వందలాది మంది విద్యార్థులు.. రోజూ స్నానం చేయడం.. దుస్తులు ఉతుక్కోవడం..
దీనికి వేలాది లీటర్ల నీరు అవసరముంటుంది. అంతే నీరు వృథాగా పోతుంటుంది.. ఈ
నీటిని ఎలాగైనా పునర్వినియోగంలోకి తేవాలనుకున్నారు ఆ గిరిజన ఆశ్రమ పాఠశాల
వార్డెన్, ఉపాధ్యాయులు. విద్యార్థుల సహకారంతో కాలువలు ఏర్పాటు చేసి ఖాళీ
ప్రదేశంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ఆ కూరగాయలతో విద్యార్థులకు భోజనం
పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాంసి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 260 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో రోజు ఉదయం, సాయంత్ర సమయాల్లో స్నానం, దుస్తులు ఉతుక్కోవడం, ఇతర వాటికి నీటి వాడకం జరుగుతుంది. అయితే ఆ నీటిని మళ్లీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, వార్డెన్ కూరగాయల సాగుకు ప్రణాళిక వేశారు. హాస్టల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించారు. ఆ స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి కూరగాయలు సాగు చేస్తున్నారు. దీనికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నారు. ఒక పెద్ద తోట తయారు చేశారు. టమాటా, గోబి, కొత్మీర, మెంతికూరతోపాటు వివిధ రకాల కూరగాయలను సాగు చేసుకుంటున్నారు. విద్యార్థులు కూడా విడతల వారీగా గట్లుకట్టి నీటి సరఫరా అయ్యేటట్టు కాల్వలు చేస్తున్నారు. వార్డెన్‌కు కూరగాయలు సాగులో అనుభవం ఉండడంతో అన్ని రకాల కూరగాయలను విడతల వారీగా సాగు చేస్తున్నారు. దీంతో హాస్టల్ ఆవరణ అంతా పచ్చగా మారి ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.
సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్నాం
హాస్టల్ ఆవరణలో కూరగాయలు సాగు చేసుకోవడానికి సేంద్రియ ఎరువులను వినియోగిస్తు న్నాం. బయట పండించే కూరగాయల్లో ఎక్కువ శాతం హానికర రసాయనాలతో పండిస్తున్నవే. వీటిని తింటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో కూరగాయల సాగు ఆలోచన చేశాం. విద్యార్థుల సహకారంతో తోట వేశాం. వాటినే విద్యార్థులకు ఆహారంగా ఇస్తున్నాం.
-మోహన్‌రెడ్డి, వార్డెన్
మేమే పండించుకుంటున్నం
మాకు కావాల్సిన కూరగాయలను మేమే పండించుకుంటున్నాం. తాజా కూరగాయలతో భోజనం చేస్తున్నాం. మార్కెట్లో వివిధ రకాల కూరగాయలు దొరుకుతున్నా వాటిపై క్రిమిసంహార మందులు వాడుతున్నారు. దీంతో ఆరోగ్యం పాడవుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో సహజ పద్ధతిలోనే మేం కూరగాయలు సాగు చేస్తూ, వాటినే వండుకొని తింటున్నాం.
-అరవింద్, ఎనిమిదో తరగతి
ఒక గంట తోటలో గడుపుతాం
ఓ వైపు చదువుకుంటూనే.. మరో వైపు కూరగాయలు సాగు చేస్తున్నాం. రోజుకు ఒక గంట తోటలో గడుపుతాం. అందరు కలిసి పని చేస్తాం. ఇది మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. హాస్టల్ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. వృథా నీటితో మేం కూరగాయలు పండించుకోవడం, వాటినే వండి తినడం ఆనందంగా ఉంది.
-ఇందు, పదో తరగతి

Comments
Post a Comment