Skip to main content

కూ(కి)ల్‌ డ్రింక్స్‌ - Cool Drinks Kills you




వేసవికాలం ఆరంభమైంది. కూల్‌గా ూండేందుకు చాలామంది కూల్‌డ్రింక్స్‌పై
ఆసక్తి చూపుతారు. కానీ వాటివల్ల కలిగే అనర్థాలను అంచనా వేయరు. వీటిని
తాగితే శరీరమనే రైలులో రోగాలకు బెర్తులను రిజర్వు చేసుకున్నట్టే లెక్క.
కూల్‌డ్రింక్స్‌పై ఇప్పటికే లెక్కకు మించిన పరిశోధనలు ఎన్నో జరిగాయి,
జరుగ ుతున్నాయి. వాటి ఫలితాలు జనాలను విస్తుపోయేలా చేస్తున్నాయి.
అయినప్పటికీ కొంతమందికి అవగాహన లేక అనారోగ్యాన్ని
కొనితెచ్చుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక కథనం..


నోరుతీపి చేసుకోవటం కోసం, కొద్ది క్షణాల ఆనందం కోసం కూల్‌డ్రింక్స్‌
తాగితే నోట్లో విషం పోసుకున్నట్టే. మనం బజారుకు వెళ్లి ఏదైనా పండ్లను
కొనితెచ్చి దాంతో రసాన్ని చేసి ఫ్రిజ్‌లో పెడితే రెండు, మూడు రోజులు
బాగ ుంటుంది. బయటే ఉంచితే ఒక రోజులోనే పాడవ్వచ్చు. కానీ మనకు
బయట దొరికే శీతలపానీయాలు మాత్రం దాదాపుగా సంవత్సరం దాకా
బాగ ుంటాయని దానిమీద తేదీ ప్రచురిస్తారు. మనవద్ద రోజుల్లోనే
పాడయిపోయేవి వారు చేస్తే మాత్రం సంవత్సరంపాటూ ఎలా తాజాగా ఉ
ంటాయి? ఇవి మనకు తెలియనిదేమీకాదు. ఎక్కువరోజులు బాగ ుండేలాగా
వాటిలో హానికర రసాయనాలు వాడతారు.
ూపశమనం కోసమే...
మండే ఎండలకు సాధారణంగా చల్లగా ఏదైనా తాగాలనుకోవడం
సహజం. పట్టణంలో రకరకాల కూల్‌డ్రింక్స్‌ను మార్కెట్‌లో లభిస్తున్నాయి.
కూల్‌'డ్రింక్స్‌' మంచి ఆరోగ్యాన్నిస్తాయని కూడా చాలా మంది భావిస్తారు.
విదేశీ పానీయాల వల్ల అరోగ ్యం దేవుడెరుగ ు.అనారోగ ్యం పాలవడం
ఖాయమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వినియోగ దారులు జాగ్ర త్తగా ఉ
ండకపోతే తమ ఆరోగ్యాన్ని తామే చెడగొట్టుకున్నటవుతుందని చెబుతున్నారు.
పెరిగే ఎండలకు ఇంట్లోనే పానీయాలు తయారు చేసుకోవడం ఉత్తమం.
పండ్లరసాలు, నిమ్మకాయ షర్బత్‌, మజ్జిగ , పుచ్ఛకాయ, కొబ్బరినీరు వంటి
వాటిని తీసుకుంటే ఆరోగ ్యం వందశాతం బాగ ుం టుందని
సలహానిస్తున్నారు.పైగా ఇలాంటి పానీయాలను పిల్లలు ఇష్టంగా తాగ ు తారని
అంటున్నారు.
కూల్‌డ్రింక్స్‌తో అనర్థ్ధాలు
కూల్‌డ్రింక్‌తో అలసట ఉన్నవారికి ఆస్తమా వ్యాధి, గ్యాస్‌, యాసిడిటీ,
కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్‌, శరీరంలో చక్కెర శాతం పెరిగి ఘగ ర్‌, ఉబకాయం,
వంటిరోగాల బారినపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో ఫుడ్‌
ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు తక్కువే. వినియోగ దారులు తమకు తామే మేలుకొని
జాగ్ర త్తగా ఉండాలని పలువురు సలహానిస్తున్నారు.సాధారణంగా ఏ వస్తువైనా
ఎక్కువకాలం నిల్వ ూంటే పాడై పోతాయి.కూల్‌డ్రింక్స్‌ల నిర్ణీత కాలపరిమాణం
ఉంటుంది. అది వినియోగ దారులకు తెలియదు. చల్లగా ఉంది కదా అని
తాగేస్తుంటారు. వాటివల్ల ఆరోగ్యానికి హానియే.
తాగితే అంతే సంగ తి..
మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే మృతదేహం
పూర్తిగా కాలి పోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి.కానీ నోటిలోని
పళ్లు మాత్రం కాలి పోవు. మృతదేహాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో
పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత
ఆ మట్టి భాగాన్ని తవ్వితీస్తే పళ్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటాయి.
ఇంతగ ట్టిగా మనపళ్లు తయారు చేయ బడ్డాయి. ఏపళ్లనైతే అగ్నికాల్చలేక
పోయిందో, ఏపళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేక పోయిందో అవేపళ్లను 20
రోజులపాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే పూర్తిగా
కరిగిపోతున్నాయి. ఆపళ్లు రంగ ుమారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి.
ఒక కూల్‌డ్రింకులో ఒక పన్నువేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా
కరిగి పోయి మాయమైపోతోంది. మనం పుట్టిన దగ ్గర నుంచి చనిపోయేలోపు
50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం.అన్ని టన్నుల
ఆహారాన్ని నమిలినా అరగ ని పళ్లు మాత్రం ఒక కూల్‌డ్రింక్‌తో
నెలతిరగ కుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా?
విషపదార్థాలే కాకపోతే ఎక్కువగా నీటిశాతం ఉండబట్టి మెల్లగా చంపే
విషంలా పనిచేస్తాయి. అలాంటి గ ట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన
లోపలి పేగ ులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి. అందుకే కూల్‌ డ్రింక్స్‌
తాగొద్దంటున్నారు నిపుణులు.
అందుకే తస్మాత్‌ జాగ్ర త్త..
ఎండాకాలంలో కూల్‌ డ్రింక్స్‌ను అసలు తాగొద్దు అంటున్నారు వైద్యులు. అవి
తాగితే కడుపులో చల్లగా ఉండి దిగిపోయే ఈ పానీయాలు లోపలకు వెళ్లగానే
తమ తడాఖా చూపిస్తాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ లెక్కల
ప్రకారం దాదాపుఅన్ని కూల్‌ డ్రింక్స్‌లలో ప్రమాదకర స్థాయిలో క్రిమిసంహరక
మందుల అవశేషాలున్నట్టు (ఐఎంఎ) వెల్లడించింది. ఎక్కువగా కూల్‌డ్రింక్స్‌
తాగ డం వల్ల వీటిలో ఉండే క్రిమిసంహరక మందుల అవశేషాలు కాలేయంపై
ప్రభావం చూపిస్తాయి. మనం తెలుసుకోవాల్సిందేమిదంటే దాహం కోసం
కూల్‌డ్రింక్స్‌ ను ఆశ్రయించే అలవాటున్నవారు వాటిస్థానంలో మజ్జిగ ,
చెరకురసం, కొబ్బరిబొండం లాంటి వాటిని తీసుకుంటే ఉత్తమం.

తెలుసుకోవాల్సిన నిజాలు..
కూల్‌ డ్రింక్‌లో 10 చెంచాలకు సరిపడా షుగ ర్‌ ఉ
ంటుంది.సాధారణంగా ఇంత మోతాదులో చక్కెర తింటే వాంతులు
అవుతాయి. కానీ కూల్‌డ్రింక్‌లో ఫాస్పారిక్‌ యాసిడ్‌ వాంతులు రాకుండా
చేస్తుంది. కూల్‌డ్రింక్‌ తాగిన 20 నిమిషాలకు అందులో ూన్న షుగ ర్‌ను మన
లివర్‌ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగ డం వల్ల రక్తంలోని షుగ ర్‌ లెవెల్స్‌
అమాంతంగా పెరిగిపోతాయి. దీనిద్వారా ఈ షుగ ర్‌ కొవ్వుగా మారి బరువు
పెరుగ ుతారు. కూల్‌ డ్రింక్‌లో ఉండే కెఫిన్‌ మెల్లమెల్లగా శరీరంలోకి
నిండుతుంది. దీంతో రక్తపోటు పెరిగి మీ కంటిపాపలు చిన్నగ అవుతాయి.
కెఫిన్‌ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు. అలా అని ఎక్కువ మోతాదులో
దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్‌డ్రింకులకు
ఎంతదూరం పెడితే అంత మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. కూల్‌డ్రింక్‌
తాగిన 45 నిమిషాలకు డోపమైన్‌ అనే ఓ కెమికల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది
చిన్న మోతాదులో డ్రగ్స్‌ తీసుకున్నట్టే.

బరువు పెరగ టం
ఇక చల్లదనం, దానిలోని తీపికి ఆకర్షించబడే పిల్లలు, కనీసం 40
నుంచి 100 మి.లీ. కూల్‌డ్రింక్‌ తాగేస్తారు. దీని కారణంగా సంవత్సరానికి
వీరు 3 నుంచి 5 కిలోల బరువు పెరుగ ుతున్నట్టు ఒక పరిశోధన తెలిపింది.
కూల్‌డ్రింక్స్‌ మనలో చాలా మంది బయటకు వెళ్లిరాగానే తాగే తీయని
పానీయం.ఈ మధ్యన కొందరు బిర్యానీ తోపాటు చల్లని కూల్‌డ్రింక్స్‌ కూడా
తాగ ుతున్నారు. కానీ వాటివల్ల ఆరోగ ్యం దెబ్బతింటుందని తెలియదు.

ఇవీ ఆరోగ ్యకరమైన వేసవి పానీయాలు
చాలామంది వేసవి సీజన్లో ఎక్కువ దప్పికతో శీతల పానీయాలు లేదంటే
కార్బొనేటేడ్‌ పానీయాల వంటి అనారోగ ్య పానీయాలను ఆశ్రయిస్తారు. ఈ
పానీయాలు కేలరీలను జోడించవచ్చు.కానీ అనారోగ్యానికి దారితీస్తాయి.
వేసవిలో దాహం తీర్చుకోవటం కోసం వివిధ ఆరోగ ్యకరమైన వేసవి
పానీయాలు సైతం ూన్నాయి. ఈ పానీయాలు శరీర ద్రవాలను నింపటమే
కాకుండా చెమటరూపంలో కోల్పోయిన శక్తిని సరఫరా చేస్తాయి.

1. పుల్లటి వాటర్‌
ఒకగ్లాస్‌ నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు, నారింజ ముక్కలను
ఉంచాలి. ఈ నీటికి పుల్లటి రుచి వస్తుంది. అలాగే విటమిన్‌ సి కూడా
సమద్దిగా ఉంటుంది. ఈ ఆరోగ ్యకరమైన పానీయంలో యాంటీ ఆక్సిడెంట్‌
లక్షణాలు ఉండుట వలన వేడి దద్దుర్ల నుంచి రక్షిస్తుంది.

2. నిమ్మకాయ, పుదీనా పానీయం
ఒక గ్లాస్‌ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మ ముక్కలు ఉంచి 15 నిమిషాలు
మరి గించాలి.అది చల్లారిన తర్వాత తేనే కలపాలి. ఇది వేసవి వేడి,
నిర్జలీకరణం నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఉత్తమ పానీయాలలో ఒకటి.

3.ఆరెంజ్‌ జ్యూస్‌
ఆరెంజ్‌ నుంచి జ్యూస్‌ తీసి దానికి చిటికెడు ూప్పు కలపాలి.ఈపానీయంలో
విటమిన్‌ సి, ఎలెక్ట్రోల్కెట్స్‌ సమద్ధిగా ఉంటాయి. అలాగే ఇది మిమ్మల్ని
నిర్జలీకరణ నుంచి రక్షిస్తుంది. ఇది ఉత్తమ ఆరోగ ్యకరమైన వేసవి
పానీయాలలో ఒకటిగా చెప్పవచ్చు.

4.వెన్నతీసిన పాలు
ఈ పానీయంలో ప్రోటీన్లు సమద్ధిగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ వేడి
వేసవి రోజుల్లో ఇది మీ దాహం, మీ ఆకలి సంతప్తిని కలిగిస్తుంది. వేసవిలో
వేడిని ఓడించటానికి చల్లని వెన్నతీసిన పాలను తీసుకోవాలి. ఇది నిర్జలీకరణ
కోసం ఒక సమర్థవంతమైన వేసవి పానీయా రెసిపీగా ఉంది.
5. పెరుగ ు పానీయం
ఒక కప్పు పెరుగ ులో కొన్ని నీళ్లు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు ూప్పు
వేయాలి. ఈ పానీయం తయారు చేయడానికి బాగా కలపాలి. దీనిలో మంచి
బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్‌), ఆక్సీకరణ, ఎలెక్ట్రోల్కెట్స్‌ సమద్ధిగా ఉ
ంటాయి.ఇది వివిధ రకాల వేసవి అంటువ్యాధుల నుంచి శరీరాన్ని
రక్షిస్తుంది.అలాగే నిర్జలీకరణం నుంచి కాపాడుతుంది.

6. పుచ్చకాయ పానీయం
పుచ్చకాయ జ్యూస్‌ చేయడానికి రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు ూప్పు
కలపాలి. ఇది వేసవిలో అవసరమైన అన్ని ఖనిజాలను శరీరానికి సరఫరా
చేస్తుంది. ఇది మీకు ఒక పరిపూర్ణ వేసవి పానీయంగా ఉంటుంది. ఇది
నిర్జలీకరణ కోసం ఒక ఉత్తమశక్తి పానీయంగా చాలాబాగా పనిచేస్తుంది.

7. రోజ్‌ పానీయం
నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, తాజా గ ులాబీ రేకులు వేసి కొంచెంసేపు
మరిగి ంచాలి. రాత్రిపూట అలా ఉంచి మరుసటి ఉదయం కొంచెం తేనే
కలపాలి. ఈ సీజన్‌ లో ఉత్తమ వేసవి పానీయా వంటకాలలో ఒకటి.

8. గ్రీన్‌ టీ
వేసవిలో మీ శరీరం నిర్జలీకరణకు గ ురైనప్పుడు టీ తాగితే దానిలో కెఫిన్‌ ఉ
ంటుంది. కానీ గ్రీన్‌ టీకి మినహాయింపు ఉంది. వేసవిలో గ్రీన్‌ టీలో
నిమ్మరసం కలపటం ద్వారా ఆనందించవచ్చు. మీరు దీనిని చల్లగా తాగాలని
అనుకుంటే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు.

9. ఐస్‌ తో బటర్‌ మిల్క్‌
ఇది మీ దాహం తీర్చటం కోసం వేసవిలో అనేక విధాలుగా మీశరీరానికి
ప్రయోజనం కలిగించే ఉత్తమ వేసవి పానీయాలలో ఇది ఒకటి. కొంత
పెరుగ ు తీసుకుని దానికి ూప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గ ుజ్జు, కొన్ని ఎండిన
పుదీనా ఆకులు కలపాలి. వేసవి సమయంలో చల్లగా కావాలని అనుకుంటే
కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవచ్చు.

10. దోసకాయ మరియు కస్తూరి పుచ్చకాయ పానీయం
ఒక జ్యుసర్‌లో దోసకాయ, కస్తూరి పుచ్చకాయ ముక్కలను వేసి జ్యూస్‌
తీయాలి. దీనికి అర స్పూన్‌ తేనే, చిటికెడు ూప్పు కలపాలి. అంతేకాక దానికి
కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కూడా కలపవచ్చు. ఈ పానీయం
మీ శరీరాన్ని స్వస్తత అధిక చెమట పట్టుటను నిరోధిస్తుంది.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...