Skip to main content

ఫ్లెక్సీ నిషేధిస్తే.. పెయింటింగ్‌కు మహర్దశ - Flexi ban is the employment for painters

తమ దుకాణాలకు పేరు రాయించడానికి గతంలో వ్యాపారులు పెయింటింగ్‌ కళాకారుల దగ్గరకు వెళ్లేవారు. వారం ముందుగానే అడ్వాన్సు రూపంలో డబ్బులు ఇచ్చి సిద్ధం చేసుకునేవారు. ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు కూడా పెయింటర్లను గోడరాతలు రాయడానికీ ముందుగానే డబ్బులు ఇచ్చి వారికి పని ఇచ్చేవారు. కాని మారిన సాంకేతికతకు అనుగుణంగా మార్కెట్లో తక్కువ సమయంలో కావాల్సిన బొమ్మలు, ఫొటోలు, రంగు రంగుల పేర్లతో ప్రింటింగ్‌ తీసే ఫ్లెక్సీ యంత్రాలు వచ్చాయి. పట్టణాల్లో పలు చోట్ల దుకాణాలు వెలిశాయి. ప్రజలు కూడా వాటి వెంట పరుగులు తీశారు. దీంతో కాలక్రమేణా పెయింటింగ్‌ చేసే వారికి ఉపాధి కరువైంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఫ్లెక్సీని నిషేధిస్తారనే ప్రచారం జరగగా, అది నిజమైతే కళాకారులకు ప్రాణం పోసినట్లవుతుంది. పట్టణాలతోపాటు పలు మండల కేంద్రాల్లో విచ్ఛలవిడిగా ఫ్లెక్సీి దుకాణాలు ఏర్పాటయ్యాయి. దీంతో వాతావరణం కలుషితమవడంతోపాటు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుతోందని మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. విచ్ఛలవిడిగా ఫ్లెకీలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించాలని కూడా సూచించారు. ఈ ప్రకటన అధికారికంగా రూపుదాలిస్తే పెయింటింగ్‌ కళాకారులకు ప్రాణం పోసినట్లవుతుంది. కొన్ని సంవత్సరాలుగా పెయింటింగ్‌ దుకాణాలు మూతబడి ఉపాధి కోల్పోవడంతో చాలా మంది చిత్రకారులు, కళాకారులకు పనిలేకుండా పోయింది. గతంలో పెయింటర్లకు చేతినిండా పని ఉండడంతో తీరికలేకుం డా గడిపేవారు. ఎన్నికల్లో గోడరాతల కోసం, బ్యానర్లు (దుస్తులపై) రాయడం కోసం చాలా మంది పెయింటింగ్‌ దుకాణాల వద్ద పడిగాపులు కాసేవారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు సైతం నగరాలు , పట్టణాలలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను పెయింటర్లతో రాయించేవారు. దాంతో కళాకారులకు ఎలాంటి లోటులేకుండా జీవనం సాగేది. ఆధునిక టెక్నాలజీలో భాగంగా వచ్చిన ఫెక్సీ యంత్రాల ప్రింటింగ్‌తో పెయింటర్లకు పని లేకుండాపోయింది. దీని వల్ల వారి జీవనం చిన్నాభిన్నంమైంది. రాను రానూ ఫెక్సీిలు అతి తక్కువ ధరకు వస్తుండడంతో నాయకులు కనిపించిన ప్రతిచోట ఫెక్సీలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. చివరికీ గల్లీలో కూడా విద్యుత్‌ స్తంభాలకు ఫ్లెక్సీిలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పుట్టిన రోజున, పర్యటనలో భాగంగా స్వాగతం తెలపడానికీ భారీ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసేవారు. దీంతో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించేది కాదు.
విచ్ఛలవిడిగా వెలిసిన ఫెక్సీి ప్రింటింగులు...
తక్కువ ధరకే రంగు రంగుల బొమ్మలతో ప్రింటింగ్‌ , తక్కువ సమయంలో రావడంతో జనం వీటివైపే మొగ్గు చూపారు. దాంతో తక్కువ సమయంలోనే జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఫ్లెక్సీ ప్రింటింగ్‌ యంత్రాలు వెలిశాయి. జిల్లా కేంద్రంతో ఉట్నూర్‌, తదితర మండాల్లో ఫ్లెక్సీ తయారీ యూనిట్లు ఏర్పడ్డాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే సుమారు ఐదు దుకాణాలు ఉన్నాయి.
రసాయనాలతో హానికరం.
హానికరమైన రసాయనాలతో తయారవుతున్న ఫెక్సీిలు మానవాళికి పూర్తిగా హానికరమని నిపుణులు చెబుతున్నారు. గతంలో దుకాణాల బోర్డులే మాత్రమే ఏర్పాటు చేసుకునే సంస్కృతి రాను రాను విచ్ఛల విడిగా మారింది. ఫ్లెక్సీి 250 మైక్రాన్‌ల మందం ఉండడంతో ఇది భూమిలో కరిగిపోవడం కష్టం. దీంతో పాటు ఫ్లెక్సీ ప్రింటింగ్‌కు ఉపయోగించే రసాయన రంగుల వల్ల పర్యావరణ హాని కలుగుతుందని భావించిన ప్రభుత్వం ఫ్లెక్సీల నిషేధానికీ సిద్ధమవుతోంది. పర్యావరణానికీ పెను ముప్పుగా పరిణమించిన పాలిథిన్‌ కవర్ల పై ప్రభుత్వం ఈపాటికే ఆంక్షలు విధించింది. ఇదే విధంగా ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం పాలిథిన్‌ కవర్లను నిషేధించినా అవి ఇప్పటికీ ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. 40 మైక్రాన్‌ల కంటే ఎక్కువగా ఉన్న కవర్లను ఉపయోగించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్లెక్సీల నిషేధానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...