కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సైతం కొత్త సేవల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటే బ్యాంకు సేవలు సులభం అవుతాయి. బ్యాంకు ఖాతాల సమాచారం తెలుసుకునేందుకు బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. గంటల తరబడి క్యూలో నిలవాల్సిన పనిలేదు. నేరుగా ఇంట్లోనే తమ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాయి పలు బ్యాంకులు. వీటిలో అత్యధిక ఖాతాదారుల ను కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కోసం క్విక్ యాప్‌ను అందుబాటులోకి తీసు కువచ్చింది. దాని ప్రయోజనా లేంటో తెలుసుకుందాం..
తమ ఖాతాదారులకు సుల భంగా అకౌంట్ వివరాలు తెలు సుకునేందుకు వీలుగా ఎస్‌బీఐ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లు కలిగిన ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవీ సేవలు...
యాప్ ఇన్‌స్టాల్ చేయగానే..
ముందుగా అకౌంట్ సర్వీసులు ఉంటాయి. మొదట మొబైల్‌్‌ఫోన్ సంఖ్యను రిజిస్టర్ చేయించుకోవాలి. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం వివరాలు, గతంలో జరిపిన లావాదేవీల వివరాలతో పాటుగా ఆరు నెలల లావాదేవీలు, విద్యా, గృహ నిర్మాణ రుణాల వివరాలు ఉంటాయి. దీనిలో అవసరమైన సమాచారం కోసం దానిపై క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో సూక్ష్మ సందేశం ద్వారా వస్తుంది.
రెండో అంశం గా ఏటీఎం కార్డుకు సంబం ధించిన నిర్వహణ వివరాలు ఉంటా యి. ఇందులో ఏటీఎం కార్డును రద్దు చేసే అవకాశం నేరుగా ఖాతాదారులకు ఉంది. కార్డును నిలుపుదల చేయటం, తిరిగి కొనసాగించే వీలు ఉంది.
ఏటీఎం పిన్ మార్పు కోసం బ్యాంకుకు వెళ్లకుండానే నేరుగా సెల్‌ఫోన్ ద్వారా మార్చుకోవచ్చు.
మూడో అంశంగా కారు, గృహ రుణాలకు సంబంధించి బ్యాంకులు అందిస్తున్న సేవల వివరాలు పొందవచ్చు.
నాలుగో అంశంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా పథకాల నమోదు, చెల్లింపులు చేసుకోవచ్చు.
ఐదో అంశంగా ఎస్‌బీఐ బడ్డీ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా మొబైల్‌ఫోను రీఛార్జ్, డిష్ టీవీ రీఛార్జ్, సినిమా టికెట్లు, బస్సు, రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బీమా పథకాల ప్రీమియం సొమ్ము చెల్లింపులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్ ద్వారా వివిధ రకాల కొనుగోళ్లు చేసుకునే సదుపాయం ఉంది.
వినియోగిస్తే ఎంతో ప్రయోజనం
ప్రస్తుతం జిల్లాలో ఇంచుమించుగా ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకు శాఖలు మాత్రం ప్రతీ చోటా అందుబాటులో లేవు. ప్రతీ పనికి సుదూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకులకు వెళ్లటం కష్టతరం. ముఖ్యంగా మన్యంలో ఇదే పరిస్థితి. అటువంటి తరుణంలో క్విక్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిపై అవగాహన వచ్చి వినియోగించటం మొదలు పెడితే బ్యాంకుకు వెళ్లవలసిన అవసరమే ఉండదు. ఇటువంటి సేవలపై బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వఛంధ సంస్థలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.

Comments
Post a Comment