- 'విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం'
- సర్ సి.వి.రామన్
జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభించారు. శాస్త్ర ప్రాధాన్యతను దాని ఉపయోగాన్ని ప్రజలకు తెలియజెప్పడం వీటిలో ప్రాథమికమైనది. వైజ్ఞానిక పురోభివృద్ధి వేగవంతమయ్యేందుకు ఇది అవసరం. వైజ్ఞానిక విషయాలను తేలికైన భాషలో విడమర్చి చెప్పే కమ్యూనికేటర్లను అభివృద్ధి చేసుకోవడం ఎన్ఎస్డీలో మరో ముఖ్య భాగం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహణ ద్వారా మన జాతి మెత్తం ఏడాదికి ఒకసారి తన పూర్తి దృష్టిని శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై కేంద్రీకరించడానికి వీలుకలుగుతుంది. ఈ సందర్భగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలను తెలుసుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి. శాస్త్రవేత్తలు సాధారణ ప్రజలతో ముఖాముఖీ కలవడం ద్వారా శాస్త్ర సాంకేతిక పురోగతిని జనబాహుళ్యపు అవసరాలకు మలచుకోవడానికి వీలు కలుగుతుంది.
విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి వారి అనుభవంలోకి తెచ్చే ప్రయత్నాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం (నేషనల్ సైన్స్ డే - ఎన్.ఎస్.డి) ఒకటి. ఫిబ్రవరి 28వ తేదీన ఏటేటా జరిగే ఈ ఉత్సవాన్ని 1987 ప్రారంభించారు. జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక ప్రచార మండలి ప్రతీ సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా చర్చలు, ప్రదర్శనలు, ఉపన్యాసాలతోపాటు క్విజ్ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులను, అధ్యాపకులను కూడగట్టి ప్రోత్సహించడం ద్వారా వైజ్ఞానిక దృక్పథాన్ని వ్యాప్తి చేయడంలో ఎన్ఎస్డీ ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉన్నది.
సైన్స్ పరికరాలు మూలకు..
జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పరికరాలు మూలనపడ్డాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, ఆ నిధులతో పరికరాలు కొనుగోలు చేయడం.. మామూలు అయింది. అయితే ఆ పరికరాలు ఉపయోగించి విద్యాబోధన చేస్తున్న సందర్భాలు అరుదుగానే ఉంటున్నాయి. 2009-10 విద్యాసంవత్సరం నుంచి 2017 వరకు లక్షల రూపాయల నిధులను ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించారు. 2009-10 విద్యాసంవత్సరంలో ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ. 4687 చొప్పున, 2010-11లో రూ. 17,125 చొప్పున, 2011-12లో రూ. 15 వేల చొప్పున, సైన్స్ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. 2008 నుంచి 2019 వరకు ఆర్వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇలా లక్షలాది రూపాయలు పాఠశాలలలో సైన్స్ పరికరాలు కొనుగోలు చేస్తున్నా.. వాటితో బోధించడం చాలా అరుదుగానే కనిపిస్తోంది.
రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు
నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూ నికేషన్ (ఎన్సీఎస్టీసీ) అభ్యర్థన మేరకు కేంద్రం ప్రతిఏటా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుం ది. మామూలు కుటుంబంలో జన్మించి స్వయం కృషి, జిజ్ఞాసతో అత్యున్నత స్థాయికి ఎదిగిన సర్ సీవీ రామన్ జీవితం ఎంతో మంది యువతకు మార్గదర్శకం. విద్యుదయస్కాంత తరంగా లు అనుసరించే నియమాలనే కాంతి తరంగాలు అనుసరి స్తాయన్న అద్భుతమైన విషయాన్ని 1928 ఫిబ్రవరి 28న కను గొనగా.. ఇది రామన్ ఎఫెక్ట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో ఆయన కీర్తి ఖండాంతరాలకు వ్యాప్తి చెందింది. కేవలం 42 ఏండ్ల వయస్సులోనే 1930లో ఆయన్ని నోబెల్ బహుమతి వరించింది. అత్యంత అరుదైన ఈ నోబెల్ బహుమతిని ఫిబ్రవ రి 28న అందుకున్న రోజునే భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా పరిగనించడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. లండన్‌లోని రాయల్ సొసైటీ హ్యూస్ పతాకాన్ని, బ్రిటీష్ ప్రభు త్వం నైట్‌హుడ్ పురస్కారం, గాస్కో, పారీస్ విశ్వవిద్యా లయాలు బంగారు పతాకాలను, గౌరవ బిరుదులను ఇచ్చి ఘనంగా సత్కరించాయి. ఇక భారత ప్రభుత్వం 1934లో భారత రత్న, రష్యా ప్రభుత్వం లెనిన్ అవార్డు వంటి ప్రఖ్యాత పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. మేధా సంపన్నుడు అయిన రామన్ 1970 నవంబర్ 21న పరమపదించారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగానే ఫిబ్రవరి 28న ప్రభుత్వం 'జాతీయ సైన్స్' దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది.
'ఇన్స్పైర్ మనక్' దరఖాస్తుకు
నేడు చివరి తేదీ
విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల స్థానంలో ఇన్స్పైర్ మనక్ (మిలియన్ మైండ్స్ అగ్మెంటింగ్ నేషనల్ అస్పిరేషన్ అండ్ నాలెడ్జ్) పేరుతో విద్యార్థులు చేసే ఆవిష్కరణలకు స్కాలర్షిప్స్ అందించాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలు పెంచేందుకు ఈ పథకాన్ని గతేడాది నుంచి అమలు చేస్తోంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా, విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, ప్రయోగాలు, ఆవిష్కరణలు చేయడానికి స్కాలర్షిప్స్ అందించనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి 2017 ఫిబ్రవరి 28వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు షషష.ఱఅరజూఱతీవaషaతీసర-సర్.స్త్రశీఙ.ఱఅ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్థులు చేసే ప్రాజెక్ట్‌కు సంబంధించిన లఘు విషదీకరణ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రిజిష్టర్ కాని పాఠశాలలు ఇందులో నమోదు చేసుకోవచ్చు. దేశంలోని 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను నూతన ఆవిష్కణలు చేసేలా ప్రోత్సహించడం. ప్రతి పాఠశాలల్లోనూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసి వారిలోని జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు అత్యధిక మందిని సైన్స్ రంగంపై ప్రేరేపించడం. దీని ముఖ్య ఉద్దేశం. దరఖాస్తులను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) సభ్యులు పరిశీలించి నూతన ఆవిష్కరణలను ఎంపిక చేస్తారు.ఎన్ఐఎఫ్ దేశంలోని లక్ష ప్రాజెక్టుల నుంచి ఎంపికైన వారికి రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. జిల్లా స్థాయిలో 10 శాతం ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి 10 శాతం ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఎన్ఐటీఎస్, ఐఐటీస్, ఐఐఎస్ఈఆర్ల సహకారంతో విద్యార్థులకు శిక్షణ, గైడెన్స్ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో నుంచి ఉత్తమంగా ఉన్న 60 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనలిప్పిస్తారు. ఎంపికైన ప్రాజెక్టులకు పేటెంట్ హక్కులు కల్పించనున్నారు.
జిల్లా నుంచి దరఖాస్తులు అంతంతే..
ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి సుమారు మూడు నెలల సమయం గడుస్తున్నా ఇంకా జిల్లా నుంచి అందిన దరఖాస్తులు అంతంతే. జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 127 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో 32 దరఖాస్తులను రాష్ట్రస్థాయికి పంపించినట్టు సైన్స్ ఇన్స్పైర్ ఆఫీసర్ రఘురమణ తెలిపారు. విద్యార్థులకు మేలు చేసే ఇలాంటి పథకాలపై సంబంధిత ఉపాధ్యాయులు దృష్టి సారిస్తే పేద విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారే అవకాశం కల్పించినట్లవుతుం దని విద్యావేత్తలంటున్నారు.
రామన్ ఫలితము - అనువర్తనాలు
* అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
*స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటిక జాలకం, స్పటికీకరణ జలవంటి విషయాలు తెలుసుకోవచ్చు.
* రేడియోధార్మికత, అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
* అన్ని రాళ్లను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
* కర్బన రసాయన పదార్థాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
* పలుచటి రాళ్లలో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.
* మిశ్రమ లోహాలు, ఆ లోహాల ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
*వాహకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
* మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, న్యూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
* డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం. దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
* పిత్తాశయంలోని కొన్ని రకాల రాళ్లు, జీవ భాగాల అయస్కాంతత్వం రామన్ పరిచ్ఛేదన పద్ధతిలో తెలుసుకోవచ్చు.
మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
* వివిధ రకాలైన మందులు, ఔషధాలు డీఎన్ఏపై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
* జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
* ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
*ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
* ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన భ్రమణశక్తి స్థాయిల గూర్చి తెలుసుకోవచ్చు.
* కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
* ఘన పదార్థాల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.

Comments
Post a Comment