Skip to main content

Posts

sameer KHan

న‌వంబ‌ర్ వ‌న్‌..ఆదిలాబాద్ రంజ‌న్‌ - Adilabad ranjajn

చూడడానికి మట్టి కుండలే అయినా.. అవి చల్లని నీటిని అందిస్తాయి. వేసవి రాగానే గుర్తుకొస్తాయి.. పేదల ఫ్రిజ్‌లుగా ప్రఖ్యాతి గాంచాయి.. ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వేసవిలో పేదవాడికి చల్లటి నీటిని అందిస్తున్నాయి. అవే ఆదిలాబాద్‌ రంజన్లు. వేసవి ప్రారంభంలోనే గిరాకీ పెరిగింది. జిల్లా కేంద్రంలో పలు చోట్ల రంజన్లు అమ్ముతుండగా, వ్యాపారులు వీటిని వాహనాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తరలిస్తుస్తున్నారు. ఆదిలాబాద్‌ రంజన్లపై ఈ నాటి సండే స్పెషల్‌.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో తయారయ్యే రంజన్లు రాష్ట్రంలోనే పేరుగాంచాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు చేరుకుంటున్నాయి. రంజన్లలో పోసిన నీరు ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీటిలా ఉండడంతో పాటు తాగడానికి కమ్మగా ఉంటాయి. అదే వీటిలోని ప్రత్యేకత. అందుకే వీటిని వేసవిలో జనం ఎగబడి కొంటారు. ఆదిలాబాద్‌ నుంచి ప్రతి నిత్యం లారీలు, బస్సుల్లో రంజన్లు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక ఇక్కడ విడిగా విక్రయించేవి, లారీల్లో, బస్సుల్లో తరలించే వాటి సంగతి సరేసరి. ఆదిలాబాద్‌ నుంచి వెళ్లే ప్రతి బస్సులో, ఇటు...

పల్లె బతుకుచిత్రం చరణ్‌దాస్‌ నెలపొడుపు - Poet Charandas

 'అతను దినే రొట్టెల సగం/ ఎద్దుకు వెడ్తడు/ అడ్డ దునక కుక్కకేత్తడు/ ఎంగిలి కుడితి బర్రెకు / గడ్డిమోపు దుడ్వకు/ గిన్నెడు పాలు పిల్లికి' నోరు నిండా మాట్లాడిస్తడు/ మంచి చెడ్డలడ్గుతడు. ఈ మాటలు వింటే మనసు వెట్టి చదివితే మనకు విచిత్రమనిపిస్తది కదా! అవును అనిపించవచ్చు. మనం తల్లిలాంటి పల్లెల్ని వదిలి పట్నంల బతుకుతున్నం. నిజంగా పల్లెటూరి మనుషుల కపటం లేని మనసులు మనల్ని మనుషులుగా తయారు చేస్తయి. రైతు నిస్వార్థజీవి. తను బతుకుతూ బతుకునిచ్చే దానశీలి. ఇటువంటి రైతుల పక్కన ూంటూ, నిత్యం వారి కష్టసుఖాలను కళ్లారా చూస్తూ మెల్లమెల్లగా కవితలల్లడం నేర్చుకున్నడు మన పల్లెకవి చరణ్‌దాస్‌. చరణ్‌దాస్‌ అణగారిన వర్గంలో పుట్టినా, పట్టుదలతో తెలుగు పండితుడయ్యిండు. తెలుగు సాహితీమూర్తులకు గౌరవంగా తలవంచి నమస్కరించిండు. కవులు రచయితల పద్యాలు, పాటలు కవితల్ని తల్లికోడి పిల్లలకు ఒలిచి పెట్టినట్టు బడి పిల్లలకు నేర్పిస్తున్నడు. తాను భాషోపాధ్యాయుడై తెలుగు భాషావన్నె చిన్నెలను గుండెకత్తుకునేట్లు చెప్తు బతుకుతున్నడు. అతనికున్న తెలుగు భాషాభిమానమే అతని వృత్తి అయింది. అదే జీవనాధారమైంది. అటు వృత్తిపరంగా సాగిన ఇ...

జాతీయ టీకాల దినోత్సవం - టీకాల‌తో జీవితానికి ర‌క్ష‌ - National Vaccination day

టీకా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా కాపాడుతుంది. ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అన్ని రకాల టీకాలను ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా పెద్దలకు టీకాలపై అవగాహన ఎంతో అవసరం. ఈ టీకాలు చిన్నారులకు క్షయ, కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, తట్టు, కామెర్లు, మెదడువాపు, హిబ్‌ (న్యూమోనియా) వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడాన్నే టీకా (వ్యాక్సిన్‌) అంటారు. రేపు జాతీయ టీకాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. టీకా లేదా వ్యాక్సిన్‌ అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు ఒకటి సంప్రదాయక, రెండోది ఆధునిక టీకాలు. సంప్రదాయక టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఈ టీకాలను అందించటం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధి కారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంల...

క‌ళ‌తప్పి‌న పిక్ని‌క్ స్పా‌ట్‌ - సాత్నాల ప్రాజెక్టు - Sathnala Project

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర ప్రజల పిక్నిక్‌ స్పాట్‌ కళ తప్పింది. ఆహ్లాదం కోసం పట్టణ ప్రజలు వెళ్లే సాత్నాల ప్రాజెక్టులో పచ్చదనం కరువైంది. పర్యాటకులు లేక బోసిపోతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి తక్కువైంది. ఒకప్పుడు జైనథ్‌ మండలంలో సాత్నాల ప్రాజెక్టు ఆహ్లాదానికి పెట్టింది పేరు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజలు ఇక్కడ పిక్నిక్‌కు వెళ్లేవారు. ఎవరైనా రాజకీయ నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు సేద తీరేవారు. పిక్నిక్‌కు వెళ్లినప్పుడు చిన్న పిల్లల కేరింతలతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రాజెక్టుకు వద్ద పచ్చదనం కరువైంది. పర్యాటక శాఖ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో క్రమేపి సాత్నాల ప్రాజెక్టు అంటే పర్యాటకులకు పూర్తిగా ఆసక్తి తగ్గింది. దీంతో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారుతోంది. ప్రాజెక్టు వద్ద పచ్చదనానికి బదులు పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకరు సాత్నాల ప్రాజెక్టుకు ఆహ్లాదం కోసం వెళ్తున్నారే తప్ప పర్యాటకుల తాకిడి పూర్తిస్థాయిలో తగ్గిపో...

Another JNU Student Sucicde

In a shocking incident, Muthukrishnan Jeevanantham, a Dalit PhD student studying at Jawaharlal University’s Centre for Historical Studies, committed suicide on Monday evening in Munirka, Delhi. According to initial posts on social media, Jeevantham, who belonged to Salem, Tamil Nadu and had managed to get into JNU this academic year after numerous attempts, had been under a severe financial crunch. He had been staying at a friend’s place since he had not been allotted hostel in JNU. In his last Facebook post, he said, “When equality is denied everything is denied. There is no Equality in M.phil/PhD Admission, there is no equality in Viva – voce, there is only denial of equality, denying prof. Sukhadeo Thorat recommendation, denying Students protest places in Ad – block, denying the education of the Marginals”. Muthukrishnan had been an active member of the Justice for Rohith Vemula movement and was part of the Ambedkar Students’ Association (ASA) in Hyderabad Cen...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...