పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన పరీక్షలో నెగ్గి ప్రభుత్వ ఉ
ద్యోగానికి ఎంపికయ్యారు. ఇక తమకు ఏ ఢోకా లేదని భావించారు. కానీ
నియామకమైన నాటి నుండి అదే వేతనం. పని గ ంటలు లేవు. వేతనం
పెరుగ ుతుందన్న ఆశలు కనిపించడం లేవు. అధికపనిఒత్తిడితో
సతమతమవుతున్నారు. ఇంత చేసినా వారిని పట్టించుకున్న నాథుడే
కనిపించడం లేదు. ఇదీ వీఆర్‌ఏల దుస్థితి.
2012 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన ద్వారా
పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు వీఆర్‌ఏలు. తమకు ప్రభుత్వ ఉద్యోగ ం
లభించిందని 4100 మంది, జిల్లాలోని 417 మంది సంతోషపడ్డారు. పదో
తరగ తి విద్యార్హతతోపాటు రోస్టర్ మెరిట్ ప్రకారం వీఆర్‌ఏలుగా
నియమించబడినా తమకు ప్రభుత్వ ఉద్యోగ ం లభించిచినందుకు వారి
ఆనందానికి హద్దుల్లేవు. కానీ కాలం గ డిచిన కొద్దీ పనిభారం పెరగ డం, పనికి
తగిన వేతనం లేకపోవడం, పనివేళలు లేకుండా పోవడంతో వీరి ఆశలు
అడియాశలవుతూ వచ్చాయి. పోరాడినా పట్టించుకునే పరిస్థితి లేకుండా
పోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వీరు ఉన్నారు. ఉద్యోగ ం
వచ్చిందన్న సంతోషం కన్నా నామమాత్రపు గౌరవవేతనం(నెలకు రూ.6500)
తీసుకుంటూ కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉ
ద్యోగాన్ని వదులుకోలేక ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గ ురవుతున్నారు.
ఇందులో 50 శాతం మంది మహిళలు ఉండడం విశేషం. తహసీల్దార్
కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల్లో వీఆర్‌ఏలుగా ఉదయం నుంచి రాత్రి
వరకు వివిధ విభాగాల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నప్పటికీ శ్రమకు తగ ్గ
వేతనం లభించడం లేదు. కార్యాలయ సిబ్బంది కొరత కారణంగా వివిధ
విభాగాల్లో తమ పరిధిలో లేని పనులను సైతం వీరు సమర్థవంతంగా
నిర్వహిస్తున్నారు. కేవలం రూ.6వేల గౌరవ వేతనంతో మిగ తా ఉద్యోగ ుల
మాదిరి రాత్రింబవళ్లు విరామం లేకుండా పని చేస్తున్నారు. రాజ్యాంగ ంలోని
14, 16, 309, 320 అర్టికల్ ప్రకారం ఎపీపీఎస్సీ ద్వారా నియమింపబడ్డ
ఏ ఉద్యోగికైనా పేస్కేల్ ఇవ్వాలని భారత రాజ్యాంగ ం తెలియజేస్తోంది. కానీ
రాజ్యాంగానికి విరుద్ధంగా భారత దేశ చరిత్రలో ఏపీపీఎస్సీ ద్వారా
నియమితులైన వీరు మాత్రం పే స్కేల్ లేకుండా పనిచేస్తున్నారంటే పరిస్థితిన
అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగ ూ వీరు ఆదరణకు నోచలేదు.
కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అయినా బతుకులు
మారతాయనుకుంటే పరిస్థితిలో ఏమార్పూ లేదు. తమిళనాడు, మహారాష్ట్ర,
కేరళ ప్రభుత్వాలు వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేస్తున్నాయి. 10వ పీఆర్‌సీ
ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు చెల్లిస్తున్నాయి. కొన్ని ఇతర రాష్ట్ర
ప్రభుత్వాలు సైతం 10వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారం కనీస వేతనం
రూ.12500 చెల్లిస్తున్నాయి. దీనికి అదనంగా డీఏ రూ.500 సైతం
చెల్లిస్తున్నాయి. 10వ పీఆర్‌సీ నిబంధన ప్రకారం తమకు కూడా రూ.12 వేల
నుంచి రూ.15 వేల మధ్య వేతనాలు చెల్లిస్తూ రూ.500 డీఏ చెల్లించాలని
వీరు కోరుతున్నారున. కానీ వీరి మొర ఆలకించే వారే కరువయ్యారు. ఇక వీరి
కుటుంబాలకు ఆరోగ ్య భద్రత కోసం హెల్త్‌కార్డులు ఇస్తే ఉపయోగ ంగా ఉ
ంటుందని కోరుతున్నారు. 4 సంవత్సరాలుగా అధికారులను కలిసి
విన్నవించడంతోపాటు మూడు పర్యాయాలు సమ్మెలు సైతం చేసినా ఫలితం
లేకుండా పోతోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను
పరిరక్షించడంతోపాటు ప్రతి బాధ్యతను నిబద్ధతో చేస్తున్నందున మా
సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
వారు పరిష్కరించాలంటున్న డిమాండ్లివే..
1. కనీస వేతన స్కేలును అమలు చేయాలి.
2. కనీస వేతనం రూ.15 వేలు అందించాలి. డీఏను రూ.500లకు పెంచి
10వ పీఆర్‌సీని అమలు చేయాలి.
3. మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా,
జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలి.
4. ఉద్యోగోన్నతి కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలి.
5. 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి.
6. మహిళా వీఆర్‌ఏలకు వేతనంతో కూడిన మెటర్నిటి సెలవులు మంజూరు
చేయాలి.
7. హెల్త్ కార్డులను జారీ చేయాలి.
ధరలకనుగ ుణంగా వేతనం పెంచాలి:టి.అనిత, భీంసరి వీఆర్‌ఏ,
2014 సంవత్సరంలో వీఆర్‌ఏగా నియమించారు. రూ.6500 గౌరవ
వేతనం ఇస్తున్నారు. పెరిగిన ధరలకనుగ ుణంగా ప్రస్తుతం అందిస్తున్న
వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలి. టీఏ, డీఏ రూ.1500లకు పెంచాలి.
వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా ఉద్యోగోన్నతి కల్పించాలి.
20 ఏండ్లుగా పనిచేస్తున్నా ఇబ్బందులే:రాములు:వీఆర్‌ఏ, భీంసరి
భీంసరి గ్రామంలో 1996 సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. 20
సంవత్సరాల సర్వీసు పూర్తిచేశా. ఇప్పటి వరకు శ్రమకు తగిన ఫలితం లేదు.
రూ.6500 నుంచి రూ.15 వేలకు వేతనం పెంచాలి. మహిళలకు మెటర్నిటీ
లీవ్ సౌకర్యం కల్పించాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం, హెల్త్‌కార్డులు
అందించాలి.
వేతనాలు పెంచి ఆదుకోవాలి:అజీజ్‌ఖాన్, వీఆర్‌ఏ జిల్లా అధ్యక్షులు
2009 సంవత్సరం నుండి వీఆర్‌ఏగా పనిచేస్తున్నా. పని వేళలంటూ
లేవు. పనిభారం పెరిగింది. అయినా వేతనం మాత్రం పెరగ డం లేదు.
వెంటనే రూ.6500 వేతనాన్ని 15వేలకు పెంచి అందించాలి.
Comments
Post a Comment