చూడడానికి
మట్టి కుండలే అయినా.. అవి చల్లని నీటిని అందిస్తాయి. వేసవి రాగానే
గుర్తుకొస్తాయి.. పేదల ఫ్రిజ్‌లుగా ప్రఖ్యాతి గాంచాయి.. ప్రత్యేకతను
సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వేసవిలో పేదవాడికి చల్లటి
నీటిని అందిస్తున్నాయి. అవే ఆదిలాబాద్ రంజన్లు. వేసవి ప్రారంభంలోనే గిరాకీ
పెరిగింది. జిల్లా కేంద్రంలో పలు చోట్ల రంజన్లు అమ్ముతుండగా, వ్యాపారులు
వీటిని వాహనాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తరలిస్తుస్తున్నారు.
ఆదిలాబాద్ రంజన్లపై ఈ నాటి సండే స్పెషల్..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తయారయ్యే రంజన్లు రాష్ట్రంలోనే పేరుగాంచాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు చేరుకుంటున్నాయి. రంజన్లలో పోసిన నీరు ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీటిలా ఉండడంతో పాటు తాగడానికి కమ్మగా ఉంటాయి. అదే వీటిలోని ప్రత్యేకత. అందుకే వీటిని వేసవిలో జనం ఎగబడి కొంటారు. ఆదిలాబాద్ నుంచి ప్రతి నిత్యం లారీలు, బస్సుల్లో రంజన్లు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక ఇక్కడ విడిగా విక్రయించేవి, లారీల్లో, బస్సుల్లో తరలించే వాటి సంగతి సరేసరి. ఆదిలాబాద్ నుంచి వెళ్లే ప్రతి బస్సులో, ఇటుగా వెళ్లే లారీలపైన వీటిని ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకుని వెళ్తుంటారు. ఇతర జిల్లాల్లో 'ఆదిలాబాద్ రంజన్లు' అని బ్యానర్లు కట్టి మరీ అమ్ముతుంటారు. కుండలో పోసిన నీరు చల్లబడడమనేది మట్టికుండ కుండే సహజ లక్షణమైనా, ఆ చల్లదనం దీర్ఘకాలం ఉండడమే రంజనుకున్న ప్రత్యేక లక్షణం. మామూలుగా కొత్త కుండల్లో నీరుపోస్తే ఒకటి, రెండు నెలలు మాత్రమే చల్లగా ఉండేలా పని చేస్తాయి. ఆ తరువాత అవి చల్లగా అంతగా పని చేయవు. అయితే ఈ రంజన్లు రెండు మూడేండ్ల వరకు నీటిని చల్లబర్చడంలో తమ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
తయారీ ఇలా..
మట్టి ముద్ద కుమ్మరన్న చేతిలో లయబద్దంగా ఆకారాన్ని తీసుకోవడానికి ఐదంచెలుగా పనులు నిర్వహిస్తారు. ముందుగా మట్టి సేకరణ దీనికి ముఖ్యం. రంజన్ల తయారీ కోసం నల్ల మట్టి, ఎర్ర మట్టి అవసరమవుతాయి. ఈ రెండింటిని ఎండబెట్టి సన్నగా చేస్తారు. దీనిలో చిన్న రాళ్లు కాని, చెత్త కాని ఉంటే తీసివేస్తారు. ఆ తర్వాత 'గుర్రపు లద్దిని' మట్టికి కలుపుతారు. రంజన్లు తయారు చేసే వారి కుంటుంబంలోని సభ్యులంతా తయారీలో నిమగమవుతారు. ముఖ్యంగా ఆడవారి చేతిలోనే ఈ రంజన్లు తయారవుతాయి. మట్టిని పిసికి అన్ని సమపాళ్లలో నాలుగు గుల్లల మట్టికి మూడు గుల్లల లద్ది, సగం గుల్ల బూడిద కలిపి మిశ్రమం చేస్తారు. ఈ మిశ్రమానికి నీరు కలిపి పిసికి పిసికి ఒక రోజు నిలవ ఉంచిన తర్వాత తయారీకి ఎంతో ఓర్పుతో మట్టికి ఆకారాన్ని అందిస్తారు. తయారైన రంజన్లకు మట్టి ఇతర ముడి సరుకులు మగవారు తెస్తారు. కానీ ఇక్కడ ఆడవారి శ్రమనే అధికం. కుటుంబ పోషణకు మట్టిని నమ్ముకున్న చేతులు మట్టిని సల్పతో టప టప కొడ్తూ రంజన్ ఆకతిని తేవడానికి ఎంతో శ్రమిస్తారు. సుమారు 130 రంజన్లను ఒక దగ్గర పేర్చి పగిలిన రంజన్లను కప్పి 'బట్టి' పెడతారు. మామూలు కుండలు మాదిరిగా కాకుండా వీటిని ఐదు అంచెలుగా తయారు చేస్తారు. పచ్చి కుండలకు జాజు అనే ఎరుపు రంగును, అంచుల డిజైన్లకు బింకం అనే బంగారపు రంగు రాతి పొడిని పూచి అగ్నిలో కాల్చుతారు. అపుడు రంజన్లు తయారవుతాయి.
తయారీదారులకు కష్టాలనేకం..
జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడతోపాటు నిర్మల్‌లోని కొన్ని ప్రాంతాలు రంజన్ల తయారీ ద్వారానే తమ జీవితాలను వెళ్లదీస్తున్నాయి. కుమ్మరివాడలోని వందలాది కుటుంబాలకు రంజన్ల తయారీతో జీవనాధారం. సుమారు ఐదు దశాబ్దాల నుంచి వీరు ఈ పనిని చేస్తూ వస్తున్నారు. నాలుగు నెలలకు మాత్రమే ఉపాధినిస్తున్న రంజన్ల తయారీకి ఇక్కడి కుటుంబాలు ఐదు ఆరు నెలలుగా కష్టపడతారు. మిగితా నెలల్లో కూలీ, ఇతర పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు. కుటుంబమంతా రంజన్ల తయారీలో ఉన్నా సరైన లాభాలు లేవని పేర్కొంటున్నారు.
బట్టీ పెట్టడానికి
బట్టీ పెట్టడానికి చిన్న చిన్న ఎండు పుల్లలు అవసరమవు తాయి. కానీ కట్టెలు దొరికే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎండిన బెరడు, కట్టెలు ఏరుకుందామనుకుంటే కూడా దొరకని పరిస్థితి ఉందని కుమ్మరులు చెబుతున్నారు. కట్టెలు కొనుక్కునే పరిస్థితి లేదని, అడవి నుంచి తెచ్చుకుందామనుకున్నా అటవీ అధికారులు పరేషాన్ చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో కొనుక్కోక తప్పని పరిస్థితి ఉందంటున్నారు.
చల్లదనం ఇలా..
రంజన్లు తయారు చేయడానికి వినియోగించే గుర్రపు లద్దీ రంజన్లలోని నీటిని చల్లగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రంజన్లు తయారు చేసి వాటిని కాల్చేటపుడు గుర్రపు లద్దిలోని గడ్డి సంబంధమైన చిన్న చిన్న సూక్ష్మ పదార్ధాలు కాలిపోతాయి. కావున సూక్ష్మారంధ్రాలు ఏర్పడుతాయి. ఈ రంధ్రాల నుంచి నీరు బయటకు వచ్చి రంజన్‌ను ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది. అందువలన నీరు చల్లదనానికి గురి అవుతుంది. ఇది ఆదిలాబాద్ రంజన్ల ప్రత్యేకత.
గుర్రపు లద్ది కోసం..
గుర్రపు లద్ది మహారాష్ట్ర ప్రాంతంలో దొరుకుతుంది. దీపావళి తర్వాత ఈ లద్దిని సేకరిస్తారు. మహారాష్ట్రలోని అడవుల్లోంచి లద్దిని ఏరుకొని తెచ్చుకుంటారు. కాని కొన్ని సందర్భాల్లో లద్దిని కొనుక్కోక తప్పడం లేదు. ధర ఎక్కువగా ఉండడం, యవత్మాల్, చంద్రాపూర్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి తీసుకురావడం విపరీతమైన ఖర్చులకు దారి తీస్తోందని ఇక్కడి కుమ్మరులు వాపోతున్నారు.

నాలుగు నెలలే పని
వేసవిలోనే మాకు పని. పగలు, రాత్రి పని చేసినా మాకు మిగిలేది అంతంతే. వేసవికి రెండు నెలల ముందే పనిని మొదలుపెడ్తారు. అప్పుడే మాకు కూలి దొరికేది. రోజుకు రూ. 200 ఇస్తరు. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రభుత్వం ఆదుకొని రుణాలైనా ఇప్పించాలి. మా కష్టాలు తీర్చాలి.
- రాదారపు రాములు, కుమ్మరివాడ
ప్రభుత్వం ఆదుకోవాలి
పొద్దంతా కష్టం చేసినా మాకు మిగిలేది అంతంతే. పక్షం రోజులు కష్టపడి రంజన్లు తయారు చేసి అమ్మితే పడ్తల్ వడ్తలేదు. రోజు కూలి వంద రూపాయలు కూడా పడ్తలేదు. కేవల్ నాలుగు నెలలు మాత్రమే పని ఉంటది. ప్రభుత్వం ఆదుకోవాలి. కుమ్మరులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తే బాగుంటుంది. ప్రభుత్వం కుమ్మరుల గురించి ఆలోచించాలి.
- ఏగుడి లక్ష్మి, కుమ్మరివాడ
సరుకు దొరకడం కష్టంగా ఉంది
రంజన్లు తయారు చేయడానికి అవసరమయ్యే సరుకు దొరకడం కష్టంగా ఉంది. ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుర్రపు లద్ది అయితే యవత్మాల్ నుంచి తీసుకొస్తం. అన్ని ధరలు పెరిగినా మా రంజన్ల ధరలు మాత్రం అంతగా పెరగడం లేదు. ఆదిలాబాద్ రంజన్లకు పేరు ఉన్నంత ధర లేదు. ఇతర జిల్లాలకు తీసుకుపోయి అధిక ధరకు అమ్ముకుంటున్న వారు మాకు చెల్లించేది అంతంతే.
- జె. భూమన్న, కుమ్మరివాడ
Comments
Post a Comment