నేడు కవలల దినోత్సవం
కడుపులో ఒకేసారి రూపుదిద్దుకుంటారు.. అచ్చం ఒకేలాగా ఉంటారు.. ఒక్కోసారి ఇద్దరినీ చూస్తే ఎవరు ఎవరో గుర్తుపట్టలేరు. అరె వీరిద్దరు సేమ్ టూ సేమ్ ఉన్నారే.. కవల పిల్లలు కనిపించిన చోట ఇలాంటి మాటలు మామూలే.. పుట్టిన బిడ్డను చూసీ తండ్రిలా ఉన్నారనో.. తల్లిలా ఉన్నారనో పోలికలు చూసి ముచ్చటపడతాం.. ప్రపంచంలో ఏడుగురు మనలాంటి రూపు రేఖలున్నవారు ఉన్నారని చర్చించుకుంటాం. ఏది ఏమైనా కవలలు ఓ అద్భుతం.. విచిత్రం.. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
నవతెలంగాణ - ఆదిలాబాద్ టౌన్
కవలలు.. కన్నవారికి సిరిసంపదలు.. మురిపాల ముద్దు బిడ్డలు. ఇద్దరూ ఒకేలా ఉంటారు. చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తారు. వారు ఇంట్లో ఉన్నా.. బడికెళ్లినా.. బజారుకెళ్లినా.. బంధువులతో తిరుగుతున్నా ప్రత్యేకతను చాటుకుంటారు. ఇక ఇద్దరూ ఒకే డ్రెస్ వేసుకుంటే ఒక్కోసారి అమ్మానాన్నలే గుర్తుపట్టలేరు. అచ్చం అలాగే ఉన్నవారిని ఒక్క క్షణమైనా ఆగి చూడాలనిపిస్తుంది. పేర్లు అడగాలనిపిస్తుంది. ట్విన్స్ అంటే అంతేమరి. భారతదేశంలో మొదటిసారిగా ట్విన్ ప్యారడైజ్ పేరుతో మ్యాజిక్ ఫన్ స్కూల్ ఆధ్వర్యంలో 2004 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో కవలల పండుగ నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది మంది కవలలు పాల్గొన్నారు.
కవలలు అంటే..
ఒకే తల్లి గర్భం నుంచి ఒకేసారి ఒక్కరికన్నా ఎక్కువమంది జన్మిస్తే వారిని కవలలు అంటారు. ఒకే కాన్పులో ముగ్గురు నుంచి ఏడుగురు వరకు జన్మించడం అసాధారణంగా జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో వీరు బతికే అవకాశాలు తక్కువ. ఇద్దరు పిల్లల శరీరాలు కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు లేదా సియామీ కవలలు అంటారు. సాధారణంగా యాభైవేల మంది లో ఒక్కరూ అవిభక్త కవలలుగా జన్మించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవిభక్త కవలను చాలా జాగ్రత్తగా సర్జరీ ద్వారా వేరుచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కవలలు ఒకే పోలికలతో ఉంటే వారిని మోనోజైగోటిక అని, వేర్వేరు పోలికలతో ఉంటే వారిని డైజైగోటిక గా వ్యవహరిస్తారు. వంశపారంపర్యంగా కూడా కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డ కడుపులో ఉండగానే డాక్టర్ల సలహా, సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన కవలలు నిండు నూరేళ్లు బతికే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.
ఈ పండుగ ఎలా వచ్చిందంటే..
కవలలు గురించి చెప్పే శాస్త్రాన్ని జమటాలజీ అంటారు. మోజెస్, ఆరన్ కార్స్ అనే కవల సోదరులు పోలండ్ దేశంలో నివాసముండే వారు. 1819లో వీరుంటున్న ఊరికి కొత్తగా ట్విన్స్ బర్డ్ అని పేరు పెట్టారు. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. వారిద్దరు సోదరులు ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ ఒకే రోజున మరణించారు. ఆ ఊరి ప్రజలు ఈ కవల సోదరులపై ఉన్న విశేష అభిమానంతో 1976 ఫిబ్రవరి 22 తేదీన మొదటిసారి కవలల దినోత్సవం జరుపుకున్నారు. పోలెండ్ దేశంలో ఇదీ ప్రతీ ఏడాది జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ట్విన్స్ డే నిర్వహిస్తున్నారు.
ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు..
పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన సోహెల్, నస్రీన్ కవలలు. ఒకే కాన్పులో కొడుకు, కూతురు పుట్టడంతో తల్లిదండ్రులు ఎందో సంతోషించారు. వీరిద్దరిని ఒకే పాఠశాలలో చదివిస్తున్నారు. స్థానిక ఎస్ఆర్ డిజిట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఎంతో ప్రేమానుబంధం ఉందని, ఒకరిని విడిచి మరొకరు ఉండరని తల్లిదండ్రులు చెబుతున్నారు.
-సోహెల్, నస్రీన్, టీచర్స్ కాలనీ
చలాకీ అన్నా చెల్లెళ్లు..
ఇద్దరు అన్నా చెల్లెళ్లు.. ఎంతో చలాకీగా ఉంటారు. వీరిద్దరిని చూసిన వారు ఆశ్చర్యపోతారు. కవలలుగా పుట్టిన వీరి పట్టణంలోని ఎస్ఆర్ డీజీ పాఠశాలలో నర్సరీ చదువుతున్నారు. పాఠశాలకు వచ్చిన వారెవరూ వీరిని చూడకుండా వెళ్లరు. టీచర్స్ కాలనీలో నివాసముంటున్న వీరు కాలనీకే ప్రత్యేకం.
- శ్రీహరిన్, శ్రీహరిణి
ఇద్దరు కోరికలు ఒకటే..
పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన స్నేహిత్. సంహిత్ కవలలు.. ఇద్దరు ఒకేలా ఉంటారు. వారి కోరికలు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు తెలిపారు. పట్టణంలోని ఎస్ఆర్ డీజీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నారు. దేశసేవ చేస్తామని ఎప్పుడూ చెబుతుంటారు. వీరి తండ్రి వెంకట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
-స్నేహిత్, సంహిత్
ఇద్దరు.. ఇద్దరే!
కవలలు పుట్టడం బాగానే ఉంటుంది. కానీ వారు పెరుగుతున్న కొద్దీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారు కవలలు కావడంతో ఏది తెచ్చినా ఇద్దరికీ తేవాలి. ఎక్కడికెళ్లినా ఇద్దరినీ తీసుకెళ్లాలి. లేకపోతే ఏడ్చి, చిన్నబుచ్చుకుని చివరకు కలహించైనా సాధించుకుంటారు. చదువులో బాగానే ఉన్నా ప్రతిసారీ కలహించుకుంటూ ఉంటారు. తర్వాత ఇద్దరూ కలిసి ఆడుకుంటారు.
- విష్ణుతేజ, సాయితేజ, యాపల్‌గూడ

- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment