వ తేదీన నిర్వహించనున్నారు.
నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
నిర్ణీత సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ
పరీక్షకు అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు ప్రవేశించిన తర్వాత
పరీక్ష సమయం పూర్తయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికెళ్లడాన్ని
అనుమతించరు. ప్రశ్నాపత్రాలిచ్చినప్పుడే విద్యార్థి హాల్‌టికెట్లను ఇన్విజిలెటర్లు
తీసుకుంటారు. తిరిగి జవాబు పత్రాన్ని ఇన్విజిలెటర్‌కు ఇచ్చినప్పుడే
హాల్‌టికెట్‌ను విద్యార్థులకిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష
కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను కూడా పూర్తిగా నిషేధించారు.
వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు
ఈ ఏడాది ఇంటర్ బోర్డుఅధికారులు వెబ్‌సైట్‌లో కూడా హాల్ టికెట్లు
అందుబాటులో ూంచారు. దీంతో ఫీజు కట్టలేదని, హాజరుశాతం తక్కువగా ఉ
ందని కళాశాలల వేధింపులు తగ ు్గతాయని భావిస్తున్నారు. వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉన్న హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు
హాజరుకావచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్‌సైట్
%షషష.్‌రపఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ%లో సంప్రదించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్
చేసుకోవచ్చని.. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా.. కాలేజీ
స్టాంప్‌లు వేయకపోయినా విద్యార్థి వివరాలు, ఫొటోతో సరితూగితే ఆయా
విద్యార్థిని పరీక్షకు అనుమతిస్తామని చెబుతున్నారు.
144 సెక్షన్.. జీపీఎస్ నిఘా
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, హైటెక్
కాపీయింగ్‌ను నివారించడానికి సెంటర్లపై గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్)
నిఘాను ఉంచనున్నారు. నిఘాలో భాగ ంగా ప్రతీ సెంటర్‌లో 3 నుంచి 5
మంది వరకు పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. ఆయా సెంటర్ల
సమీపంలోని 500 గ జాల మేర ఫోన్లు, ఎస్సెమ్మెస్, ఎమ్మెమ్మెస్, పిక్చర్
మెసేజ్‌లను సైతం రికార్డు చేయనున్నారు.
Comments
Post a Comment