వేసవి
వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా
పార్కింగ్ లేకపోవడంతో ఎండలోనే వాహనాలు నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి.
ఇంజన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర్‌పంక్చర్ కావడం వంటి
సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు
తీసుకోవడం తప్పనిసరి.
వేసవిలో వాహనాల ఇంజన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి కారణంగా ఇంజన్ ఆయిల్ ఆవిరయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్న ప్పుడు వచ్చే వేడి.. ఎండవేడి కలిసి ఇంజన్ ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంజన్ నుంచి పొగలు వస్తుంటాయి. దీంతోపాటు ఎయిర్‌లాక్ ఏర్పడి వాహనం స్టార్ట్ కాక మొరాయించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. సాధారణంగా 2 వేల కిలో మీటర్లకు ఒకసారి మార్చే ఇంజన్ ఆయిల్‌ను వేసవిలో వెయ్యి నుంచి 1,500 కిలో మీటర్లకు మార్చుకోవడం చాలా మంచిది. ఎండ తీవ్రతను తగ్గించడంలో సీట్ కవర్లు కీలకపాత్ర పోషిస్తాయి. కేవలం సీటుకే కాకుండా పెట్రోల్ ట్యాంక్‌కు సైతం కవర్లు వేయడం మరింత సురక్షితం. వేడిని తగ్గించే వెల్వెట్, పోస్ట్క్లాత్ వంటి సీట్ కవర్లు వేయిస్తే మరీ మంచిది.
వాకడం విషయంలో జాగ్రత్తలు
వేసవిలో ద్విచక్ర వాహనాలను అవసరం ఉంటే తప్ప అదేపనిగా వినియోగించకుండా ఉంటే మంచిది. దూర ప్రాంతాలకు వాహనాల్లో ప్రయాణం చేసే వారు ద్విచక్రవాహనాన్ని పక్కన పెట్టి బస్సులో ప్రయాణించడం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిన మార్గమధ్యలో కాస్త చల్లటి ప్రదేశాల్లో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఇంజన్ కండిషన్లో ఉంటుంది.
పార్కింగ్ ముఖ్యమే..
వాహనాలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా స్థలసేకరణ అవసరం. పార్కింగ్ స్థలాలులేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల వద్ద పార్కింగ్ చేస్తుండడంతోపాటు ఎటువంటి నీడలేని రహదారులపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో ఎండ అధికంగా ఉండే సమయంలో వాహనాల్లోని పెట్రోల్ ఆవిరైపోతుంది. రాత్రివేళల్లో ఒకసారి ట్యాంక్ మూ తను తీసి మళ్లీ పెట్టడం ద్వారా వేడికారణంగా ట్యాంక్‌లో ఏర్పడ్డ గ్యాస్ బయ టకు వెళ్లి ఇంజన్‌లోకి ఆయిల్ సులువుగా వెళ్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* వాహనాలను ఎండలో ఎక్కువసేపు ఉంచకూడదు. అలా ఉంచితే పెట్రోల్, డీజిల్ ఆవిరైపోతుంది. రంగు సైతం వెలిసిపోతుంది. సాధ్యమైనంత వరకు నీడలోనే ఉంచాలి.
* వాహనాలు పార్క్ చేసినప్పుడు తప్పనిసరిగా కవర్లు కప్పాలి. రాత్రి సమయాల్లో పెట్రోలు పోయిం చుకోవడం మేలు.
* టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అధిక వేడివల్ల గాలి తగ్గిపోతుంది. గాలి లేకున్నా.. అదే పనిగా వాహనాన్ని నడిపితే టైర్ల మన్నిక తగ్గుతుంది.
* ద్విచక్రవాహనాలపై సుదూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సివస్తే ప్రతి 50 కిలో మీటర్లకొకసారి బండిని 15 నిమిషాలు ఆఫ్ చేయాలి. దీనివల్ల ఇంజిన్ చల్లబడుతుంది.
* ఇంజిన్ ఆయిల్ త్వరగా శక్తిని కోల్పోతుంది. దీనివల్ల ఇంజిన్ మన్నిక తగ్గుతుంది. ఇంజిన్ ఆయిల్‌ను 15 రోజులకొకసారి తనిఖీ చేయించుకోవాలి.అధిక వేడి వల్ల రబ్బర్ విడిభాగాలు త్వరగా పాడవుతాయి.
* నాలుగు చక్రాల వాహనాల రేడియేటర్లోని నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ పాడయ్యే అవకాశం ఉంది. రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంటు ఆయిల్ వాడటం మంచిది. ఇంజిన్ ఆయిల్ తగ్గే ప్రమాదం ఉండటంతో అప్పుడప్పుడూ ఆయిల్ లెవెల్ తనిఖీ చేసుకోవాలి.
* ఎండాకాలం పూర్తయ్యేవరకు కొత్త టైర్లు వాడాలి. సెకండ్ హ్యాండ్, చైనా, బటన్ టైర్లజోలికి వెళ్లక పోవటం మంచిది.
* ఇప్పుడొస్తున్న వాహనాలన్నీ ఫ్యూజులు, కంప్యూటర్లతో అనుసంధానం చేయబడి ఉంటున్నాయి. కాబట్టి వాహనంలోని వైరింగ్ వ్యవస్థను ప్రతి 15 రోజులకోసారి క్షుణ్ణంగా పరిశీలించాలి.
* ఎల్పీజీ వాహనాలు ఉపయోగించేవారు వేసవిలో వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. అధిక ఉష్ణోగ్రత వల్ల గ్యాస్ అధిక పీడనానికి గురయ్యే ప్రమాదముంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగించుకోవడం చాలావరకు సురక్షితం.వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం

Comments
Post a Comment