Skip to main content

Posts

Showing posts from March, 2017

sameer KHan

న‌వంబ‌ర్ వ‌న్‌..ఆదిలాబాద్ రంజ‌న్‌ - Adilabad ranjajn

చూడడానికి మట్టి కుండలే అయినా.. అవి చల్లని నీటిని అందిస్తాయి. వేసవి రాగానే గుర్తుకొస్తాయి.. పేదల ఫ్రిజ్‌లుగా ప్రఖ్యాతి గాంచాయి.. ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వేసవిలో పేదవాడికి చల్లటి నీటిని అందిస్తున్నాయి. అవే ఆదిలాబాద్‌ రంజన్లు. వేసవి ప్రారంభంలోనే గిరాకీ పెరిగింది. జిల్లా కేంద్రంలో పలు చోట్ల రంజన్లు అమ్ముతుండగా, వ్యాపారులు వీటిని వాహనాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తరలిస్తుస్తున్నారు. ఆదిలాబాద్‌ రంజన్లపై ఈ నాటి సండే స్పెషల్‌.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో తయారయ్యే రంజన్లు రాష్ట్రంలోనే పేరుగాంచాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు చేరుకుంటున్నాయి. రంజన్లలో పోసిన నీరు ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీటిలా ఉండడంతో పాటు తాగడానికి కమ్మగా ఉంటాయి. అదే వీటిలోని ప్రత్యేకత. అందుకే వీటిని వేసవిలో జనం ఎగబడి కొంటారు. ఆదిలాబాద్‌ నుంచి ప్రతి నిత్యం లారీలు, బస్సుల్లో రంజన్లు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక ఇక్కడ విడిగా విక్రయించేవి, లారీల్లో, బస్సుల్లో తరలించే వాటి సంగతి సరేసరి. ఆదిలాబాద్‌ నుంచి వెళ్లే ప్రతి బస్సులో, ఇటు...

పల్లె బతుకుచిత్రం చరణ్‌దాస్‌ నెలపొడుపు - Poet Charandas

 'అతను దినే రొట్టెల సగం/ ఎద్దుకు వెడ్తడు/ అడ్డ దునక కుక్కకేత్తడు/ ఎంగిలి కుడితి బర్రెకు / గడ్డిమోపు దుడ్వకు/ గిన్నెడు పాలు పిల్లికి' నోరు నిండా మాట్లాడిస్తడు/ మంచి చెడ్డలడ్గుతడు. ఈ మాటలు వింటే మనసు వెట్టి చదివితే మనకు విచిత్రమనిపిస్తది కదా! అవును అనిపించవచ్చు. మనం తల్లిలాంటి పల్లెల్ని వదిలి పట్నంల బతుకుతున్నం. నిజంగా పల్లెటూరి మనుషుల కపటం లేని మనసులు మనల్ని మనుషులుగా తయారు చేస్తయి. రైతు నిస్వార్థజీవి. తను బతుకుతూ బతుకునిచ్చే దానశీలి. ఇటువంటి రైతుల పక్కన ూంటూ, నిత్యం వారి కష్టసుఖాలను కళ్లారా చూస్తూ మెల్లమెల్లగా కవితలల్లడం నేర్చుకున్నడు మన పల్లెకవి చరణ్‌దాస్‌. చరణ్‌దాస్‌ అణగారిన వర్గంలో పుట్టినా, పట్టుదలతో తెలుగు పండితుడయ్యిండు. తెలుగు సాహితీమూర్తులకు గౌరవంగా తలవంచి నమస్కరించిండు. కవులు రచయితల పద్యాలు, పాటలు కవితల్ని తల్లికోడి పిల్లలకు ఒలిచి పెట్టినట్టు బడి పిల్లలకు నేర్పిస్తున్నడు. తాను భాషోపాధ్యాయుడై తెలుగు భాషావన్నె చిన్నెలను గుండెకత్తుకునేట్లు చెప్తు బతుకుతున్నడు. అతనికున్న తెలుగు భాషాభిమానమే అతని వృత్తి అయింది. అదే జీవనాధారమైంది. అటు వృత్తిపరంగా సాగిన ఇ...

జాతీయ టీకాల దినోత్సవం - టీకాల‌తో జీవితానికి ర‌క్ష‌ - National Vaccination day

టీకా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా కాపాడుతుంది. ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అన్ని రకాల టీకాలను ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా పెద్దలకు టీకాలపై అవగాహన ఎంతో అవసరం. ఈ టీకాలు చిన్నారులకు క్షయ, కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, తట్టు, కామెర్లు, మెదడువాపు, హిబ్‌ (న్యూమోనియా) వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడాన్నే టీకా (వ్యాక్సిన్‌) అంటారు. రేపు జాతీయ టీకాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. టీకా లేదా వ్యాక్సిన్‌ అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు ఒకటి సంప్రదాయక, రెండోది ఆధునిక టీకాలు. సంప్రదాయక టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఈ టీకాలను అందించటం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధి కారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంల...

క‌ళ‌తప్పి‌న పిక్ని‌క్ స్పా‌ట్‌ - సాత్నాల ప్రాజెక్టు - Sathnala Project

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర ప్రజల పిక్నిక్‌ స్పాట్‌ కళ తప్పింది. ఆహ్లాదం కోసం పట్టణ ప్రజలు వెళ్లే సాత్నాల ప్రాజెక్టులో పచ్చదనం కరువైంది. పర్యాటకులు లేక బోసిపోతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి తక్కువైంది. ఒకప్పుడు జైనథ్‌ మండలంలో సాత్నాల ప్రాజెక్టు ఆహ్లాదానికి పెట్టింది పేరు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజలు ఇక్కడ పిక్నిక్‌కు వెళ్లేవారు. ఎవరైనా రాజకీయ నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు సేద తీరేవారు. పిక్నిక్‌కు వెళ్లినప్పుడు చిన్న పిల్లల కేరింతలతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రాజెక్టుకు వద్ద పచ్చదనం కరువైంది. పర్యాటక శాఖ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో క్రమేపి సాత్నాల ప్రాజెక్టు అంటే పర్యాటకులకు పూర్తిగా ఆసక్తి తగ్గింది. దీంతో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారుతోంది. ప్రాజెక్టు వద్ద పచ్చదనానికి బదులు పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకరు సాత్నాల ప్రాజెక్టుకు ఆహ్లాదం కోసం వెళ్తున్నారే తప్ప పర్యాటకుల తాకిడి పూర్తిస్థాయిలో తగ్గిపో...

Another JNU Student Sucicde

In a shocking incident, Muthukrishnan Jeevanantham, a Dalit PhD student studying at Jawaharlal University’s Centre for Historical Studies, committed suicide on Monday evening in Munirka, Delhi. According to initial posts on social media, Jeevantham, who belonged to Salem, Tamil Nadu and had managed to get into JNU this academic year after numerous attempts, had been under a severe financial crunch. He had been staying at a friend’s place since he had not been allotted hostel in JNU. In his last Facebook post, he said, “When equality is denied everything is denied. There is no Equality in M.phil/PhD Admission, there is no equality in Viva – voce, there is only denial of equality, denying prof. Sukhadeo Thorat recommendation, denying Students protest places in Ad – block, denying the education of the Marginals”. Muthukrishnan had been an active member of the Justice for Rohith Vemula movement and was part of the Ambedkar Students’ Association (ASA) in Hyderabad Cen...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...

జర్నలిస్టుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం - TJJAC Dharna at Adilabad

జర్నలిస్టుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని తెలంగాణ జర్నలిస్ట్స్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పురుషోత్తం నారగౌని అన్నారు. జీఓలతో సంబంధం లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేయాలని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీజేజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గండ్రత్‌ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఫారుఖ్‌ అహ్మద్‌, పలువురు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పురుషోత్తం నారగోని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన కష్టాలు దూరమవుతాయనుకున్న జర్నలిస్టులకు మరింత పెరిగాయన్నారు. ఎంపానల్మెంట్‌తో సంబంధం లేకుండా అందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పత్రికా రంగం స్వయం సమృద్ధి సాధించేలా ప్రతి పత్రికకు లక్ష రూపాయలకు తగ్గకుండా ప్రకటనలు ఇవ్వాలన్నారు. తెలంగాణలోని ప్రతి పత్రికకు, మీడియాకు ఒక ఎకరం స్థళం కేటాయించి ముద్రణా యంత్రాలు, ప్రసార సామగ్రి కోసం రుణ సదుపాయం కల్పించాలన్నారు. టీజేజేఏసీ ఉత్తర తెలంగాణ కన్వీనర్‌...

వడపోయలేకపోతున్నాయ్‌..-ప్రపంచ కిడ్నీ దినోత్సవం - World Kidney Day

నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్ర త్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ 'డయాలసిస్‌' కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు. ఇలాంటి కిడ్నీ సంబంధిత రోగ ులు ఆదిలాబాద్‌ జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌తోపాటు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మూత్రపిండాల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై.. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో సుమారు 17 శాతం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధికూడా విస్తరిస్తున్న నేపథ్యంలో కిడ్నీ వ్యాధులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అదే రీతిలో ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా సుమారు ఎనిమిది శాతం మంది వరకు ఈ వ్యాధిబారిన ప...

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ఇంటింటా మ‌రుగుదొడ్లు‌...ఇంకుడుగుత‌లు - తాంసీ - Swaccha Bharath in Tamsi

     పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత.. ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆదర్శంగా నిలుస్తోంది తాంసి మండల కేంద్రం.. పరిశుభ్రత.. భూగర్భ జలాలు పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు ముందుకేస్తోంది. ప్రభుత్వం అందించే పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటోంది. తాంసి మండల కేంద్రంలో సుమారు 950 కుటుంబాలు నివాసముంటుండగా, 5800 జనాభా ఉంది. కొన్నేండ్ల క్రితం వరకు చూసినట్లయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారు, ప్రభుత్వ కొలువు ఉన్న కుటుంబాల్లో తప్ప ఇతరుల ఇండ్లలో మరుగుదొడ్లు కనిపించేవి కావు. సుమారు 75 శాతం మంది ఇండ్లలో మరుగుదొడ్లు ఉండేవి కావు. దీంతో గ్రామంలో అపరిశుభ్రత నెలకొంది. ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. రోడ్లపై వచ్చిపోయేవారు దుర్వాసనతో ముక్కును మూసుకునే వారు. దుర్వాసనతో కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. అయితే మూడేండ్ల క్రితం ఎంపీడీఓ ఆకుల భూమయ్య, ఉపాధి హామీ ఏపీఓ సంగీత, బీఎస్‌ఎన్‌ఎల్‌ డీఈ అశోక్‌ వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. బహిరంగ మలమూత్ర విసర్జనతో కలిగే నష్టాలను వారికి...

నిర్లక్ష్యం చేస్తే కోతే - ఉపాధి హామీ పథకం - MNREGS Scheme

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కూలీల సంఖ్యను పెంచేందుకు వేసవి కరువు భత్యాన్ని పెంచింది. ఇదే క్రమంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది (ఫీల్డ్‌ అసిస్టెంట్ల) పనితీరులో అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉండేందుకు పలు నిబంధనలు విధించింది. ఇక నుంచి ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం పంపకుంటే వారి వేతనంలో 25 శాతం కోత పడనుంది. ఈ మేరకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలందాయి. ఉపాధి హామీ పథకం కింద ఆదిలాబాద్‌ జిల్లాలోని మొత్తం 18 మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది కార్మికులు ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది మంది కూలీలకు పనులు కల్పించారు. ఇదివరకు కూలీలు వచ్చినా, రాకపోయినా డిమాండ్‌ (దరఖాస్తులు) పంపించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. దీంతో కూలీలకు సరైన న్యాయం జరగకపోయేది. ఏపీవోల జవాబుదారీతనానికి చెక్‌ గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనికి సంబంధించి డిమాండ్లు పంపకుంటే ఆయా మండలాల ...

సాయం అందేనా..? - ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు -Support for single women with pensions?

'సమాజంలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళల పరిస్థితిని గమనించాం. వారిని ఆదుకునేందుకు నెలకు రూ.వెయ్యి చొప్పున జీవనభృతి అందిస్తాం. ఈ పథకాన్ని ఏప్రిల్‌ నుంచి ప్రారంభిస్తాం.. ఒంటరి మహిళలను గుర్తించేందుకు అధికారులకు ఆదేశాలిస్తాం' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాక్ష్యాత్తు శాసనసభలో ప్రకటించారు. రోజులు గడుస్తున్నా ఒంటరి మహిళలను గుర్తించేందుకు ప్రభుత్వం ఎలాంటి వివరాలను ప్రామాణికం చేసుకోవాలో ప్రకటించకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆదిలాబాద్‌ మండలంలో ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు ఒంటరి మహిళలపై సర్వే చేపట్టగా, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మాత్రం ఒంటరి మహిళల ఊసే లేకుండా పోయింది. ఆదిలాబాద్‌ మండలంలో 2602 మంది, దివ్యాంగులు 793, వితంతువులు 305, పింఛన్లు పొందుతున్నారు. వీరు కాకుండా సమాజంలో ఆదరణ లేని ఒంటరి మహిళలకు జీవనభృతి అందించి చేయూతనిచ్చేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయంతో అర్హత పొందుతామనుకునే వారిలో ఆనందం వ్యక్తమవుతుండగా, స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. విడాకులు తీసుకున్న వారు, వివాహం కాకుండా ఒంటరిగా ఉ...

మహిళా దినోత్సవం - International Womens Day

తాను కాలుతూ, కరుగ ుతూ ప్రపంచానికి వెలుగ ునిచ్చే సమిధ మహిళ. కానీ, పురుషాధిక్య సమాజంలో నేటిమహిళ అబలగానే మిగిలిపోతోంది. 'ఆడది అబలకాదు సబల' అనే శాస్త్రీయ నినాదం ఇటు పాలకులకు గానీ, అటు పడగ విప్పిన పురుషాధిక్య సమాజానికి వినిపించడం లేదు. ఆకాశంలో ఆమె సగ ం, ఆదిశక్తి స్వరూపం అంటూ మహిళల గ ురించి వారి సంక్షేమం గ ురించి ప్రకటించడం తప్ప నిర్దిష్ట పథకాలేవీ తీసుకోకపోవడమే 60 సంవత్సరాలకుపైగా పాలించిన పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. నేటికీ మహిళ అన్నివిధాలా అణచివేతకు గ ురవుతూనే ఉంది. కుటుంబ హింస, రాజ్యహింస, మతపరమైన హింస రకరకాల హింసకు బలవుతూనే ఉంది. ఎక్కడ చూసినా తమకు రక్షణ కరువైందని విద్యార్థులు, ఉద్యోగ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వివక్ష చూపడం అన్యాయమని మహిళా కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా చట్టాలు.. వారి అభిప్రాయాలు.. విజయాలు సాధించిన మహిళల గ ురించి.. నవతెలంగాణ - ఆదిలాబాద్‌ టౌన్‌ మహిళలు కోరుకుంటున్న సమానత్వం, సాధికారిత, సంక్షేమ అంశాలను ఉ ద్యమాలతో మాత్రమే సాధించుకోగ లరు. అసలు మహిళా దినోత్సవమే ఉ ద్యమాల నేపథ్...

పేరుకే పార్క్‌.. - Adilabad Mini Park

- పరిసరాలు అధ్వానం - పట్టించుకోని యంత్రాంగం జిల్లా కేంద్రంలోని మినీ పార్క్‌లో ఆహ్లాదం కరువైంది.. ఎవరూ పట్టించుకోకపోవడంతో రోజురోజుకు అధ్వానంగా తయారవుతోంది. పరిసరాలు ఎడారిలా మారుతుండగా.. చెట్లు ఎండిపోతున్నాయి. పిల్లల ఆట వస్తువులు చెడిపోతున్నాయి.. పార్కును అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్పిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఎన్‌టీఆర్‌ చౌక్‌ సమీపంలో గల పార్కు ఎడారిని తలపిస్తోంది. పట్టణం మధ్యలో ఉండడంతో రోజు చాలా మంది ఈ పార్కుకు వస్తుంటారు. కానీ ప్రస్తుతం పార్కు పరిస్థితి అధ్వానంగా ఉంది. పార్కులో ఉన్న ఇతర చెట్లన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. పార్కు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయింది. దీంతో పార్కులో వీధి కుక్కలు, పందులు తిరుగుతున్నాయి. పార్కులో పచ్చదనం కూడా కనిపించడం లేదు. ఈ పార్కు అభివృద్ధిపై అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం మానేశారు. గతంలో జిల్లా కేంద్రంలో పర్యటించిన ప్రభుత్వ సీసీఎల్‌ఏగా రేమండ్‌పీటర్‌ జిల్లాలో పర్యటించినప్పుడు పార్కులో హరితహారం కింద మొక్కలను నాటారు. వాటి పరిరక్షణ చూడాలని అధికారులను ఆదేశించారు. కానీ ...

ఆదివాసుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం - Aadivaasi simhagarjana

నవతెలంగాణ-బోథ్‌ ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర గౌరవాధ్యక్షులు సోయంబాపురావు అన్నారు. మండలకేంద్రంలోని ఫ్రెండ్స్‌ క్లబ్‌ ఆవరణలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సింహగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ఆదివాసుల చట్టాలను ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం చెల్లప్ప కమిషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. కైతి లంబాడా, వాల్మీకిబోయలను ఎస్‌టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే ఆ కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే వలస లంబాడీలతో తెలంగాణ రాష్ట్ర ఆదివాసులు ఎంతగానో నష్టపోయారన్నారు. వలస లంబాడీలకు ఎస్‌టీ సర్టిఫికెట్లు జారీ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి దోహదపడాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్‌లోనే ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆదివాసులు ఉ...

ఎండ‌ల్లో చ‌ల్ల‌చ‌ల్ల‌గా..! - Ice Creams And coconuts in Summer

మార్చి మొదటి వారానికే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. 10 రోజులుగా పెరిగిన ఎండలతో జనం 'ఉక్క'రిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలకే సుర్రుమనిపించే సూరీడు.. మధ్యాహ్నానికి చండిపచండంగా మారుతున్నాడు. ఈ ఎండవేడిమి తట్టుకోలేక చాలా మంది బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన వారు ఎండకు తాళలేక శీతల పానీయాలను (కూల్‌డ్రింక్స్‌ను) సేవిస్తున్నారు. పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, అంబలి, సోడా తదితరాలతో సేదతీరుతున్నారు. తద్వారా కాసింత ఉపశమనం పొందుతున్నారు. వడదెబ్బ బారినపడకుండా వీటిని తాగుతూ ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. కొబ్బరి బోండాలకు గిరాకీ... కొబ్బరిబోండాలకు గిరాకీ పెరిగింది. కొబ్బరి నీటిలో మంచి లవణాలు ఉన్నందున ఎక్కువ మంది వీటిని తాగేందుకు ప్రాధాన్య తనిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా కాపాడటంలో కొబ్బరి నీరు ప్రధాన పాత్ర పోషిస్తోంది. కేరళతో పాటు, చిత్తూరు, కడప, నెల్లూరు, వరంగల్‌ జిల్లాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. కొబ్బరి నీటిని తాగితే శరీరంలో కోల్పోయిన కార్పోహైడ్రేట్‌లు తిరిగి భర్తీ అవుత...