Skip to main content

సెల్లులో సొల్లు వద్దు - Talking in cellphone

సెల్లులో సొల్లు వద్దు

సెల్‌ఫోన్‌లు మనిషిలో అంతర్భాగమయ్యాయి. సెల్‌ఫోన్‌ల వినియోగం ఊహించని రీతిలో పెరిగిన విషయం తెలిసిందే. నెట్‌ వాడకం పెరగడంతో సెల్‌ల ఆవశ్యకత మరింత పెరిగింది. ఇక వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియాల హల్‌చల్‌ అంతాఇంతా కాదు. ఇక కొందరైతే సెల్‌ఫోన్‌లు చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. ఇదంతా బాగానే ఉందిగానీ, ఈ సెల్‌ఫోన్ల వల్ల వచ్చే అనర్థాల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్‌ఫోన్ల మూలంగా పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. గేమ్స్‌ ఆడడం, పాటలు వినడం, సినిమాలు చూడడంలో పిల్లలు సెల్‌ఫోన్స్‌ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్‌ఫోన్స్‌ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లు రిసీవ్‌ చేసుకునే సిగల్స్‌ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్నపిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనాశక్తి క్రమేపీ మొద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైరలెస్‌, సెల్‌ఫోన్‌లు, విల్‌ఫోన్‌లు నుంచి విడుదలయ్యే రేడియో దార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాన్ని నాశనం చేస్తు న్నాయని చెబుతున్నారు. చిన్న పిల్లల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సెల్‌ఫోన్‌లు బాగా వాడే యువకుల రోజువారి ప్రవర్తనను పరిశీలించిన ఒక అధ్యయన బృందం వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తేల్చింది. సెల్‌ఫోన్‌ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు ఒత్తిడికి గురవ్వడంతోపాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్టుగా వెల్లడించింది. సెల్‌ఫోన్‌లతోపాటు మ్యూజిక్‌ సిస్టమ్స్‌ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ముభావంగా ఉండడం, ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, సరిగా చదవలేక పోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్టు అధ్యయన బృందం చెప్పింది. దేశంలో, రాష్ట్రంలో ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వివిధ సెల్‌ఫోన్‌ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల వలలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. క్రమేపీ దేశంలోనూ చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్‌ఫోన్‌ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సెల్‌ఫోన్‌లు మీ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పెద్దవారిలోనూ అనారోగ్య సమస్యలు..
హై బ్లడ్‌ ప్రెషర్‌, తలనొప్పులు, మెదడు వాపువ్యాధి, అల్జీమర్స్‌, క్యాన్సర్‌ అంతకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలగచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా సెల్‌ఫోన్‌ ఉపయోగం, కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు.
1. వీలైనంత వరకు సెల్‌ఫోన్‌ల వాడకం తగ్గించాలి. అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా ప్రయత్నించాలి.
2. సెల్‌ఫోన్‌ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.
3. మీ మొబైల్‌ ఫోన్‌ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి.
4.హెడ్‌ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డ్‌ హెడ్‌సెట్ల కన్నా వైర్‌లెస్‌ హెడ్‌సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పని చేసి చుట్టుపక్కలున్న ఎలక్ట్రోమెగెటిక్‌ ఫీల్డ్‌లను ఆకర్షిస్తుంది. హెడ్‌సెట్‌ లేకుండా మీరు సెల్‌ఫోన్‌ ఉపయోగించినప్పుడు, మీచెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్‌ వచ్చేవరకు వేచి చూడాలి.
5. మీరు సెల్‌ఫోన్‌ను హోల్‌సేల్‌ లేదంటే ఒకొక్కరిగా అమ్మేవారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్‌ఏఆర్‌ ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి. ఇన్‌స్ట్రక్షన్స్‌ ఏ మాన్యువల్‌లో ఇచ్చిన ఎస్‌ఏఆర్‌ నెంబరుని చూడండి. ఎంత తక్కువ ఎస్‌ఏఆర్‌ విలువ ఉంటే అంత మంచిది.
సెల్‌ ఫోన్‌ తో తంటా ?
సెల్‌ఫోన్‌ అవసరమే కానీ అతిగా ఉపయోగించడం అనర్థమే అంటున్నారు నిపుణులు. 20 నిముషాలపాటు విడవకుండా మాట్లాడితే చెవి లోపలి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేరకు పెరుగుతుంది. సెఫ్ఫ్న్‌ వాడకం పెరిగినకొద్దీ మెదడు మీద దాని ప్రభావం పడుతుంది. మెదడులో కణితలు ఏర్పడడానికి సెల్‌ఫోన్‌ వాడకమే.
* అధిక వినియోగంతో ఆరోగ్య సమస్యలు
* ఎంత తక్కువ వాడితే అంతమంచిదంటున్న నిపుణులు
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...
* ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి.
* సాధ్యమైనంతవరకు ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడాలి.
* హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు.
* అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలినవాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి.
* సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి.
* నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగల్స్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి.
* నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.
సెల్‌ ఫోన్‌ తో చెవులకు చిక్కు..
ఎక్కువసేపు సెల్‌ఫోన్‌లో మాట్లాడే వారికి మిగిలిన శబ్దాలు వినబడడం మానేస్తాయి. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగడం అందరికీ తెలిసిందే. దీనికి కారణం మెదడు రెండు పనులు మీద ఒకేసారి దృష్టి పెట్టలేకపోవడమే. రెండవ కారణం సెల్‌ఫోన్‌లో వచ్చే ధ్వనుల స్థాయి.. ధ్వని తప్పించి మిగిలిన స్థాయి ధ్వనులను వినడం, ఎక్కువగా చెవిలో గుసగుసలు చెప్పు కునే అలవాటు ఉన్న వారికి ఇటువంటి వినికిడి సమస్యే వస్తుంది.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...