Skip to main content

మహిళా దినోత్సవం - International Womens Day

తాను కాలుతూ, కరుగ ుతూ ప్రపంచానికి వెలుగ ునిచ్చే సమిధ మహిళ. కానీ,
పురుషాధిక్య సమాజంలో నేటిమహిళ అబలగానే మిగిలిపోతోంది. 'ఆడది
అబలకాదు సబల' అనే శాస్త్రీయ నినాదం ఇటు పాలకులకు గానీ, అటు పడగ
విప్పిన పురుషాధిక్య సమాజానికి వినిపించడం లేదు. ఆకాశంలో ఆమె సగ ం,
ఆదిశక్తి స్వరూపం అంటూ మహిళల గ ురించి వారి సంక్షేమం గ ురించి
ప్రకటించడం తప్ప నిర్దిష్ట పథకాలేవీ తీసుకోకపోవడమే 60
సంవత్సరాలకుపైగా పాలించిన పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. నేటికీ
మహిళ అన్నివిధాలా అణచివేతకు గ ురవుతూనే ఉంది. కుటుంబ హింస,
రాజ్యహింస, మతపరమైన హింస రకరకాల హింసకు బలవుతూనే ఉంది.
ఎక్కడ చూసినా తమకు రక్షణ కరువైందని విద్యార్థులు, ఉద్యోగ మహిళలు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వివక్ష
చూపడం అన్యాయమని మహిళా కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా చట్టాలు.. వారి అభిప్రాయాలు..
విజయాలు సాధించిన మహిళల గ ురించి..

నవతెలంగాణ - ఆదిలాబాద్‌ టౌన్‌
మహిళలు కోరుకుంటున్న సమానత్వం, సాధికారిత, సంక్షేమ అంశాలను ఉ
ద్యమాలతో మాత్రమే సాధించుకోగ లరు. అసలు మహిళా దినోత్సవమే ఉ
ద్యమాల నేపథ్యం నుంచి వచ్చింది. సమాజంలో తాము దోపిడీకి గ ురవుతున్న
వైనాన్ని మహిళలు గ ుర్తించారు. సమాన వేతనాలు, మహిళలకు ఓటుహక్కు,
నిర్ణయాధికారం, పని గ ంటల గ ుర్తింపు కోసం నినదిస్తూ న్యూయార్క్‌
నగ రంలో 1908వ సంవత్సరంలో చేసిన ప్రదర్శనతో మహిళా హక్కుల ఉ
ద్యమం మొదలైంది. మరుసటి సంవత్సరమే అమెరికా సోషలిస్ట్‌ పార్టీ ఫిబ్రవరి
28న జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అమెరికా నుంచి ఐరోపా
దేశాలకు మహిళా ఉద్యమం వ్యాప్తిచెందింది. మహిళల హక్కుల గ ురించి
సోషలిస్టు భావాలు కలిగిన సంస్థలు, దేశాలు ఎక్కువగా ఆలోచించాయి.
పెట్టుబడిదారి దేశాల్లో కూడా సోషలిస్టు పార్టీలే మహిళా హక్కుల కోసం
పోరాటం చేశాయి. ఐరోపా ఖండ దేశమైన ఫిన్లాండ్‌ చట్టసభకు తొలిసారిగా
ముగ ు్గరు మహిళలు ఎంపిక కావడంతో ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.
ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరగాలని, ఆయా
దేశాల్లోని మహిళల గొంతును విప్పేందుకు వేదిక కల్పించాలని
కోపెన్‌హగ న్‌లో జరిగిన రెండో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌
తీర్మానించింది. దీని ఫలితంగా ఐరోపా ఖండ దేశాల్లో మహిళా దినోత్సవం
మొదలైంది. ఒక్కొక్క దేశంలో ఒక రోజున జరుగ ుతున్న మహిళా
దినోత్సవాలన్నింటినీ కాదని మార్చి 8న స్థిరపచాలనే నిర్ణయం 1913లో
తీసుకున్నారు. నాటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐరోపా
ఖండాల్లో ఘనంగా జరిపారు. రష్యన్‌ మహిళలు సైతం నాటి రష్యన్‌
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టిన తేదీ రష్యా క్యాలెండర్‌
ఫిబ్రవరి 23 అయినా అది అంతర్జాతీయ క్యాలెండర్‌లో మార్చి 8. కాబట్టి ఆ
తేదీకి గ ుర్తుగా మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవ తేదీగా అంగీకరించారు.
నాటి రష్యా మహిళల ఉద్యమ ఫలితంగా వారికి ఓటింగ్‌ హక్కును అమలు
చేసింది. ఆ విధంగా చూసినప్పుడు మహిళా దినోత్సవానికి వంద యేళ్ల చరిత్ర
ఉంది. ప్రతియేటా జరుగ ుతూ వచ్చిన మహిళా ఉద్యమానికి కొత్తఊపు
1975లో ఐక్యరాజ్యసమితి ఇచ్చింది. నాటివరకు మహిళల సామాజిక,
రాజకీయ, ఆర్థిక, సాధికారత అంశాలమీద వార్షిక సదస్సులు నిర్వహించే
ఐక్యరాజ్యసమితి, తదుపరి దశాబ్ధాన్ని మహిళలకు అంకితం చేసింది.
జీవితంలో అన్నిదశల్లో ప్రపంచంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం
కల్పించడమే దశాబ్ది లక్ష్యంగా పేర్కొంది. 1980 నుంచి ప్రపంచంలో
మార్పులు వేగాన్ని అందుకున్నాయి. మార్చి నెల మొత్తాన్ని మహిళా చరిత్ర
మాసంగా ప్రకటించి మహిళా అంశాలపట్ల తమ బాధ్యతను పెంచింది.
ఒకప్పుడు వర్కింగ్‌ ఉమెన్‌డేగా ప్రారంభమైన ఈ దినోత్సవం నేడు సర్వ
మహిళా దినోత్సవంగా మారింది.

మహిళల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. ఆ చట్టాలను
పకడ్బందీగా అమలు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తే దాడులు కొంతైనా
తగ ు్గతాయి. కానీ ప్రభుత్వాలు వాటిని ప్రచారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం
వహిస్తున్నాయి. దీంతో ఆ చట్టాలు ఎందుకు కానరాకుండా మరుగ ునపడి
పోతున్నాయి. ఇప్పటికీ గ్రామీణా ప్రాంతాల్లో ఉన్న మహిళలకు, విద్యార్థినీలకూ
వారికి రక్షణకు సంబంధించిన చట్టాలు వారికే తెలియవంటే అతిశయోక్తి
కాదు. మహిళలు వారికున్న చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి. వారికేదైనా
అన్యాయం జరిగితేపై చట్టం ప్రకారం నిందితులను శిక్షించాలని పోలీసులను,
అధికారులనూ నిలదీయొచ్చు. మహిళా చట్టాలు మీకోసం..
ఇండియన్‌ పినల్‌ కోడ్‌ (ఐపిసి) ప్రకారం
శ్రీ 148 ఏ - అదనపు కట్నం కోసం వేధిస్తే - మూడు సంవత్సరాలు జైలు
శిక్ష-జరిమానా.
శ్రీ 497- ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఐదు
సంవత్సరాలు జైలు శిక్ష-జరిమానా.
శ్రీ 312 - గ ర్భిణి అనుమతి లేకుండా భర్త, అత్తమామలు అబార్షన్‌ చేయిస్తే
ఏడు సంవత్సరాలు జైలుశిక్ష-జరిమానా.
శ్రీ 313 - భార్య ప్రమేయం లేకుండా ఒత్తిడితో అబార్షన్‌ చేయిస్తే పది
సంవత్సరాలు శిక్ష-జరిమానా
శ్రీ 363- బాలికను కిడ్నాప్‌ చేస్తే - ఏడు సంవత్సరాల శిక్ష-జరిమానా.
శ్రీ 366ఏ-18 సంవత్సరాలలోపు అమ్మాయిని బెదిరించి పనులు
చేయించుకుంటే, వ్యభిచారానికి బలవంతంగా దింపితే 10 సంవత్సరాల శిక్ష,
జరిమానా.
శ్రీ 366 బీ - 21 సంవత్సరాల్లోపు అమ్మాయిలను ఇతర దేశాలకు వ్యభిచారం
కోసం పంపిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా.
శ్రీ 372 - ఆడపిల్లలను అమ్మితే పది సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా.
శ్రీ 373- బాలికలను కొనుగోలు చేసి వ్యభిచారం చేయిస్తే పది సంవత్సరాల
జైలు శిక్ష, జరి మానా
10.376 - రేప్‌ కేసులో ఏడు సంవత్సరాల శిక్షతోపాటుజరిమానా, ఒక్కో
సారి జీవితకాలం శిక్ష కూడా పడవచ్చు.
శ్రీ 326ఏ- యాసిడ్‌ దాడులలో మహిళలను గాయపర్చితే పది సంవత్సరాల
శిక్షతో పాటు-జరిమానా ఒక్కో సారి జీవిత కాలం శిక్ష కూడా విధిం చవచ్చు.
శ్రీ 326బీ- యాసిడ్‌ పోయడానికి ప్రయత్నం చేస్తే ఐదు సం వత్సరాల
నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష, జరిమానా.
శ్రీ 354-మహిళల పట్ల అస భ్యంగా ప్రవర్తిస్తే ఒక్క సంవత్సరం నుంచి ఐదు
సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరి మానా.
శ్రీ 354ఏ- బెదిరించి మహిళలను లైంగికంగా ఒత్తిడి చేస్తే మూడు
సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
శ్రీ 354 బీ -బలవంతంగా మహిళల హక్కులను హరిస్తే మూడు నుంచి
ఏడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
శ్రీ 354 సీ- ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించడం, ఫొటోలు తీయడం
చేస్తే ఒకటి నుంచి మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
శ్రీ 2013 చట్టం ప్రకారం పని ప్రదేశాలలో మహిళలను లైంగిక వేధింపులకు
గ ురిచేస్తే కేసు తీవ్రతను బట్టి శిక్ష.
శ్రీ 2005- 43వ చట్టం ప్రకారం గ హ హింస నిరోధక చట్టం ప్రకా రం
తీవ్రతను బట్టి శిక్ష.
శ్రీ 2012 చట్టం ప్రకారం ఆడ పిల్లలను బలవంతంగా వ్యభిచారానికి దింపితే
ఏడు సంవత్సరాల నుంచి జీవిత కాలం శిక్ష.
శ్రీ 494 ప్రకారం రెండో పెళ్లి చేసుకుంటే ఏడు సంవత్సరాల శిక్షతో పాటు
జరిమానా.
శ్రీ 125 సీఆర్‌పీసీ ప్రకారం మనోవర్తి.
శ్రీ 2005 చట్టం ప్రకారం మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు.

మహిళలకు భద్రత కరువైంది. ప్రతిరోజూ ఎక్కడోచోట దాడులు,
అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. మహిళల భద్రత కోసం చట్టాలెన్ని ఉ
న్నా అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా మహిళలు ఎన్నో
అవమానాలకు గ ురవుతున్నారు. ప్రభుత్వాలు మారినా రక్షణ
కల్పించలేకపోతున్నాయి. ప్రతి ఏడాది జరుపుకునే అంతర్జాతీయ మహిళా
దినోత్సవం సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు,
ూన్నతాధికా రులు మహిళల భద్రత గ ురించి, వారికోసం కల్పించబడిన
చట్టాల అమలు తీరు గ ురించి మాట్లాడతారు. తర్వాత అమలు విషయంలో
పట్టించుకునే పరిస్థితి ూండదు. పైగా దేశంలో, రాష్ట్రంలో ప్రపంచీకరణ
విధానాలు అమలు పెరగ డంతో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు,
అత్యాచారాలు పెరుగ ుతున్నాయి. మరోపక్క మహిళల పట్ల సమాజంలో
చిన్నచూపు ూండడంతో ఇంటా బయటా వివక్షకు గ ురవుతూనే ూన్నారు.
సమాజంలో మహిళలపై చిన్నచూపు ఉండడంతో భద్రత లేకుండాపోతోంది.
దేశ, విదేశాల్లో మహిళలు వివిధ రంగాల్లో ప్రముఖ స్థానాల్లో ూన్నప్పటికీ వారి
పట్ల వివక్ష పోవడం లేదు. దేశంలో జాతీయ పార్టీలకు అధినేతలుగా, దేశానికి
అధ్యక్షులుగా పని చేస్తున్నప్పటికీ మహిళలకు రక్షణ లేదు. గ్రామీణ ప్రాంతాలు
మొదలుకొని పట్టణ ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో పని
చేస్తున్న మహిళలపైదాడులు జరుగ ుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో
భూస్వామ్యభావాజాలం వల్ల పెత్తందారులు కూలీలుగా, వ్యవసాయ
కార్మికులుగా పని చేస్తే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
ూద్యోగాలు చేస్తున్న చోట్ల చదువుకున్న మహిళల పట్ల తోటి ూద్యోగ ులు,
పైస్థాయి అధికారులు లైంగిక దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు,
బాలికలపై మరీ ఎక్కువగా లైంగిక దాడులు జరుగ ుతున్నాయి.
పెరుగ ుతున్న దాడులు
జిల్లాలోనూ మహిళలకు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో అత్యంత
వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో మహిళలు ఎక్కువగా
నిరాక్షరాస్యులు. వీరిలో చైతన్యం తక్కువగా ూండడం కూడా దాడులకు
పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు కుటుంబంలో వరకట్న వేధింపులు,
కుటుంబ సభ్యుల నుంచి లైంగిక వేధింపులు, పట్టణాల్లో అత్యాచారాలు,
హత్యలు పెరుగ ుతున్నాయి. .
అమలుకు నోచని చట్టాలు
మహిళలపై జరుగ ుతున్న దాడులను అరికట్టి భద్రత కల్పించడానికి పాలకులు
ఎన్నో చట్టాలు చేశారు. కాఙతీ అమలుకు నోచుకోపోవడంతో
నీరుగారిపోతున్నాయి. దీంతో మహిళలపై దాడులు కొనసాగ ుతూనే ఉన్నాయి.
గ తంలో కుటుంబంలో మహిళలను వివక్షకు గ ురి చేయడం, వరకట్న
వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి సంఘటనలు
గ ృహహింస చట్టం కిందికి వచ్చాయి. అయినప్పటికీ నేటికీ దేశంలో, రాష్ట్రంలో
వరకట్నాలు కొనసాగ ుతున్నాయి. ఆ పేరుతో మహిళలపై వరకట్న వేధింపులు
పెరుగ ుతున్నాయి. అదేవిధంగా మూడేండ్ల క్రితం రాజధానిలో మహిళలు,
యువతులు, విద్యార్థినులపై జరుగ ుతున్న దాడులపై దేశవ్యాప్తంగా
పెద్దఎత్తున ఆందోళన రూపం దాల్చడంతో అప్పటి ప్రభుత్వం నిర్భయ చట్టం
తెచ్చింది. దీంట్లోకి మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలను
చేర్చారు. అయితే ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా విద్యార్థినులు, బాలికలు,
మహిళలపై దాడులు పెరుగ ుతున్నాయి. దీనికి చట్టం అమలులో
లోపాలతోపాటు, పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల అమలుకు నోచుకోవడం
లేదనే విమర్శలున్నాయి.

అన్ని చోట్ల వివక్షే..
శ్రీ మహిళా కార్మికులు పోషకాహార లోపానికి, అధికశ్రమకు గ ురవుతున్నారు.
శ్రీ పట్టణాల్లో పనిచేసే మహిళలు తరచూ భద్రతా
సమస్యలనెదుర్కొంటున్నారు.
శ్రీ శ్రామిక మహిళలు మార్కెట్‌యేతర కార్యకలాపాల్లోనే ఎక్కువ ఉంటున్నారు.
అది వారి అభివృద్ధిని పరిమితం చేసేస్తోంది.
శ్రీ భూమి, పశుసంపద, మగ్గాలు, ఫ్యాక్టరీలు యంత్రసామాగ్రి వంటి ఆర్థిక
వనరులపై భారత మహిళలు పరిమితమైన యాజమాన్య (ఓవర్‌షిప్‌)
హక్కులు, నియంత్రణ కలిగి వుంటున్నారు.
శ్రీ పొరపాటు అవగాహనల కారణంగా, పురుషుల కంటే స్త్రీలు తక్కువ
సామర్థ్యం, తక్కువ ఉత్పాదకతతో ఉంటారని భావిస్తుంటారు.
శ్రీ అసంఘటిత రంగ ంలో పనిచేసే మహిళలందరూ సంఘటితరంగ ంలో
పనిచేసే సగ ం మంది మహిళలకు పర్మినెంట్‌ కార్మికులకు లభించే సామాజిక
భద్రతా ప్రయోజనాలు అందుబాటులో లేవు.
శ్రీ గ ృహనిర్వహణలో మహిళల పాత్ర కుటుంబ కార్యకలాపాల్లో వారికి
హెచ్చుస్థాయి ప్రమేయం వారి అభివద్ధికి ప్రతిబంధకంగా ూంటోంది.
శ్రీ స్వయం ఉపాధుల్లో వున్న మహిళలు వడ్డీ వ్యాపారులపై లేదా దళారీలపై
ఆధారపడాల్సి వస్తోంది. వారు అత్యధిక వడ్డీరేటు గ ుంజుతూ వుంటారు.
శ్రీ యజమానులు, కాంట్రాక్టర్లు, దళారీలు, సహ కార్మికులు, సీనియర్‌ బాస్‌
తదితరులచే శ్రామిక మహిళలు లైంగిక దోపిడీకి గ ురవుతున్నారు. ఇది
తక్షణమే నివారించాల్సిన మరో తీవ్రమైన సమస్య.


Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

వివాహ దినోత్సవం

నమ్మకం.. గౌరవం.. అనురాగం.. నేడు వివాహ దినోత్సవం నవతెంగాణ ` ఆదిలాబాద్‌ టౌన్‌ నమ్మకం, గౌరవం, కష్టాు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఁబడడం, మానసికంగా ఆంబన కగజేయడం, మనసా, వాచా కర్మేణా తన భాగస్వామితోనే జీవన సౌఖ్యాను పొందడం, సత్సంతానంగా పుట్టిన బిడ్డను పెంచి పెద్ద చేయడం, ఇద్దరి తల్లిదండ్రును గౌరవించి ఆదరించడం, వృద్ధాప్యంలో తోడూనీడగా జీవన సంధ్యఁ గడుపుకోవడం! ఇదే వివాహ బంధం.. ఇలా ఉంటేనే అది అన్యోన్య దాంపత్యం.. పెండ్లంటే ఇంకేదో కాదు. ప్రేమలో పడడం. ప్రతిరోజూ ఒకే వ్యక్తితో ప్రేమలో పడడం. ఆ ప్రేమలో ఎంత లోతు ముఁగితే, పెండ్లి అంత విజయవంతమైనట్టు. నేడు ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం వివాహం ఒక లేలేత గులాబీ పూత లాంటిది. కంచె పెట్టినంత శ్రద్ధగా, నీళ్లుపోసినంత ప్రేమగా, ఎరువులేసినంత నైపుణ్యంగా... వివాహ బంధాన్నీ కాపాడుకోవాలి. అప్పుడే కాపురం పచ్చగా ఉంటుంది! వివాహ వ్యవస్థలో ఎన్నో లోపాున్నాయి.. కోపాున్నాయి.. గొడమన్నాయి.. రాజీున్నాయి.. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఆడ, ఒక మగ.. ఇద్దర్నీ ఒక్కటి చేసేందుకఁ ఇంతకంటే బమైంది.. ఇంతకంటే పవిత్రమైంది.. ఇంతకంటే చట్టబద్ధమైంది.. ఇంకే మార్గం లేదు. నవతెం...