Skip to main content

Posts

Showing posts from February, 2017

నిమిషం ఆలస్యం.. పరీక్షకు దూరం

1 నుంచి ఇంటర్‌ పరీక్షలు ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో ఇంటర్‌ బోర్డు అధికారులు నిమగ ్నమయ్యారు. నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నారు. ూమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 56,655 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 90 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ూదయం 9 గ ంటల నుంచి 12 గ ంటల వరకు పరీక్ష ూంటుంది. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఉ దయం 9 గ ంటల నుంచి మధ్యాహ్నం 12 గ ంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 9నఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగ నున్న ద ష్ట్యా ఆ రోజు జరుగాల్సిన పరీక్షను 19వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు గ ణితం పేపర్‌-2బీ, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పేపర్లకు పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. వాటిని 19వ తేదీన నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా ఇంటికే.. నిర్ణీత సమయానికంటే ఒక్క నిమిషం...

కబడ్డీ విజేత గర్కంపేట

నవతెలంగాణ-బజార్‌హత్నూర్‌ మండలంలోని జాతర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామీణ కబడ్డీ పోటీల్లో గుడిహత్నూర్‌ మండలంలోని గర్కంపేట జట్టు విజేతగా నిలిచింది. వాలీబాల్‌ పోటీల్లో మహారాష్ట్రలోని మార్వా జట్టు సత్తా చాటి మొదటి స్థానంలో నిలిచింది. నవజ్యోతి యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతరాష్ట్ర గ్రామీణ క్రీడా పోటీలు ఆదివారం అర్ధరాత్రి ముగిశాయి. ఆదివారం రాత్రి కబడ్డీ, వాలీబాల్‌, షటిల్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. కబడ్డీలో గర్కంపేట్‌ కబడ్డీ జట్టు గెలుపొందింది. మొదటి బహుమతి రూ.21 వేలు, రెండో స్థానంలో తాంసి జట్టుకు రూ.15 వేలను ఎంపీ నగేష్‌ అందజేశారు. వాలీబాల్‌ పోటీల్లో మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాకు చెందిన పార్వ జట్టు మొదటి బహుమతి, మహారాష్ట్రకు చెందిన నందిగాం జట్టు రెండో స్థానంలో నిలిచింది. వీరికి ఎంపీ బహుమతులు అందజేశారు. షటిల్‌ పోటీల్లో మొదటి బహుమతి బోథ్‌ మండలానికి చెందిన ఎం. శ్రీకాంత్‌ గెలుపొందాడు. అర్ధరాత్రి వరకు ఎంపీ నగేష్‌ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి కుంగిపోకుం...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

విజ్ఞానం మనోవికాసం - జాతీయ సైన్స్‌ దినోత్సవం - National Scinece Day

- 'విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం' - సర్‌ సి.వి.రామన్‌ జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభించారు. శాస్త్ర ప్రాధాన్యతను దాని ఉపయోగాన్ని ప్రజలకు తెలియజెప్పడం వీటిలో ప్రాథమికమైనది. వైజ్ఞానిక పురోభివృద్ధి వేగవంతమయ్యేందుకు ఇది అవసరం. వైజ్ఞానిక విషయాలను తేలికైన భాషలో విడమర్చి చెప్పే కమ్యూనికేటర్లను అభివృద్ధి చేసుకోవడం ఎన్‌ఎస్‌డీలో మరో ముఖ్య భాగం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహణ ద్వారా మన జాతి మెత్తం ఏడాదికి ఒకసారి తన పూర్తి దృష్టిని శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై కేంద్రీకరించడానికి వీలుకలుగుతుంది. ఈ సందర్భగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో సైన్స్‌ పట్ల ఆసక్తిని, వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలను తెలుసుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి. శాస్త్రవేత్తలు సాధారణ ప్రజలతో ముఖాముఖీ కలవడం ద్వారా శాస్త్ర సాంకేతిక పురోగతిని జనబాహుళ్యపు అవసరాలకు మలచుకోవడానికి వీలు కలుగుతుంది. విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి వారి అనుభవంలోకి తెచ్చే ప్రయత్నాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం (నేషనల్‌ సైన్స్‌ డే - ఎన్‌.ఎస్‌.డి) ఒకటి. ఫిబ్రవరి ...

నోరూరుస్తా‌యి..ఆరోగ్యా‌న్ని దెబ్బ‌తీస్తా‌యి..! - Losses of Fruit Ripen with Chemical

నిగ నిగలాడే యాపిల్‌.. మెరిసిపోయే మామిడి పండు.. ఎర్రగా కనిపించే పుచ్చపండు.. నోరూరిస్తాయి.. వెంటనే తినాలనిపిస్తాయి. కానీ జరభద్రం.. వాటి పక్కన రోగాలు పొంచి ఉన్నాయి.. రంగు.. రుచి.. వాటిలో పోషకాల విషయం తర్వాత.. వివిధ రకాల పండ్లను విషపూరిత.. నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా అందిస్తుండడంతో ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన పండు అనారోగ్యాన్ని పంచిపెడుతున్నాయి. రోజుకో పండు తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెబుతుంటే.. వాటిని పండించేందుకు చేస్తున్న కల్తీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్‌ అంటే నోరూరనివారు ఎవరుంటారు? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మార్కెట్‌లో లభిస్తున్న వివిధ రకాల పండ్లలో కొన్ని రకాల రసాయనాలను వినియోగించడం ద్వారా వాటిని పక్వానికి తీసుకువస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సీజన్‌లో ప్రతి ఒక్కరూ తినేందుకు ఆసక్తి చూప...

ఎండాకాలం.. వాహనాలు భద్రం - Vehicle Safety in Summer

వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పార్కింగ్‌ లేకపోవడంతో ఎండలోనే వాహనాలు నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజన్‌ నుంచి పొగలు రావడం, పెట్రోల్‌ ఆవిరైపోవడం, టైర్‌పంక్చర్‌ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వేసవిలో వాహనాల ఇంజన్‌ ఆయిల్‌ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి కారణంగా ఇంజన్‌ ఆయిల్‌ ఆవిరయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్న ప్పుడు వచ్చే వేడి.. ఎండవేడి కలిసి ఇంజన్‌ ఓవర్‌ హీట్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంజన్‌ నుంచి పొగలు వస్తుంటాయి. దీంతోపాటు ఎయిర్‌లాక్‌ ఏర్పడి వాహనం స్టార్ట్‌ కాక మొరాయించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజన్‌ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. సాధారణంగా 2 వేల కిలో మీటర్లకు ఒకసారి మార్చే ఇంజన్‌ ఆయిల్‌ను వేసవిలో వెయ్యి నుంచి 1,500 కిలో మీటర్లకు మార్చుకోవడం చాలా మంచిది. ఎండ తీవ్రతను తగ్గించడంలో సీట్‌ కవర్లు కీలకపాత్ర పోషిస్తాయి. కేవలం సీటుకే కాకుండా పెట్రోల్‌ ట్యాంక్‌కు సైతం కవర్‌లు వేయడం మరింత సురక్షితం. వేడిని తగ్గించే వెల...

వేస‌విలో చ‌ల్ల‌ద‌నం` - Cooler Sales in Summer

- ఎయిర్‌ కూలర్లు, రిఫ్రిజిరేటర్లకు భలే డిమాండ్‌ - ముందుగానే ఊపందుకున్న విక్రయాలు ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటేశాయి. వేడిగాలులు, ఉక్కపోతలు.. వారం రోజులుగా పట్టణంలో పరిస్థితి ఇది. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు చల్లని నేస్తాలను వెతుక్కుంటున్నారు పట్టణవాసులు. గతేడాదితో పోలిస్తే అప్పుడే ఎండ తీవ్రత అధికమైంది. ఉదయం పది గంటల నుంచే బయటికి రాలేని విధంగా ఎండ ఉంటోంది. ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీల కొనుగోళ్లలో బిజీబిజీ అయ్యారు. దీంతో మార్కెట్లలోనూ కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈమారు కొనుగోళ్ళు ఆశాజనకంగా ఉన్నాయంటూ దుకాణదారులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో సూర్యుడు మరింత ప్రతాపాన్ని చూపేలా ఉన్నాడు. రాత్రివేళల్లోనూ ఇంట్లో కూలర్‌ తప్పనిసరి అయ్యింది. ఆర్థికంగా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఏసీలు కొనేందుకు ఎక్కుమంది ప్రయత్నిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారంతా కూలర్లవైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం కూలర్ల అమ్మకాలు పెరిగేలా ఉన్నాయని దుకాణ దారులు చెబుతున్నారు....

కూ(కి)ల్‌ డ్రింక్స్‌ - Cool Drinks Kills you

వేసవికాలం ఆరంభమైంది. కూల్‌గా ూండేందుకు చాలామంది కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తి చూపుతారు. కానీ వాటివల్ల కలిగే అనర్థాలను అంచనా వేయరు. వీటిని తాగితే శరీరమనే రైలులో రోగాలకు బెర్తులను రిజర్వు చేసుకున్నట్టే లెక్క. కూల్‌డ్రింక్స్‌పై ఇప్పటికే లెక్కకు మించిన పరిశోధనలు ఎన్నో జరిగాయి, జరుగ ుతున్నాయి. వాటి ఫలితాలు జనాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. అయినప్పటికీ కొంతమందికి అవగాహన లేక అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.. నోరుతీపి చేసుకోవటం కోసం, కొద్ది క్షణాల ఆనందం కోసం కూల్‌డ్రింక్స్‌ తాగితే నోట్లో విషం పోసుకున్నట్టే. మనం బజారుకు వెళ్లి ఏదైనా పండ్లను కొనితెచ్చి దాంతో రసాన్ని చేసి ఫ్రిజ్‌లో పెడితే రెండు, మూడు రోజులు బాగ ుంటుంది. బయటే ఉంచితే ఒక రోజులోనే పాడవ్వచ్చు. కానీ మనకు బయట దొరికే శీతలపానీయాలు మాత్రం దాదాపుగా సంవత్సరం దాకా బాగ ుంటాయని దానిమీద తేదీ ప్రచురిస్తారు. మనవద్ద రోజుల్లోనే పాడయిపోయేవి వారు చేస్తే మాత్రం సంవత్సరంపాటూ ఎలా తాజాగా ఉ ంటాయి? ఇవి మనకు తెలియనిదేమీకాదు. ఎక్కువరోజులు బాగ ుండేలాగా వాటిలో హానికర రసాయనాలు వాడతారు. ూపశమనం కోసమే... మండే ఎండలకు సాధార...

గౌరవం లేదు..వేతనం పెరగదు - VRA Situation in Telangana State

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించిన పరీక్షలో నెగ్గి ప్రభుత్వ ఉ ద్యోగానికి ఎంపికయ్యారు. ఇక తమకు ఏ ఢోకా లేదని భావించారు. కానీ నియామకమైన నాటి నుండి అదే వేతనం. పని గ ంటలు లేవు. వేతనం పెరుగ ుతుందన్న ఆశలు కనిపించడం లేవు. అధికపనిఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇంత చేసినా వారిని పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఇదీ వీఆర్‌ఏల దుస్థితి. 2012 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన ద్వారా పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు వీఆర్‌ఏలు. తమకు ప్రభుత్వ ఉద్యోగ ం లభించిందని 4100 మంది, జిల్లాలోని 417 మంది సంతోషపడ్డారు. పదో తరగ తి విద్యార్హతతోపాటు రోస్టర్‌ మెరిట్‌ ప్రకారం వీఆర్‌ఏలుగా నియమించబడినా తమకు ప్రభుత్వ ఉద్యోగ ం లభించిచినందుకు వారి ఆనందానికి హద్దుల్లేవు. కానీ కాలం గ డిచిన కొద్దీ పనిభారం పెరగ డం, పనికి తగిన వేతనం లేకపోవడం, పనివేళలు లేకుండా పోవడంతో వీరి ఆశలు అడియాశలవుతూ వచ్చాయి. పోరాడినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వీరు ఉన్నారు. ఉద్యోగ ం వచ్చిందన్న సంతోషం కన్నా నామమాత్రపు గౌరవవేతనం(నెలకు రూ.6500) తీసుకుంటూ కుటుంబాన్ని ప...

అతని వ్యాఖ్యానం.. అంతర్జాతీయం - Adilabad Comentrator

అతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. బడిలో పిల్లల కు   పాఠాలు బోధిస్తాడు.. అయితే ఆ మాస్టారుకు  క్రికెట్‌ పిచ్చి.. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో ఎక్కడ మ్యాచ్‌ జరిగితే అక్కడే వాలిపోతాడు. వ్యాఖ్యాత (కామెంటేటర్‌)గా అవతారమెత్తుతాడు. తన వ్యాఖ్యానంతో అందరినీ అలరిస్తాడు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో వ్యాఖ్యాతగా రాణించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు జబాడె రవి. నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ గ్రామాఁకి చెందిన జవాడె రవికి క్రికెట్‌ వ్యాఖ్యానం అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక పరిస్థితుల కారణంగా దాఁకి దూరంగా ూన్నాడు. కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. జిల్లా కేంద్రంలోని  ఆర్‌పీఎల్‌ పాఠశాలలోఉపాధ్యాయుడిగా పని  చేస్తున్నాడు. టీచర్స్‌ కాలనీలో ఁవాసముంటున్నాడు. అయితే క్రికెట్‌ వ్యాఖ్యాత కావాలన్న కోరిక అలాగే ూండిపోయింది. దీంతో తన కలను సాకారం చేసుకోవడాఁకి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఓ వైపు పిల్లలఁ పాఠాలు బోధిస్తూనే కామంటేటర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఆదిలాబాద్‌ పట్టణంలో, జిల్లాలో ఎక్కడైనా గాఁ క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయంటే  అక్కడ వాలిపోయి వ్యాఖ్యానం మొదలుపెడతాడు. దీం...

మ‌న గాలితోనూ ముప్పే‌ - Air Pollution in Adilabad

జిల్లాలో రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతోంది. ఇటీవల అమెరికాలోని 'హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌' నిర్వహించిన సర్వేలో భారతదేశంలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉందని నివేదిక ఇవ్వగా.. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ పరిస్థితి అలాగే ఉంది. ప్రతి పది మందిలో ఒకరిద్దరు మాత్రమే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. విపరీతమైన కలుషితగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తూ ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. నవతెలంగాణ - ఆదిలాబాద్‌ ఆరోగ్యంగా ఉన్న మనిషి ఆహారం లేకుండా మూడు వారాలు తట్టుకోగలడు. నీళ్లు లేకుండా మూడు రోజులు బతుక గలడు. కానీ గాలి లేకుండా కేవలం మూడంటే మూడు నిమిషాలు కూడా మనలేడు. దీన్ని బట్టి గాలికి ఎంత ప్రాధాన్యమున్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత మానవ తప్పిదాలతో పీల్చేగాలీ కలుషితమవుతున్నది. పరిశ్రమలు, మోటార్‌ వాహనాల నుంచి వెలువడుతున్న పొగతో, రసాయనిక ఎరువులతో గాలి కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఫలితంగా ఊపిరి తిత్తులు, కండ్ల సంబంధిత, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. క్యాన్సర్‌ కారకం.. జిల్లాలో వాయు కాలుష్యం తీవ్రంగానే ఉంది. ము...

రాతికి రూపం - Adilabad sculptor

- శిల్పాల తయారీలో రాణిస్తున్న కేశవ్‌ - వాటితోనే జీవనోపాధి   అతను రాతికి రూపమిస్తున్నాడు.. వివిధ విగ్రహాలు తయారు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. తన కళనే జీవనోపాధిగా మార్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శిల్పకారునిగా రాణిస్తున్న మావల మండలంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన రాంపెల్లి కేశవ్‌పై కథనం.. మావల మండలంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన రాంపెల్లి కేశవ్‌ శిల్పకారుడు. 30 సంవత్సరాల నుంచి రాళ్లను చెక్కుతూ శిల్పాలు తయారు చేసి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇచ్చోడ మండలంలో సిరిచెల్మ గ్రామంలో దొరికే ప్రత్యేక రాళ్లను తెప్పించుకొని, వాటితో వివిధ దేవతల విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఈయన తయారు చేసిన విగ్రహాలు ప్రత్యేకంగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఒక విగ్రహం ధర రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఒక విగ్రహం తయారు చేయాలంటే వారం నుంచి నెల రోజుల సమయం కూడా పడుతుంది. చిన్న శిల్పానికి వారం.. పెద్ద శిల్పానికి నెల రోజులు పడుతుందని శిల్పకారుడు కేశవ్‌ తెలిపాడు. నంది, మహాలక్ష్మి, శివ లింగం, రామలక్ష్మణులు, సీతా, హనుమాన్‌, గణేష్‌...

కబ్జా కోరల్లో కేఆర్‌కే - Occupy Lands in KRK Colony, Adilabad

- ప్లాట్లు కబ్జా చేసి అమ్మేస్తున్న స్థానిక నాయకులు - అడిగితే బెదిరింపులు - లబోదిబోమంటున్న యజమానులు మావల మండలంలోని కస్తాల రాంకిష్టు కాలనీ.. దశాబ్ద కాలం క్రితం పేదల కోసం ఏర్పాటైంది. ప్రభుత్వాలు పేదలకు భూములు కేటాయించకపోవడంతో ఎర్ర జెండా పార్టీలు పేదలతో కలిసి అక్కడ గుడిసెలు నిర్మించాయి. కనీస వసతులు లేకపోయినా అక్కడ పేదలు సంవత్సరాల తరబడి నివసించారు. కాలం గడిచిన కొద్దీ కాలనీ అభివృద్ధి చెందింది. అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వివిధ అవసరాల నిమిత్తం పేదలు తాము నివసించిన గుడిసెలను అమ్ముకోవడానికి సిద్ధం కాగా, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నిజం చేసుకోవడానికి, భవిష్యత్‌ అవసరాల కోసం వాటిని కొనుగోలు చేసి ఉంచుకున్నారు. ఈ కొనుగోలు, అమ్మకాలు కేవలం బాండ్‌ పేపర్ల మీదనే కొనసాగాయి. దీన్ని అవకాశంగా మలుచుకొని కొందరు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులమనే చెప్పుకునే వారు కాలనీలో కబ్జాల పర్వం మొదలుపెట్టారు. ఖాళీ జాగా, లేదా బేస్‌మెంట్‌ వరకు కట్టి కనిపించినా సరే కబ్జా చేసేశారు. వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. యజమానులు వచ్చి అడిగితే మధ్యవర్తిత్వం నడిపించారు. డబ్బుల...

వృథా నీటితో కూర‌గాయ‌లు సాగు - Vegetables

      వందలాది మంది విద్యార్థులు.. రోజూ స్నానం చేయడం.. దుస్తులు ఉతుక్కోవడం.. దీనికి వేలాది లీటర్ల నీరు అవసరముంటుంది. అంతే నీరు వృథాగా పోతుంటుంది.. ఈ నీటిని ఎలాగైనా పునర్‌వినియోగంలోకి తేవాలనుకున్నారు ఆ గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్‌, ఉపాధ్యాయులు. విద్యార్థుల సహకారంతో కాలువలు ఏర్పాటు చేసి ఖాళీ ప్రదేశంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ఆ కూరగాయలతో విద్యార్థులకు భోజనం పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాంసి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 260 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో రోజు ఉదయం, సాయంత్ర సమయాల్లో స్నానం, దుస్తులు ఉతుక్కోవడం, ఇతర వాటికి నీటి వాడకం జరుగుతుంది. అయితే ఆ నీటిని మళ్లీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, వార్డెన్‌ కూరగాయల సాగుకు ప్రణాళిక వేశారు. హాస్టల్‌ పరిసర ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించారు. ఆ స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి కూరగాయలు సాగు చేస్తున్నారు. దీనికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నారు. ఒక పెద్ద తోట తయారు చేశారు. టమాటా, గోబి, కొత్మీర, మెంతికూరతోపాటు వివిధ రకాల కూరగాయలను సాగు చేసుక...

ప‌ల్లె‌ను క‌విత్వ శిలాఫ‌ల‌కం చేసిన కుర్మె - GR Kurme Shilaafalakam

      ప్రకృతి లేని కవిత్వముండదు. కవిత్వానికి మొదటి వస్తువు ప్రకృతి. కవి రచయిత తన రచనా వ్యాసాంగంలో ఏదో ఒక రూపంలో ప్రకృతి పచ్చదనం ఇమిడి పోతుంది.       ఈ ప్రకృతి ఒడిలో మానవ జీవిత మూలాలను నాగరికత సుఖ దు:ఖాలను, అనుబంధాలను తన ఒడిలో భద్ర పరుచుకున్నదే పల్లె. పల్లెటూరు మనిషి మొదటి చైతన్యానికి సహజీవనానికి మూలం. అటువంటి పల్లెను అనేక కోణాలలో ఆవిష్కరిస్తూ చక్కని కవిత్వం రాసిండు జీఆర్‌ కుర్మె. ఆ కవిత్వమే 'శిలా ఫలకమనే' దీర్ఘ కవిత.       జీఆర్‌ కుర్మె అనగానే పునాది రాయి గుర్తుకొస్తుంది. ముద్దుగుమ్మ నుంచి సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించి ధమ్మపథం, శిలాఫలకం, ఆనవాలు కవితా సంపుటాలను వెలువరించిండు. కుర్మె మంచి కవిగా తెలుగు సాహిత్య లోకానికి పరిచయం. 2016 ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఇతని శిలాఫలకం.. నిజానికి కుర్మె గారు పుట్టిన ఊరు, బాల్యం, ఆనాటి తన ఎత్తు పల్లాల జీవితమే అయినా.. పల్లె నుంచి పట్టణానికి ప్రయాణమైన ప్రతి మనిషి అనుభూతిగా భావించవచ్చు. నిజంగా ఈ పుస్తకం చదివిన వారికి వాళ్లను బాల్యంలోకి తీసుకెళ్తుంది. 'కుగ్రామంగాని గ్ర...

ఒకే రూపం...అంద‌రిలో ప్ర‌త్యే‌కం - Twins Specialities

నేడు కవలల దినోత్సవం      కడుపులో ఒకేసారి రూపుదిద్దుకుంటారు.. అచ్చం ఒకేలాగా ఉంటారు.. ఒక్కోసారి ఇద్దరినీ చూస్తే ఎవరు ఎవరో గుర్తుపట్టలేరు. అరె వీరిద్దరు సేమ్‌ టూ సేమ్‌ ఉన్నారే.. కవల పిల్లలు కనిపించిన చోట ఇలాంటి మాటలు మామూలే.. పుట్టిన బిడ్డను చూసీ తండ్రిలా ఉన్నారనో.. తల్లిలా ఉన్నారనో పోలికలు చూసి ముచ్చటపడతాం.. ప్రపంచంలో ఏడుగురు మనలాంటి రూపు రేఖలున్నవారు ఉన్నారని చర్చించుకుంటాం. ఏది ఏమైనా కవలలు ఓ అద్భుతం.. విచిత్రం.. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. నవతెలంగాణ - ఆదిలాబాద్‌ టౌన్‌ కవలలు.. కన్నవారికి సిరిసంపదలు.. మురిపాల ముద్దు బిడ్డలు. ఇద్దరూ ఒకేలా ఉంటారు. చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తారు. వారు ఇంట్లో ఉన్నా.. బడికెళ్లినా.. బజారుకెళ్లినా.. బంధువులతో తిరుగుతున్నా ప్రత్యేకతను చాటుకుంటారు. ఇక ఇద్దరూ ఒకే డ్రెస్‌ వేసుకుంటే ఒక్కోసారి అమ్మానాన్నలే గుర్తుపట్టలేరు. అచ్చం అలాగే ఉన్నవారిని ఒక్క క్షణమైనా ఆగి చూడాలనిపిస్తుంది. పేర్లు అడగాలనిపిస్తుంది. ట్విన్స్‌ అంటే అంతేమరి. భారతదేశంలో మొదటిసారిగా ట్విన్‌ ప్యారడైజ్‌ పేరుతో...