- శిల్పాల తయారీలో రాణిస్తున్న కేశవ్
- వాటితోనే జీవనోపాధి
అతను రాతికి రూపమిస్తున్నాడు.. వివిధ విగ్రహాలు తయారు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. తన కళనే జీవనోపాధిగా మార్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శిల్పకారునిగా రాణిస్తున్న మావల మండలంలోని రాంనగర్ కాలనీకి చెందిన రాంపెల్లి కేశవ్పై కథనం..
మావల మండలంలోని రాంనగర్ కాలనీకి చెందిన రాంపెల్లి కేశవ్ శిల్పకారుడు. 30 సంవత్సరాల నుంచి రాళ్లను చెక్కుతూ శిల్పాలు తయారు చేసి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇచ్చోడ మండలంలో సిరిచెల్మ గ్రామంలో దొరికే ప్రత్యేక రాళ్లను తెప్పించుకొని, వాటితో వివిధ దేవతల విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఈయన తయారు చేసిన విగ్రహాలు ప్రత్యేకంగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఒక విగ్రహం ధర రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఒక విగ్రహం తయారు చేయాలంటే వారం నుంచి నెల రోజుల సమయం కూడా పడుతుంది. చిన్న శిల్పానికి వారం.. పెద్ద శిల్పానికి నెల రోజులు పడుతుందని శిల్పకారుడు కేశవ్ తెలిపాడు. నంది, మహాలక్ష్మి, శివ లింగం, రామలక్ష్మణులు, సీతా, హనుమాన్, గణేష్, శివపార్వతి విగ్రహాలను తయారు చేయడంలో కేశవ్ దిట్ట. శిల్పాల తయారీని నేర్చుకోవాలని అనుకుంటే ఎవరు వచ్చినా ఉచితంగా నేర్పిస్తానంటున్నాడు కేశవ్.
ప్రోత్సహించాలి
శిల్పకారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరముంది. తండ్రి నుంచి వారసత్వంగా కళ వచ్చింది. దాన్నే జీవనోపాధిగా ఎంచుకున్నాను. అయితే అప్పుడప్పుడు గిరాకీ వచ్చినా.. కొన్ని సార్లు నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. శిల్పకళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించి ఆర్థిక సాయమందిస్తే బాగుంటుంది.
- రాంపెల్లి కేశవ్, శిల్పకారుడు

Comments
Post a Comment